నెలపొడుపు
అమావాస్య తరువాత చంద్రుని నుంచి వెలువడే మొదటి రోజు చంద్రకాంతిని నెలపొడుపు లేక నెల పొడుపు అంటారు.
పవిత్రత
[మార్చు]ప్రతి నెలలో ఒకసారి నెలపొడుపు వస్తుంది. ఈ నెలపొడుపును హిందూ, ముస్లింలు చాలా పవిత్రంగా భావిస్తారు.
రంజాన్ మాసం
[మార్చు]తెలుగు వారి మాదిరిగానే ముస్లింలు 'చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '. ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ మాసం ప్రారంభంలో నెల ప్రారంభ సూచిక అయిన నెలపొడుపును చూసి ఉపవాసాలు ప్రారంభిస్తారు.
నెలపొడుపును చూసి రంజాన్ పండుగ
[మార్చు]పవిత్ర ఖురాన్ ఆవిర్భవించిన రంజాన్ మాసంను ఉపవాసంలతో దిగ్విజయంగా పూర్తి చేసాము అనేందుకు గుర్తుగా మరుసటి నెల ప్రారంభ సూచిక అయిన నెలపొడుపును చూసి రంజాన్ పండుగను జరుపుకుంటారు.
నెలపొడుపును చూసి ఇష్టమైన వారిని లేదా ఇష్టమైన వాటిని చూడటం
[మార్చు]నెలపొడుపును చూసిన వెంటనే తనకు ఇష్టమైన వారిని లేదా ఇష్టమైన వాటిని చూస్తారు. ఉదాహరణకు కొంతమంది నెలపొడుపును చూసిన తరువాత వెంటనే తన దగ్గర ఉన్న దేవుని చిత్రాన్ని లేదా ధనలక్ష్మీ ప్రతిరూపంగా భావించే డబ్బుని చూస్తారు, ఈ విధంగా చేయటం వలన ఆ నెలంతా ఆర్థిక ఇబ్బందులు కలగవని నమ్ముతారు.