నూనె గింజలలోని తేమశాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాజు పెట్రి డిస్‍లు
అనలైటికల్ బాలెన్స్
ఎయిర్‍-ఒవన్
గాజు డెసికెటరు
మాయిచ్చర్‍బాలెంస్
డిజిటల్ మాయిచ్చర్‍మీటరు

నూనె గింజలలోని తేమ శాతాన్ని (Determination of moisture content) గుర్తించుటకు/నిర్ణయించుటకు ప్రస్తుతం 3 విధానాలున్నాయి.

a. ఎయిర్ ఒవెన్ పద్ధతి (air oven method) [1][2]

b. మాయిచ్చర్‍బాలెన్స్ (moisture Balance) పద్ధతి.

c. డిజిటల్ మాయిచ్చర్ మీటరు. పై పద్ధతులలో కేవలం నూనెగింజలలోని తేమశాతం మాత్రమే కాకుండ, గింజలనుండి నూనె తీయగా వచ్చు ఆయిల్‍కేకు/తెలగపిండి/నూనెచెక్క/లలోని తేమశాతాన్ని కూడా లెక్కించ వచ్చును.

a. ఎయిర్ ఓవెన్ పద్ధతి[మార్చు]

పరికరాలు;

1. మాయిచ్చర్ డిష్:70-80 మి.మీ.వ్యాసం, 20మి.మీ. ఎత్తు, 0.45-0.46 మి.మీ మందం వున్న అల్యూమినియం లేదా గ్లాస్ పెట్రిడిష్ (Petri dish)

2. ఎయిర్ ఒవన్ :ఉష్ణోగ్రతను కావల్సిన మేరకు నియంత్రికరంణ చేయు అమరిక వుండి, విద్యుతు ద్వారా హీటింగ్ ఎలెమెంట్ ను వేడుచేయునది.

3. డెసికెటరు (Desicator) : గాజుతో చెయ్యబడి, డ్రై కాల్సియం ఆక్సైట్ లేదా గాఢ సల్ఫ్యూరిక్ ఆసిడ్ను అడుభాగంలో నింపివున్నది.

4. ఎనలైటికల్ బ్యాలెంస్: 200 మి.గ్రాం.ల కెపాసిటిది. 0.01 మి.గ్రాం వరకు భారాన్ని గుర్తించగలిగి వుండాలి.

విధానం:

శుభ్రమైన అల్యూమినియం లేదా గ్లాస్‍పెట్రిడిష్ ను ఎనలైటికల్ బ్యాలెంస్ (anatytical Balance) తూచి, దాని కచ్చితమైన భారాన్ని (W) గుర్తించి, రిపోర్ట్ బుక్ లో నమోదు చేయాలి. డిష్‍లో దాదాపు 10 గ్రాముల వరకు పరీక్షించవలసిన పదార్థం యొక్క సాంపిల్ తీసుకొని, దాని కచ్చితమైన భారాన్ని డిష్‍తో సహ తూచి, దాని భారాన్ని (W1) నమోదు చేయాలి. ఇప్పుడు సాంపిల్ వున్న డిష్ ను 1050C ను కలిగివున్న ఎయిర్ ఒవన్ లో సుమారు ఒక గంటసేపు వుంచాలి. ఈ ఉశ్హ్ణొగ్రత వద్ద పదార్థం లోని తేమ ఆవిరిగా మారును. గంట తరువాత ఒవన్ నుండి బయటకు తీసి డెసికెటరులో వుంచి చల్లార్చవలెను. చల్లరిన తరువాత బయటకు తీసి ఎనలైటికల్ బ్యాలెంస్ లో తూచి దాని భారాన్ని (W2) నమోదు చేయాలి. తిరిగి సాంపిల్ వున్న డిష్ ను ఓవన్ లో ఒక అరగంట సేపు వుంచాలి. యిప్పుడు సాంపిల్‍ను ఒవన్ నుండి బయటకు తీసి, డెసికెటరులో చల్లార్చి భారాన్ని తూచి నమాదు చేయాలి. ఇలా రెండు వరుస భారాల మధ్య తేడా 1 మి.గ్రాం. కన్న తక్కువగా వచ్చు వరకు చెయ్యలి. తూచుటకు డిజిటల్ లేదా ఎలక్ట్రికల్ బ్యాలెంస్ ఉపయోగించడం వుత్తమము.ఒవన్ లో వుంచడం కొల్పోయిన పదార్థ భారాన్ని వందచే (100) గుణించి, వచ్చిన విలువను, పరీక్షించుటకైతీసుకున్న నూనె గింజల భారంతో విభజించిన/భాగహరించిన తేమ శాతం వచ్చును.

