నూనె గింజలలోని మాంసకృత్తులు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
నూనె గింజలన్నియు అత్యధికశాతం మాంసకృత్తులను / ప్రోటినులను అధికమొత్తంలో కలిగివున్నాయి. నూనెగింజలలో ప్రొటిన్ 15-50% వరకు ఆయారకాన్ని బట్టివుండును. వ్యవసాయఉత్పత్తి అగు నూనెగింజెలలో 95% వరకు ఆహారయోగ్యమైనవే, ఉదా: వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు, కొబ్బరి, ఆవాలు, వంటివి.కాని ఆముదం వంటివి ప్రొటిన్‍ను కలిగి వున్నను ఆహరయోగ్యం కాదు. పత్తిగింజలను పశువులదాణాలో వాడవచ్చును. పత్తిగింజలలో గొసిపొల్ అనేపదార్థం విషతుల్యం. అయితే పత్తిగింజలను 1000C వరకు వేడిచేసిన పత్తిగింజలలోని గొసిపొల్ నిర్విర్యం అగును. గొసిపొల్‍ను నిర్విర్యం / క్రియారహితం (deactivated) చేసిన పత్తిగింజల ఆయిల్‍కేకును పశువులదాణాలో వాడెదరు. అలాగే సోయాగింజలలో 30% వరకు ప్రొటిన్ వుండును. సొయా గింజలలోని మొత్తం నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్సను పద్ధతిలో తీసిన తరువాత సోయాలో ప్రోటిన్/మాంసకృత్తులు శాతం 47-50% వరకు పెరుగును. కాని సోయాలో వున్న యురెసిటి కారణంగా సోయాను ఆహారంలో తీసుకున్నను, పశువులదాణాగా వాడినను జీర్ణంకాదు, ఆజీర్థి చెయ్యడం, కడుపువుబ్బరించడం జరుగును. అయితే సోయాలోని యురేసిట్ ఎంజైం అత్యధికఉష్ణోగ్రతలో నశించును. అందుచే సోయాను 100-1050C వరకు వేడిచేసి యూరెసిటి అక్టివిటి విలువ 0.025 కన్న తక్కువ వున్నచో ఆహరపదార్థలలో (సోయా మీట్), పశువుల, కోళ్ల, చేపలదాణాగా వినియోగిస్తారు.
ప్రోటినులు వున్న పదార్థములను గాఢగంధకీకామ్లం (con.sulphuric Acid) తో చర్యనొందించినచో, ప్రొటినులోని నత్రజని (నైట్రొజన్) సల్ఫురిక్ ఆమ్లంతో సంయోగం వలన 'అమ్మోనియం సల్పెట్ ' గా ఏర్పడుతుంది. ఇలా ఎర్పడిన అమ్మోనియం సల్పెట్ ను కాస్టిక్ (సోడియం హైడ్రాక్సైడ్, ( NaOH) తో రసాయనికచర్య పొందించిన 'అమ్మోనియం' వాయువు వెలువడును. ఇలా వెలువడిన అమ్మోనియం (NH3) వాయువును తెలిసిన నార్మాలిటి (known normality) గల సల్ఫురిక్ ఆమ్లంతో చర్యనొందించి, చర్య అనంతరం మిగిలిననార్మాలిటి సల్ఫురిక్ ఆమ్లం పరిమాణం ఆధారంగా వెలువడిన నైట్రొజన్ శాతాన్ని లెక్కించెదరు. వచ్చిన నత్రజని విలువను 6.25 చే గుణించిన పదార్థములోని ప్రొటినుశాతం వచ్చును. ప్రొటినులో నైట్రొజన్ దాదాపు 16% వుండును. దానిని శాతంగా మార్చిన (100 divided by 16) 6.25 అగును.
నూనెగింజలలోని నత్రజని, ప్రొటినుశతాన్ని జెల్డాల్ డిస్టిలెసన్ (kjeldhal distillation) పద్ధతిలో చేసి నిర్ణయించెదరు. జెల్డాల్ డిస్టిలెసన్ పద్ధతిలో కూడా మాక్రో, సెమి మైక్రో, మైక్రో జెల్డాల్ డిస్టిలెసన్ అని మూడు ఉపపద్ధతులు ఉన్నాయి.
