Jump to content

నెమరువేయు జంతువులు

వికీపీడియా నుండి

నెమరువేయు జంతువులు
Temporal range: Early Eocenepresent
Scientific classification Edit this classification
Unrecognized taxon (fix): రుమినాంటియా
ఇన్‌ఫ్రాక్రమాలు
  • "ట్రాగులినా"
  • పెకోరా

నెమరువేయు జంతువులు శాకాహారులు. ఇవి సరిసంఖ్యలో గిట్టలుండే జంతువులు. గడ్డి మేస్తాయి. ఇవి రుమినంటియా ఉపక్రమానికి చెందినవి. జీర్ణక్రియకు ముందు, కడుపులోని ప్రత్యేకమైన భాగంలో, తిన్న ఆహారాన్ని ప్రధానంగా సూక్ష్మజీవుల చర్యల ద్వారా పులియబెట్టి వాటిలోని పోషకాలను గ్రహిస్తాయి. జీర్ణవ్యవస్థ ముందు భాగంలో జరిగే ఈ ప్రక్రియను ముందుపొట్ట కిణ్వ ప్రక్రియ అని అంటారు. వృక్షపదార్థాన్ని మరింత విచ్ఛిన్నం చేయడానికీ, జీర్ణక్రియను ప్రేరేపించడానికీ పులియబెట్టిన ఈ ముద్దను మళ్ళీ నమలడం అవసరం. ఈ ముద్దను తిరిగి నమలడాన్ని నెమరు వేయడం (రుమినేషన్) అంటారు.[1][2] నెమరువేసే జంతువులను ఇంగ్లీషులో "రుమినెంట్" అంటారు. ఈ పదం లాటిన్ పదమైన రుమినేర్ నుండి వచ్చింది, దీని అర్థం "మళ్ళీ నమలడం".

దాదాపు 200 జాతుల నెమరువేయు జంతువుల్లో పెంపుడు, అడవి జాతులు రెండూ ఉన్నాయి.[3] క్షీరదాలలో పశువులు, పెంపుడువీ, అడవివీ అయిన పశువులు, మేకలు, గొర్రెలు, జిరాఫీలు, గాజెల్‌లు, జింకలు అన్నీ నెమరువేసే జంతువులే.[4] మరింత విలక్షణమైన హిండ్‌గట్ కిణ్వ ప్రక్రియపై ఆధారపడే తోటి అట్లాంటోజెనాటన్‌లకు భిన్నంగా, నోటౌంగులేట్‌లు కూడా నెమరువేయడంపై ఆధారపడ్డాయని భావిస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా ఖచ్చితంగా తెలియదు.[5]

నెమరువేయు జంతువులు, ఇప్పుడు ఉనికిలో ఉన్న గిట్టల జంతువులలో కెల్లా అత్యంత వైవిధ్యమైన సమూహం.[6] రుమినంటియా ఉపక్రమంలో ఆరు వేర్వేరు కుటుంబాలు ఉన్నాయి: ట్రాగులిడే, జిరాఫిడే, యాంటిలోకాప్రిడే, సెర్విడే, మోస్చిడే, బోవిడే.[7]

నెమరు వేస్తున్న ఇంపాలా. మింగడం, తిరిగి నోట్లోకి తెచ్చుకుని నమలడం గమనించవచ్చు

నెమరువేసే అడవి జంతువులు భూమ్మీద కనీసం 7.5 కోట్లు ఉన్నాయి.[8] అంటార్కిటికా, ఆస్ట్రేలియాలను మినహాయించి, మిగతా అన్ని ఖండాల లోనూ ఇవి ఉన్నాయి.[9] దాదాపు 90% జాతులు యురేషియా, ఆఫ్రికాల్లోనే ఉన్నాయి.[8] ఈ జాతులు విస్తృతమైన వాతావరణ శ్రేణులలో (ఉష్ణమండల నుండి ఆర్కిటిక్ వరకు), వివిధ రకాల ఆవాసాలలో (ఓపెన్ మైదానాల నుండి అడవుల వరకు) నివసిస్తాయి.[8]

నెమరువేసే పెంపుడు జంతువుల జనాభా 350 కోట్లు. ఇందులో పశువులు, గొర్రెలు, మేకలు 95% వరకు ఉంటాయి. మేకలను సా.పూ. 8000 నాటికి దగ్గరి ప్రాచ్య దేశాల్లో మచ్చిక చేసుకున్న ఆధారాలున్నాయి. ఇతర జాతులలో ఎక్కువ భాగం సా.పూ. 2500 నాటికి దగ్గరి ప్రాచ్యంలో, దక్షిణ ఆసియాలో మచ్చిక చేసుకున్నారు.[10]

వివిధ రకాల నెమరువేసే జంతువులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rumination: The process of foregut fermentation". Archived from the original on 19 July 2013. Retrieved 19 December 2013.
  2. "Ruminant Digestive System" (PDF).
  3. (1 May 2005). "A complete estimate of the phylogenetic relationships in Ruminantia: a dated species-level supertree of the extant ruminants".
  4. Fowler, M.E. (2010). "Medicine and Surgery of Camelids", Ames, Iowa: Wiley-Blackwell. Chapter 1 General Biology and Evolution addresses the fact that camelids (including camels and llamas) are not ruminants, pseudo-ruminants, or modified ruminants.
  5. "Rumination: The process of foregut fermentation". Archived from the original on 19 July 2013. Retrieved 19 December 2013.
  6. "Rumination: The process of foregut fermentation". Archived from the original on 19 July 2013. Retrieved 19 December 2013.
  7. (1 May 2005). "A complete estimate of the phylogenetic relationships in Ruminantia: a dated species-level supertree of the extant ruminants".
  8. 1 2 3 Hackmann. T. J., and Spain, J. N. 2010."Ruminant ecology and evolution: Perspectives useful to livestock research and production". Journal of Dairy Science, 93:1320–1334
  9. (1 May 2005). "A complete estimate of the phylogenetic relationships in Ruminantia: a dated species-level supertree of the extant ruminants".
  10. Hackmann. T. J., and Spain, J. N. 2010."Ruminant ecology and evolution: Perspectives useful to livestock research and production". Journal of Dairy Science, 93:1320–1334
  11. Biology Spm, Nalini T. Balachandran, Sia Chwee Khim & Kee Bee Suan, pp. 78, Pelangi Publishing Group Bhd, ISBN 9789830028187, ... Movement of food in the digestive system of a cow, a ruminant: Mouth Rumen -> Reticulum -> Mouth -> Omasum -> Abomasum -> Small intestine ...