నూనె గింజలలోని సాండ్/సిలికా శాతం
సహజంగా నూనె గింజలలో సాండ్/సిలికా వుండదు.వరి యొక్క ఉపవుత్పత్తి అగు తవుడు (తవుడు నూనె గింజ కానప్పటికి, తవుడులో14-24% వరకు ఖాద్య తైలం ఉంది.) లో మాత్రం 2-8% వరకు తవుడు యొక్క నాణ్యతను బట్టి వుంటుంది.నూనె గింజలను సేకరించునప్పుడు, బస్తాలలో నింపునప్పుడు బయటి మట్టీ, దుమ్ము, సన్నటిరాళ్ళు వంటివి అందులో చేరు ఆవకాశం ఉంది. కొద్దిగా పెద్దసైజు రాళ్లను మట్టిపెడ్డలు వంటి వాటిని తేలికగానే చూసి చెప్పవచ్చును.అయితే నూనె గింజలనుండి ఇలాంటి వాటిని తొలగించకుండ నూనెను యంత్రాలద్వారా తీసినప్పుడు ఆయిల్ కేకులో సాండ్/సిలికా శాతం పెరుగుతుంది.ఆయిల్ కేకులలో 2-2.5% వరకు సాండ్/సిలికా వుండుటకు కొనుగోలుదారులు ఒప్పుకుంటారు.అంతకు మించివున్నచో ధర తగ్గించికొనుగోలు చెయ్యడంకాని లేదా సరుకును నిరాకరించవచ్చును.ఆయిల్ కేకులను ఎక్కువగా పశువులదాణా, కొళ్ళదాణాగా వాడటం వలన ఆయిల్ కేకులలో, నూనెను సాల్వెంట్ ప్లాంట్ ద్వారా నూనెతీయబడిన డిఆయిల్డ్ కేకులలోని సాండ్/సిలికా శాతాన్ని ప్రయోగశాలలో పరీక్షచేసిచూచెదరు.నూనె గింజలను, ఆయిల్ కేకులను దహించినప్పుడు/కాల్చినప్పుడు అందులోని హైడ్రొకార్బను పదార్థాలన్ని (నూనె, ప్రొటిన్, కార్బొహైడ్రెట్స్ తదితరాలు) దహింపబడి కార్వన్ డయాక్సైడ్ గా నీరుగా పరివర్తనచెంది బయటకు వచ్చును.పదార్థా లలోని కార్బను ఆక్సిజన్తో సంపూర్ణంగా దహింపబడి/సంయోగం చెందికార్బన్ డయాక్సైడ్ (CO2) గాను, హైడ్రోజన్ గాలితో సంయోగంచెంది నీరు గాను (H2O) పరివర్తన చెందును.దహింబడినతరువాత మిగులు బూడిదలోకాల్షియం, సోడియం, పొటాషియం, సాండ్/సిలికా/సిలికాన్ వంటివి అతితక్కువ శాతంలో వుండును. సజలహైడ్రొక్లొరిక్ ఆమ్లం (5N) లో సాండ్/సిలికా తప్ప మిగిలినవి కరగును.కనుక నూనెగింజలను, ఆయిల్ కేకులను మొదట దహన పరచి మిగిలిన బూడిదలోని పదార్థంలోని వాటిని హైడ్రొక్లోరిక్ ఆసిడ్ లో కరగించి తొలగించిన కేవలం సాండ్/సిలికా మిగులును. సాండ్/సిలికానే ఆసిడ్ ఇన్ సాల్యుబుల్ యాష్ (Acid insoluble ash, అనగా ఆమ్లంలో కరుగని బూడిద.
పరికరాలు
[మార్చు]1.సిలికా మూస/క్రుసిబుల్ (silica crucible) :25-30 మి.లీ.ల కెపాసిటివున్నది.