ఇక్కడ మాక్రొ జెల్డాల్ పద్ధతిలో ప్రొటిన్/నైట్రొజనును లెక్కించు పద్ధతిని వివరించడం జరిగింది.
జెల్డాల్ డిస్టిలెసన్ పద్ధతిలో ప్రొటిన్ శాతం నిర్ణయించుట
[మార్చు]పరికరాలు
[మార్చు]
1.జెల్డాల్ డిస్టిలెసన్ పరికరసముదాయం.
a. B24 మూతివున్న (mouth), పొడనవైనమెడ (long neck) వున్న 800 మి.లీ. కెపాసిటివున్న జెల్డాల్ ఫ్లాస్కు (kleldhal Flask).
b. ఒక B24 కోన్ (cone), రెండు సమాంతరంగా (parallel) వున్న B19 సాకెట్లు వున్న మల్టిపుల్ అడాప్టరు (Multiple adapter).. c. B 19 X 2 కోనులున్న పియరు ఆకారపు ఫ్లాష్ హెడ్ (pear shape flash head vertical) వున్న వెర్టికల్.
d.19 కోన్+ సాకెట్ వున్న 50 మి.మీ.పొడవు వున్న లిబెగ్ కండెంసరు. (leibeg condenser)
e. స్టాప్ కాక్ (stop cock) వున్న 100 మి.లీ. సిలెండరికల్ డ్రాపింగ్ ఫన్నల్ (cylindrical dropping Funnel)
f. B 19 సాకెట్ వున్న, నేరు (straight) డెలివరి గొట్టంవున్న రిసివింగ్ ఆడాప్టరు (Straight deliver, Receiving adapter).
2. 250 మి.లీ. కెపాసిటి కోనికల్ ఫ్లాస్కు (conical Flask)
3. హీటరు/హట్ ప్లెట్. విద్యుతుతో పనివేయునది.
4. ఎనలైటికల్ బాలెన్సు. 200 మి.గ్రాం.ల కెపాసిటి ఉంది. 0.1 మి.గ్రాం. వరకు కచ్చితంగా తూచగల్గినది.
5. 50 మి.లీ. కెపాసిటి బ్యూరెట్. ఒక మిల్లి లీటరుకు పదిసమానభాగాలుగా విభజన ఉంది.
6. 25 మి.లీ. మెసరింగ్ సిలండరు (కొలజాడి).
7. 25 మి.లీ. బల్బ్ పిప్పెట్.
రసాయనిక పధార్దములు
[మార్చు]1.సోడియం సల్పెట్ (అన్ హైడ్రస్).కెమికల్లి ప్యూర్.అనలార్ గ్రేడ్
2.కాపర్ సల్పెట్.కెమికల్లి ప్యూర్.అనలార్ గ్రేడ్
3.సెలినియం.కెమికల్లి ప్యూర్.అనలార్ గ్రేడ్
4.గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం.1.84 డెంసిటి (Density) వున్నది (H2.SO4)
5.సోడియం హైడ్రాక్సైడ్ (NaOH) ద్రావణం:250 గ్రాం.ల సోడియం హైడ్రాక్సైడ్ ను 500 మి.లీ.ల నీటిలో కరగించి తయారు చేసింది.
6. 0.1 నార్మాలిటి (normality) వున్న సల్ఫూరిక్ ఆమ్ల ద్రావణం.
7. 0.1 నార్మాలిటివున్న సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం, నార్మాలిటి ధ్రువికరించింది.
8.మిథైల్ రెడ్ ఇండికెటరు ద్రావణం:100 మి.లీ.ఆల్కహల్ లో 0.2మి.గ్రాం.ల మిథైల్ రెడ్ పౌడరును కరగించి తయారు చేసింది.
9.డిస్టిల్ వాటరు.
