నేపాలీ మందిర్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
నేపాలీ మందిర్ | |
---|---|
नेपाली मंदिर | |
వారణాసి జిల్లా మ్యాప్‌లో ఆలయ స్థానం | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 25°18′35″N 83°00′46″E / 25.309821°N 83.012859°E |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | వారణాసి |
ప్రదేశం | లలితా ఘాట్, వారణాసి |
ఎత్తు | 78.161 మీ. (256 అ.) |
సంస్కృతి | |
దైవం | శివుడు |
ముఖ్యమైన పర్వాలు | మహాశివరాత్రి నాగపంచమి |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | పగోడా |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 1843 |
సృష్టికర్త | రాణా బహదూర్ షా & గిర్వాన్ యుద్ధ బిక్రమ్ షా దేవ (నేపాల్ రాజు) |
శ్రీ సామ్రాజ్యేశ్వర్ పశుపతినాథ్ మహాదేవ్ మందిర్ ను నేపాలీ మందిర్ అనీ (హిందీ: नेपाली मंदिर), కంత్వాలా మందిర్, మినీ ఖజురహో (హిందీలో కాంత్వాలా అంటే చెక్క) అనీ పిలుస్తారు. ఇది పవిత్రమైన వారణాసిలోని పురాతన, అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయానికి హిందూ ధర్మంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. సా.శ. 19వ శతాబ్దంలో నేపాల్ రాజు నిర్మించిన ఈ ఆలయాన్ని టెర్రకోట, రాయి, కలపతో నిర్మించారు. ఇది ఖాట్మండులోని పశుపతినాథ ఆలయానికి ప్రతిరూపం.[1][2][3][4][5]
చరిత్ర
[మార్చు]నేపాల్ రాజు, రాణా బహదూర్ షా 1800 నుండి 1804 వరకు వారణాసిలో, "స్వామి నిర్గుణానంద" అనే పేరుతో నివసించాడు. అజ్ఞాతవాస సమయంలో, వారణాసిలో పశుపతినాథ్ ఆలయ ప్రతిరూపాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన వారణాసిలో ఉన్న సమయం లోనే ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. నిర్మాణ సమయంలో, షా తిరిగి నేపాల్‌కు వెళ్లాడు. 1806 ఏప్రిల్ 25న, రాణా బహదూర్ షాను అతని సవతి సోదరుడు షేర్ బహదూర్ షా కత్తితో పొడిచి చంపాడు. అతని కుమారుడు గిర్వాన్ యుద్ధ బిక్రమ్ షా దేవా, నిర్మాణ గడువు ముగిసిన 20 సంవత్సరాల తర్వాత దాన్ని పూర్తి చేశాడు. 1843లో కాశీ రాజు, ఈ భూమిని రాణా బహదూర్ షాకు బదిలీ చేశాడు. ఆలయం, దాని ప్రక్కనే ఉన్న ప్రాంతం, లలితా ఘాట్, ధర్మశాల, నేపాల్ ప్రభుత్వానికి చెందినవి.[1][2][3][4][5]
నిర్మాణం
[మార్చు]ఈ మందిరాన్ని కాల్చిన ఇటుకలు, రాయితో నిర్మించారు. పూర్తి చేయడానికి మూడు దశాబ్దాలు పట్టింది. దీన్ని నేపాలీ నిర్మాణ శైలిలో నిర్మించారు, చుట్టూ చింతచెట్లు, ఆలయం చుట్టూ ఫికస్ రెలిజియోసా (పీపాల్) చెట్లు ఉన్నాయి. ఆలయంలో పగోడా శైలి నిర్మాణం ఉంది, ప్రధానంగా చెక్కతో చెక్కబడింది. ఇక్కడ ఖజురహో ఆలయాల్లో కనిపించే శిల్పాలను పోలిన శిల్పాలు ఉన్నాయి. దీనిని "మినీ ఖజురహో" అని కూడా పిలుస్తారు.
స్థానం
[మార్చు]నేపాలీ మందిరం వారణాసిలోని లలితా ఘాట్‌లో ఉంది. ఇది వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్‌కు ఆగ్నేయంగా 3.8 కిలోమీటర్లు, మణికర్ణికా ఘాట్‌కు 100 మీటర్ల నైరుతి దిశలో ఉంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Nepali Mandir". ixigo.com. Retrieved 2 August 2015.
- ↑ 2.0 2.1 "A piece of Nepal in Varanasi". en:The Times of India. Retrieved 2 August 2015.
- ↑ 3.0 3.1 "This ghat of Goddess Lalita". en:The Times of India. Retrieved 2 August 2015.
- ↑ 4.0 4.1 "Kathwala Temple". en:TripAdvisor. Retrieved 8 August 2015.
- ↑ 5.0 5.1 "Information". buzzntravel. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 8 August 2015.
- ↑ "Location". Google Maps. Retrieved 8 August 2015.