2.మపుల్ ఫర్నెష్ (Muffle furnace) : ఒక స్టిల్ బాక్సులో రిప్రాక్టరి మట్టి/ఇటుకలతో కట్టబడినఖాళి దీర్ఘఘన ఆకారం వంటి పొయ్యి వుండి, రిప్రాక్టరిలో క్రోమోనికెల్ సమ్మేళన తీగ చుట్టలు స్ప్రింగువలె చుట్టబడి (chromo, nickel) వుండును.ఈ తీగెలు విద్యుతువాహక నిరోధకశక్తి చాలా అధికం.ఈ తీగెలకుండా విద్యుతును పంపినప్పుడు, విద్యుతు నిరోధకం వలన క్రొమొనికెల్ తీగెలు వేడెక్కును. ఉత్పన్నమగు ఉష్ణోగ్రత 600-8000C వరకు వుండును.
3.గాజు గరాటు (glass funnel) :100మి.లీ వ్యాసం ఉంది.
4.బూడిద రాని ఫిల్టరు కాగితం (Ashless Filter Paper) :వ్యాట్ మాన్ నెం,42 ఫిల్టరు పేపరు, వ్రుత్తాకారంగా ఉంది.వ్యాసం 125మి.మీ.
5.ఎనలైటికల్ బాలెన్సు:200గ్రాం.ల కెపాసిటి ఉంది.
6.500 మి.లీ.బీకరు. (Beaker)
రసాయనాలు
[మార్చు]1.హైడ్రొక్లొరిక్ ఆమ్లం:5 (N) నార్మాలిటి ఉంది.
2.డిస్టిల్ వాటరు.
పరీక్షించు విధానం
[మార్చు]పరీక్షించ వలసిన పదార్థాన్ని మొదట చేతి గ్రైండరు లేదా మిక్సిలో పౌడరుగా చెయ్యాలి.పౌడరుగా చేసిన పదార్థాన్ని బాగా కలిపి అందునుండి 3-4 గ్రాం.లలను పరీక్షించుటకై తీసుకోవాలి.మొదట ఖాలి 25-30 మి.లీ.సిలికా క్రుసిబుల్‌ను తూచి దాని కచ్చితమైన భారాన్ని నమోదు చెయ్యాలి.ఇప్పుడు క్రుసిబుల్‌లో సిద్దంచేసిన పదార్థాన్ని 2-4 గ్రాం.లవరకు క్రుసిబుల్‌లో వేసి ఎనలైటికల్ బాలెన్సులో తూచి కచ్చితమైన భారాన్ని నమోదు చేయాలి.క్రుసిబుల్‌ను గ్యాస్ బర్నరు లీదా కాయిల్ హీటరుపై వుంచి పదార్థమంతయు నల్లని కార్బన్‌గా మారు వరకు కాల్చవలెను.ఇప్పుడు క్రుసిబుల్‌ను 550-600 0C ఉష్ణోగ్రత వున్న మఫుల్/రిప్రాక్టరి ఫర్నెష్‌లో వుంచాలి.మఫుల్ ఫర్నెష్‌లో ఉష్ణోగ్రతను కావల్సిన మేరకు నియంత్రణచేయుటకు వీలుగా రెగ్యులెటరు వుండును.క్రుసిబుల్‌ను మఫుల్ ఫర్నెష్‌లో పరీక్షించు పదార్థం పూర్తిగా తెల్లని బూడిదరూపంలోకి వచ్చువరకు వుంచాలి.పదార్థం భారాన్ని బట్టి 40-60 నిమిషాలు పట్టును.తెల్లని బూడిదగా ఏర్పడిన తరువాత టాంగ్స్ సహాయంతో క్రుసిబుల్‌ను ఫర్నెష్ నుండి బయటకుతీసి డెసికెటరులో వుంచి చల్లార్చవలెను.ఇదేసమయంలో హీటరు మీద కొంత (50-100మి.లీ.) 5N హైడ్రొక్లొరిక్ ఆమ్లాన్ని గోరు వెచ్చగా వుండునట్లు వేడి చెయ్యాలి.ఒక గాజు గరాటు తీసుకొని ఫిల్టరుస్టాండులో వుంచి, దానిలో మడతలుగా చేసిన నెం.42 ఫిల్టరు పేపరును వుంచాలి.క్రుసిబుల్‌లో గోరువెచ్చని 5N హైడ్రొక్లోరిక్ ఆమ్లాన్ని 20-25 మి.లీ, పోయాలి.