పరీక్షించు విధానం
[మార్చు]పరీక్షించ వలసిన నూనె గింజలను500గ్రాం.ల వరకు తీసుకుని మొదట బాగా కలుప వలెను.అందునుండి 100 గ్రాం.ల వరకునూనె గింజలను తీసుకుని చేతి గ్రైండరు లేదా మిక్సిలో మెత్తటి పౌడరులా చేసి అందునుండి పరీక్షకై నూనెగింజలపుడిని తీసుకొనవలెను. జెల్డాల్ పద్ధతి రెండు దశలలో జరుగును.మొదటిది డైజెసన్ (Digestion, రెండవది డిస్టిలెసన్. డైజెసన్ దశలో పరీక్షించ వలసిన పదార్థానికి గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని చేర్చి, చర్య చురుకుగా వేగవంతంగా జరుగుటకై కెటలిస్టులుగా సోడియం సల్పేట్, కాపరు సల్పేట్, సెలినియాన్ని చేర్చి వేడిచేయుదశను డైజెసను దశ అంటారు. డైజెసన్ వలన ఏర్పడిన పదార్థముకు సోడియం హైడ్రాక్సైడ్ ను చేర్చి రసాయనిక చర్య జరిపించి ఆమ్మోనియ వాయువును ఉత్పత్తిచేసి, దానిని నార్మాలిటి సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపించి, టైట్రెసన్ చేయు దశను డిస్ట్లెసను దశ అంటారు.
డైజెసను దశ
[మార్చు]కచ్చితంగా తూచిన 0.5-1.0 గ్రాం.ల పరీక్షించలసిన పదార్థమును 800 మి.లీ.ల జెల్డాల్ ఫ్లాస్కులో తీసుకొనవలెను. పదార్థమును ఫ్లాస్కులో వెయ్యునప్పుడు ఫ్లాస్కు యొక్క అడుగుభాగంలో నేరుగా పదార్థము పడునట్లు వెయ్యవలెను. లేదా పదార్థమును ఫిల్టరు పేపరులో తిసుకొని, తూచి, పదార్థముతో సహ మడచి ఫ్లాస్కులో వెయ్య వచ్చును. (పదార్థభారం=ఫిల్టరు పేపరుతో పదార్థ భారం -ఫిల్తరు పేపరు భారం). యిప్పుడు ఫిల్టరు ఫ్లాస్కులో 10 గ్రాం.లలో 10 గ్రాం.ల అన్ హైడ్రస్ సోడియం సల్పెట్, 0.2-0.3 గ్రాం.ల కాపరు సల్పెట్, స్వల్ప ప్రమాణంలో సిలినియం చేర్చాలి. తరువాత 20-25 మి.లీ.గాఢ సల్ఫ్హూరిక్ ఆమ్లాన్ని కలపాలి. ఇలా పైన పెర్కొన్న రసాయన పదార్థములను కలిపిన పిమ్మట ఫ్లాస్కును పొగ గదిలో (smoke chamber) వుంచి కాయిల్ హీటరు ద్వారా వేడి చేసి డైజెసన్ ' ప్రక్రియను కొనసాగించాలి. రసాయనిక చర్య జరుగునప్పుడు సల్ఫరు వాయువులు వెలువడును. అందుచేతనే ఫ్లాస్కును స్మోక్ చెంబరులో వుంచి వేడి చెయుదురు.స్మోక్ చెంబరు పై భాగంలో ఒక పొగ గొట్టం వుండును. ఏర్పడిన సల్ఫరు తదితరా వాయువులు దాని ద్వారా బయటకు వెళ్ళును. ఈ స్మోకు చాంబరును లాబొరెటరి బయట వుండును. వేడి చెయ్యడం వలన పదార్థములు రసాయనిక చర్య చెంది ఫ్లాస్కులో లేత నీలపురంగు లెదా రంగులేని ద్రవం ఏర్పడును.హీటరును ఆపి వేసి, ఫ్లాస్కు పూర్తిగా చల్లారు వరకు వేచి వుండాలి. ఈ విధముగా జరిపిన చర్యను డైజెసన్ అంటారు.ప్రస్తుతం డైజెసన్ సమయంలో ఉత్పన్నమగు వాయువులను తొలగించుటకు ఎక్సాస్ట్ ఫ్యాన్ లనుపయోగిస్తూన్నారు.