తేమశాతం:

తేమశాతం


వివరణ

W=ఖాళి పెట్రి డిస్‍భారం, గ్రాం.లలో

W1=పరీక్షించు పదార్థం+పెట్రిడిస్ భారం, గ్రాం.లలో

W2=ఎయిర్ ఒవన్‍లో డ్రై ఆయిన తరువాత పదార్థం+ పెట్రి డిస్ భారం, గ్రాం.లలో

b. మాయిచ్చర్ బ్యాలెన్స్ [3][మార్చు]

మాయిచ్చర్ బ్యాలెంస్ లో స్ప్రింగ్ లీవర్ పై బ్యాలెంస్ గా అమర్చిన తెలికపాటి పళ్లెం (plate) వుండును. బ్యాలెంస్ పైభాగపు మూతకు ఇన్ ఫ్రారెడ్ బల్బ్ బిగించబడి వుండును. ఈ బ్యాలెంస్ లు 10 లెదా 20 మి.గ్రాం.ల కెపాసిటివి వుండును. బ్యాలెంస్ కు ఒక వైపున కదిలే ఇండికెటరు వున్న స్కేల్ వుండును. పళ్ళెంలో సాంపిల్‍ను ఇండికెటరు (సూచిక ముల్లు) స్కేలుపై సున్న (zero) మీదకు జరుగు వరకు వేయ్య వలెను. ఇప్పుడు బల్బ్ వున్న మూతను మూసి బల్బ్ ను అన్ చేయ్యవలెను. బ్యలెంస్ కు లోపల ఒక గాజు థర్మామీటరు వుండును. బల్బ్ కు ఇచ్చు విద్యుతు వోల్టులను తగ్గించుటకు పెంచుటకు ఒక స్విచ్ వుండును. బల్బ్ నుండి వెలువడు ఇన్ ఫ్రారెడ్ కిరణాల వలన సాంపిల్ వేడెక్కును.ఉష్ణోగ్రత 1050C దాటకుండునట్లు వేడి అగునట్లు బల్బ్ కు విద్యుతును ఇచ్చెదరు. పదార్థంలోని తేమ ఆవిరికావడం వలన, పదార్థభారం తగ్గి, పళ్లెం పైకి లెచును. ఇప్పుడు ఇండికెటరు కున్న వాబ్‍ను తిప్పి ఇండికెటరు స్కేలు మీద ఏ సంఖ్య వద్ద ఏకీభవిస్తుందో, ఆ విలువను పదార్థంలోని తేమ శాతంగా నిర్ణయిస్తారు.

c. డిజిటల్ మాయిచ్చర్ మీటరు[మార్చు]

ఈ పరికరాన్ని ఉపయోగించి పదార్థంలోని తేమ శాతాన్ని నేరుగా గుర్తించ వచ్చును. డిజిటల్ మాయిచ్చర్ మీటరు ఒక చిన్న పెట్టె వలె వుండును. పైభాగంన సాంపిల్ (పరీక్షించ వలసిన పదార్థం ) ను నింపుటకు చిన్న హపర్ వుండును.హపరుకు తేమను గుర్తించగలిగే సెంంసరులు (sensors) అమర్చబడి వుండును. తేమ శాతాన్ని సూచించు డిజిటల్ ఇండికెటరు వుండును. దాని దిగువన స్విచ్ బటన్ వుండును. పరీక్షించవలసిన నూనె గింజలను డిజిటల్ మీటరు హపర్ నిండుగా నింపవలెను. గింజలను హపరులో గట్తిగా వత్తరాదు. మాములుగా నింపాలి.నింపిన ఒక నిమిషం తరువాత స్విచ్ బటన్ నొక్కిన నూనె గింజలలోని తేమ శాతం డిజిటల్ ఇండికెటర్ ద్వారా కనిపించును. మీటరును ప్రింటరుకు అనుసంధానం చేసిన పేపరు ప్రింట్ అవుట్ వచ్చును.అన్ని నూనె గింజలకు ఒకేరకం డిజిటల్ మీటరు పనిచెయ్యదు.ఈమీటరు తయారుదారునికి ఏ నూనెగింజలను పరీక్షించాలనుకుంటున్నారో ముందుగా తెలియచెయ్యాలి. దానికనుగుణ్యంగా మీటరును కాలిబ్రెసన్‍ చేసి పంపిస్తారు.ఒక రకం నూనెగింజకు తయారుచేసినది మరో నూనె గింజలశాతాన్ని నిర్ణయించుటకు పనిచెయ్యదు.ఒకే మీటరులో ఒకటికంటె ఎక్కువ గింజలను పరీక్షించుటకు తయారుచేసిన మీటరులో ఒకో రకానికి ఒకో బటన్ నొక్కాలి.

మూలాలు[మార్చు]