నేరెళ్ల శారద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేరెళ్ల శారద
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మాజీ మహిళా విభాగం అధ్యక్షురాలు

అఖిల భారత మహిళా కాంగ్రెస్ కార్యదర్శి

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు
వ్యక్తిగత వివరాలు
జననంకరీంనగర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
నివాసంహైదరాబాదు

నేరెళ్ల శారద మహిళా హక్కుల కార్యకర్త, భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయవేత్త. ఆమె తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) కార్యవర్గ సభ్యురాలు. ఆమె టిపిసిసి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, అఖిల భారత మహిళా కాంగ్రెస్ కార్యదర్శి కూడా.[1][2][3][4][5]

కెరీర్

[మార్చు]

నేరెళ్ల శారద తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో పుట్టిపెరిగింది. ఆమె కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికయింది. అక్టోబరు 2004లో ఆమె టిపిసిసి ఎథిక్స్ కమిటీకి మెంబర్-సెక్రటరీగా నామినేట్ చేయబడింది.[6][7]

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి జన్మదినం సందర్బంగా కుటుంబసభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలిపిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద

మీడియా

[మార్చు]

2018 సెప్టెంబర్‌లో, పెరుగుతున్న ఇంధన ధరలపై భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె నిరసనలో పాల్గొన్నది.[8]

ఫిబ్రవరి 2019లో, ఆమె భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం బంధుప్రీతి, మహిళలను మంత్రి పదవుల్లోకి ప్రోత్సహించడంలో విఫలమైందని విమర్శించింది.[9] పరీక్ష ఫలితాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యాయని ఏప్రిల్‌లో ఆమె పేర్కొన్నది.[10]

రాజకీయ జీవితం

[మార్చు]

నేరెళ్ల శారద కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ లో వివిధ హోదాల్లో పని చేసి 2001లో రామడుగు జడ్పీటీసీగా ఎన్నికైంది. ఆమె ఆ తరువాత కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలుగా, కరీంనగర్‌ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజినల్‌ చైర్‌పర్సన్‌గా, టీపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా పని చేసింది.

మూలాలు

[మార్చు]
  1. "Congress Mahila Chief Blasts KCR for non-inclusion of Woman Minister". Y This News (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-02-20. Retrieved 2020-02-29.
  2. "Major shake up in Mahila Cong; 5 new state prezs appointed". Business Standard India. 2014-02-18. Retrieved 2020-02-29.
  3. "అది తెలంగాణ మహిళల విజయం: నేరెళ్ల శారద | Telangana Women's success in releasing Rs 960 crore for women's unions - Sakshi". web.archive.org. 2024-03-17. Archived from the original on 2024-03-17. Retrieved 2024-03-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Andhrajyothy (17 July 2024). "మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద". Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.
  5. 10TV Telugu (17 July 2024). "తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నేరెళ్ల శారద" (in Telugu). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. "Briefly". The Hindu. 27 October 2004. Archived from the original on 3 May 2005. Retrieved 18 September 2018.
  7. EENADU (17 March 2024). "శారద.. నరేందర్‌రెడ్డి.. జనక్‌ ప్రసాద్‌". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
  8. India, The Hans (2018-09-11). "Over 300 Congress activists stage dharna". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-02-29.
  9. "Telangana minister faces flak for saying no woman in Cabinet as they are at home". www.aninews.in (in ఇంగ్లీష్). 20 February 2019. Retrieved 2020-02-29.
  10. "Mahila Congress Chief Blames State Govt | INDToday" (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-04-24. Retrieved 2020-02-29.