డిస్టిలెసన్ దశ
[మార్చు]ఫ్లాస్కు చల్లారిన తరువాత 200-250 మి.లీ.ల డిస్టిల్ వాటరును ఫ్లాస్కులో చేర్చ వలెను. ఫ్లాస్కు వేడిగా వున్నప్పుడు డిస్టిల్ వాటరును చేర్చిన ఫ్లాస్కు పగిలి పోవును. డిస్టిల్ వాటరును చేర్చిన తరువాత ఫ్లాస్కులో ఏర్పడిన పదార్థం అంతయు డిస్టిల్ వాటరులో కరుగు నట్లు ఫ్లాస్కును అటు ఇటు కదలించాలి. ఇప్పుడు ఫ్లాస్కుకును మాంటిల్ హీటరుపై అమర్చి, జెల్డాల్ ఫ్లాస్కు మూతికి మల్టిపుల్ అడాప్టరును బిగించాలి. ఆడాప్టరుకున్న రెండు పారలల్ (parallel) సాకెట్ల లల్లో ఒక దానికి 100 మి.లీ.డ్రాపింగ్ ఫన్నల్, రెండవదానికి పియరు షేప్ బల్బ్ వున్న వెర్టికల్ ఒక కొనను అమర్చాలి. వెర్టికల్ రెండవ కొనకు లెబెగ్ కండెంస్సరు పైభాగం సాకెట్ కు బిగించాలి. కండెంసరు క్రింది కోన్ కు రిసివరు అడాప్టరును బిగించాలి.
జెల్డాల్ ఫ్లాస్కులో కొన్ని ఫ్యుమిక్ స్టోంస్ వెయ్యాలి.ఇవి చర్యా సమయంలో ఫ్లాస్కులో బంపింగ్ రాకుండ నిరోధించును. శుభ్రమైన 250 మి.లీ. కొనికల్ ఫ్లాస్కులో పిప్పెట్ ద్వారా 25 మి.లీ.ల 0.1 నార్మాలిటి వున్న సల్ఫురిక్ ఆమ్లాన్ని తీసుకొన వలెను. ఆసిడ్ తీసుకొన్న తరువాత ఈ ఫ్లాస్కును లెబెగ్ కండెంసరు దిగువన వున్న రిసివింగ్ అడాప్టరు క్రింద వుంచాలి. రిసివింగ్ అడాప్టరు గొట్టపుక్రింది అంచు కొనికల్ ఫ్లాస్కులోని ఆసిడ్ లో మునిగి వుండెలా కొనికల్ ఫ్లాస్కును అమర్చాలి.2-3 మి.లీ.మిథైల్ రెడ్ ఇండికెటరు ద్రావణమును కొనికల్ ఫ్లాస్కులోని ఆసిడ్ కు చేర్చాలి.జెల్డాల్ ఫ్లాస్క్ కు అమర్చిన డ్రాపింగ్ ఫన్నల్ లో సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం నింపి, దాని స్టాప్ కాక్ ఒపన్ చేసి 50-60 మి.లీ.ల ద్రావణాన్ని జెల్డాల్ ఫ్లాస్కు లోకి వదలాలి.ఇప్పుడు నెమ్మదిగా ఫ్లాస్కును వేడి చెయ్యడం మొదలుపెట్టాలి.రసాయనిక చర్వ వలన అమ్మోనియం వాయువు ఉత్పన్నమై పియర్ ఆకారపు వెర్టికల్ గొట్టం ద్వారా లెబెగ్ కండెంసరు చేరును.లెబెగ్ కండెంసరుకు వచల్లని నీటి ప్రవాహంవుండటం వలన కండెంసరులో అమ్మోనియా వాయువుచల్లబడి ద్రవ రూపం లోకి మారి దిగువన వున్న కొనికల్ ఫ్లాస్కులో చేరి, అందులో వున్న 0.1నార్మాలిటి సల్ఫూరిక్ ఆమ్లంతో చర్య పొందటంజరుగుతుంది.