శుభ్రమైన గాజుకడ్డిని తీసుకొని క్రుసిబుల్‌లోని ఆమ్లంలో బూడిద కరిగేలా తిప్పవలెను.ఒక 10 నిమిషాలవరకు క్రుసిబుల్‌ను తక్కువ ఉష్నోగ్రతలో వేడిచేస్తు, గాజుకడ్డితో కలియతిప్పుతూ వుండాలి.ఇప్పుడు క్రుసిబుల్‌లోని ఆమ్లద్రవాన్ని గాజు గరాటులోని ఫిల్టరు పేపరులో జాగ్రత్తగా పొయ్యాలి.సిలికా క్రుసిబుల్లో మిగిలివున్న ద్రవాన్ని డిస్టిల్ వాటరుతో జాగ్రత్తగా వాష్ చేసి గరాటులోని ఫిల్టరు పేపరులో పడునట్లు చేయ్యాలి.ఫిల్టరు పేపరులో వేసిన ఆమ్ల ద్రవం ఫిల్టరు అయ్యి క్రింద వున్న బీకరులో పడును.సాండ్/సిలికా ఫిల్టరు పేపరులో వుండి పోవును.ఇప్పుడు ఫిల్టరు పేపరులో వున్న పదార్థానికి పలు దపాలుగా డిస్టీల్ వాటరుతో వాషింగులు ఇచ్చిన ఫిల్టరు పేపరులోని హైడ్రొక్లొరిక్ ఆమ్లం మొత్తం క్రిందిబీకరుకలో కలెక్టు అగును.లిట్మస్ పేపరు టెస్ట్ ద్వారా ఫిల్టరు పేపరులోని ఆసిడ్ మొత్తం ఫిల్టరు అయ్యినది లేనిది నిర్ధారణ చేసుకొవాలి.ఫన్నల్‌నుండి వచ్చు వాటరు క్రింద బ్లూ లిట్మస్ పేపరునుంఛిన, వాటరులో ఇంకా ఆమ్లం వున్న అది పింక్/రెడ్ కు మారును.వాషింగ్‌లో ఆమ్లం లేనిచో రంగు మారదు.ఫిల్టరు కాగితం అందులోని పదార్థం అమ్లరహితమైనదని నిర్ధారణ చెందాక ఇప్పుడు ఫిల్టరు పేపరును అందులోని పదార్థాన్ని గాగ్రత్తగా మడచి తిరిగి క్రుసిబుల్ లో వుంచాలి.ఇప్పుడు క్రుసిబుల్ ను 30-40 నిమిషాలు ఎయిర్ ఒవన్ లో ఫిల్టరు పేపరు పొడిగా అయ్యెవరకు వుంచాలి.తరువాత క్రుసిబుల్ ను తిరిగి550-600 0Cవుష్ణొగ్రత వున్న మఫుల్ ఫర్నెష్ లో వుంచి క్రుసిబుల్‌లోని ఫిల్టరు కాగితం పూర్తిగా కాలి తెల్లని బూడిదగా మారే వరకు వుంచాలి.ఇప్పుడు క్రుసిబుల్‌ను ఫర్నేష్ నుండి తీసి, డెసికెటరులో చల్లార్చవలెను.చల్లారిన క్రుసిబుల్‌ను ఎనలైటికల్ బాలెంన్సులో తూచి దాని కచ్చితమైన భారాన్ని నమోదు చెయ్యాలి.
పరీక్షించిన పదార్థం లోని సాండ్/సిలికా శాతం
[మార్చు]వివరణ
W=ఖాళి సిలికా క్రుసిబుల్ భారం.గ్రాం.లలో,
W1=పరీక్షించు పదార్థముతో సిలికా క్రుసిబుల్ భారం.గ్రాం.లలో,
W2=బూడిదతో (సాండ్/సిలికా) తో క్రుసిబుల్ భారం.గ్రాం.లలో.
ఇతర పద్ధతులు
[మార్చు]నూనె గింజల్లోని సాండు సిలికా శాతాన్ని NMR(Nuclear Magnetic Resonance Spectrometry )పద్ధతిలో కూడా నిర్ణయించవచ్చును.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Oil, Protein and Moisture Determination in Seeds Using NMR". seedlab.oregonstate.edu. Retrieved 2017-02-22.