నెహ్రూ రిపోర్టు

వికీపీడియా నుండి
(నెహ్రూ నివేదిక నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నెహ్రూ రిపోర్టు పుస్తక ముఖచిత్రం
నెహ్రూ రిపోర్టు పుస్తక ముఖచిత్రం

భారత రాజ్యాంగ రచన కోసం 1928లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజ్యాంగ రచనా కమిటీని ఇచ్చిన నివేదికను నెహ్రూ రిపోర్టు అంటారు.[1][2] ఈ నివేదికలో భారతదేశంలో ప్రతిపాదిత నూతన రాజ్యాంగ హోదా గురించి వివరించడం జరిగింది. అన్ని పార్టీల కమిటీ సదస్సుకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షత వహించగా, జవహర్ లాల్ నెహ్రూ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీలో తొమ్మిదిమంది సభ్యులు ఉన్నారు. మోతిలాల్ నెహ్రూ, అలీ ఇమామ్, తేజ్ బహదూర్ సప్రూ, మాధవ్ శ్రీహరి అనీ, మంగల్ సింగ్, షుయాబ్ ఖురేషి, సుభాష్ చంద్రబోస్, జి.ఆర్. ప్రధాన్ మొదలైనవారు తుది నివేదికపై సంతకం చేశారు.

నేపథ్యం[మార్చు]

1927 నవంబరులో బ్రిటన్ ఎగువసభలో జరిగిన చర్చలో భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ మాట్లాడుతూ ‘అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా?’ అని సవాలు విసిరాడు. దాన్ని స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ బొంబాయి వేదికగా 1928, మే 19న ఒక అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి, రాజ్యాంగ రచన కోసం 1928 ఆగస్టు 10న మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఎనమిది మంది సభ్యులతో ఒక ఉపసంఘాన్ని నియమించింది. ఇందులో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కార్యదర్శిగా పనిచేశారు.[3]

ముఖ్యాంశాలు[మార్చు]

  1. స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు, భాషాప్రయుక్త రాష్ట్రాలు అన్న అంశాల ఆధారంగా దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటుచేయాలి
  2. భారతదేశంకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలి
  3. ప్రజలకు కావలసిన పంతొమ్మది ప్రాథమిక హక్కులను కల్పించాలి
  4. శాసన మండలిలో అల్పసంఖ్యాకవర్గాల వారికి కనీసం పదేళ్ళపాటు కొన్ని స్థానాలను కేటాయించాలి
  5. కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖకు బాధ్యత వహించాలి

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ (10 February 2015). "రాజ్యాంగ పరిషత్ న్యాయసలహాదారుడు ఎవరు?". Archived from the original on 10 ఆగస్టు 2018. Retrieved 10 August 2018.
  2. నవ తెలంగాణ (19 March 2015). "నెహ్రు రిపోర్ట్‌ అని దేనినంటారు?". Archived from the original on 10 August 2018. Retrieved 10 August 2018.
  3. సాక్షి (10 August 2015). "భారత రాజ్యాంగం- చారిత్రక నేపథ్యం". Archived from the original on 10 August 2018. Retrieved 10 August 2018.

ఇతర లంకెలు[మార్చు]

వెబ్ ఆర్కైవ్ లో నెహ్రూ రిపోర్టు ప్రతి