ఈ విధంగా డిస్టిలెసన్ జరుగుచున్నప్పుడు కొన్ని పర్యాయాలు కొనికల్ ఫ్లాస్కులోని ఆసిడ్ పసుపు రంగుకు మారును.అలాంటప్పుడు వెంటనే పిప్పిట్ ద్వారా మరో 25 మి.లీ 0.1 సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణంచేర్చాలి.ఇలాజరుగుటకు కారణం పరీక్షించుటకు తీసుకున్న పదార్థంలో ప్రొటిన్ శాతం ఎక్కువగా వుండటం వలన డిస్టిలెసన్ సమయంలో విడుదల అగు అమ్మోనియం కొనికల్ ఫ్లాస్కు లోని మొత్తం ఆసిడ్ తో చర్య పొండటం వలన ఇలా జరుగును. కోనికల్ ఫ్లాస్కులోని ఆసిడ్ యొక్క గాఢత విడుదల అగు అమ్మానియా వాయువుకన్న ఎక్కువగా వుండ వలెను.ఇలా ఎదైన సందర్భంలో 25 మి.లీ.ఆసిడ్ ను అదనంగా కొనికల్ ఫ్లాస్కులో తీసుకున్న బ్లాంక్ టెస్ట్ విలువను రెండింతలు చెయ్య వలెను.డిస్టిలెసనును కనీసం 30-40 నిమిషాలపాటు, కొనికల్ ఫ్లాస్కులో ద్రావణం తగినంత జమ అగు వరకు కొనసాగించాలి.డిస్టిలేసను సమయంలో అమ్మోనియా వాయువుతో పాటు కొంత నీరు ఆవిరిగా మారి కండెంసరులో చల్లబడి కొనికల్ ఫ్లాస్కులో జమ అగును.అందుచేతనే కొనికల్ ఫ్లాస్కులోని ద్రావణ పరిమానం పెరుగును.డిస్టిలెసన్ పూర్తయ్యిన తరువాత హీతరును ఆప వలెను.హీటరును ఆపిన వెంటనే ఫ్లాస్కుకు అమర్చిన పియర్ ఆకారపు బల్బ్ వున్న వెర్టికల్ ను తొలగించి లెబెగ్ కండెంసరు పైభాగపు లోపలి అంచులను డిస్టిల్ వాటరుతో వాష్ చెయ్యాలి.కండెంసరు గోడల లోపలి అంచులకు ఎమైన అమ్మోనియా వాయువు అంటుకుని వున్న వాటరు వాష్ ఇవ్వడం వలన కొనికల్ ఫ్లాస్కులో పడును.డిస్ట్లెసను సమయంలో వెలువడిన అమ్మోనియతో చర్యజరపడం వలన కొనికల్ ఫ్లాస్కులోని ఆసిడ్ యొక్క గాఢాత తగ్గివుండును. శుభ్రమైన బ్యూరెట్ లో 0.1 నార్మాలిటి వున్న సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని నింపి స్టాండుకు బిగించాలి.సోడియం హైడ్రాక్సైడ్ యొక్క కచ్చితమైన నార్మాలిటిని ఆక్సాలిక్ ఆసిడ్ తోకాని లేదా సోడియం హైడ్రొజన్ పొథాలెట్ తో కాని ప్రామాణికరించబడి వుండాలి.కొనికల్ ఫ్లాస్కులోని ద్రావణాన్ని కదుపుతూ బ్యూరెట్ లోని సోడియం హైడ్రాక్సైడ్ తో టైట్రెట్ చేస్తు తటస్ధీకరించ ( nuetralisation) వలెను కొనికల్ ఫ్లాస్కులోని ద్రవం పసుపు రంగులోకి మారిన వెంటనే టైట్రెసన్ ఆపి వెయ్య వలెను.టై ట్రెసన్ చెయ్యుటకై బ్యురెట్ లో వాడిన సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణ పరిమాణాన్ని (రిడింగ్), మి.లీ.నమోదు చేయ్యాలి (A).యిదే సమయంలో పరీక్షించుపదార్థం లేకుండగా పైన పెర్కొన్న రసాయనాలను (సోడియం సల్పెట్, కాపర్ సల్పెట్, సెలినియ<, 25మి.లీ గాఢ సల్ఫ్యూరిక్ మ్లాలను జెల్డాల్ ఫ్లాస్కులో తీసుకుని డైసెసన్, డిస్ట్లెసన్ చేసి కొనికల్ ఫ్లాస్కులోని ద్రవాన్ని 0.1 నార్మాలిటి సోడియం హైడ్రాక్సైడ్ తో, కొనికల్ ఫ్లాస్కులోని ద్రవం పసుపు రంగులోకి మారు వరకు టైట్రెసన్ చెయ్యలి.దీనిని బ్లాంక్ టెస్ట్ అంటారు.ఈవిధంగా బ్లాంక్ టెస్ట్ లో బ్యూరెట్ లో వాడిన/టైట్రెసన్ కు ఉపయోగించిన 0.1 నార్మాలిటి సోడియం హైడ్రాక్సైడ్ పరిమాణాన్ని మి.లీ. లలో బ్లాంక్ టెస్ట్ రిడింగ్ (B) అంటారు.
ప్రొటిన్/మాంసకృత్తులశాతం
[మార్చు]వివరణ
B=బ్లాంక్ టెస్ట్ లో వాడిన 0.1నార్మాలిటి సోడియం హైడ్రాక్సైడ్ యొక్క పరిమాణం (బ్యూరెట్ రిడింగ్, మి.లీ.లలో)
A=టెస్టింగ్ కై సాంపిల్ ను తీసుకున్నప్పుడు వాడిన 0.1నార్మాలిటి సోడియం హైడ్రాక్సైడ్ యొక్క పరిమాణం (బ్యూరెట్ రిడింగ్, మి.లీ.లలో)
W= పరీక్షకై తీసుకున్న పదార్థ భారం, మి.గ్రాం.లలో.
N=బ్యూరెట్ లో తీసుకున్న సోడియం హైడ్రాక్సైడ్ యొక్క కచ్చితమైన నార్మాలిటి.
మైక్రొ జెల్డాల్ డిస్టిలెసన్ పద్ధతి
[మార్చు]మైక్రో జెల్డాల్ పద్ధతిలో, డైజెజన్ ను మాక్రో జెల్డాల్ పద్ధతిలోనే చేస్తారు.ఇప్పుడు డైజెసన్ లో ఏర్పడిన పదార్థమును జాగ్రత్తగా 200మి.లీ.ల వ్యాల్యుమెట్రిక్ ఫ్లాస్కునకు చేర్చెదరు, పదార్థానికి డిస్టిల్ వాటరును సరిగా/కచ్చితంగా 200మి.లీ.పరిమాణంవచెలా చెర్చెదరు.ఈ 200మి.లీ ద్రవంనుండి పిప్పెట్ ద్వారా సరిగా 50మి.లీ.ద్రవాన్ని జెల్డాల్ డిస్టిలెసను ఫ్లాస్కునకు చేర్చి, పై విధంగానే డిస్టిలెసన్ టైట్రెసన్ చెయుదురు.వచ్చిన బ్యురెట్ రిడింగ్ ను నమోదు చేయుదురు.ఇప్పుడు ఈ విలువను 8.75 (B-A) N లో వాడి వచ్చిన విలువను 4చే గుణించి, వచ్చిన విలువను పదార్థభారంతో భాగహరించెదరు డిస్టిలేసనుకు 200మి.లీ.లో 50 మి.లీ తీసుకున్నందున అది 4 వవంతుకు సమానం.కనుక వచ్చిన బ్యూరెట్ రిడీంగ్ ను 4చే గుణించి పైన పెర్కొన్న ఫార్ములాలో వాడెదరు.