నేర్నాల కిషోర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేర్నాల కిషోర్
జననం(1979-11-15)1979 నవంబరు 15
వృత్తితెలంగాణ ఉద్యమ, తెలుగు సినిమా పాటల రచయిత
జీవిత భాగస్వామిరమాదేవి
తల్లిదండ్రులు
  • హనుమయ్య (తండ్రి)
  • ఐలమ్మ (తల్లి)

నేర్నాల కిషోర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాటల రచయిత. పల్లె ప్రజల జీవన స్థితిగతులను తన రచనలో ఎంతో సహజంగా రాస్తున్న కిషోర్, 2002లో వచ్చిన 'ఊరు మనదిరా' సినిమాలో 'గుడుంబ కుండవెట్టకే..' పాటతో సినీపాటల ప్రయాణాన్ని ప్రారంభించాడు.[1]

జననం

[మార్చు]

కిషోర్ 1979, నవంబరు 15న హనుమయ్య - ఐలమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, హుస్నాబాద్‌ మండలంలోని మిర్జాపూర్‌లో జన్మించాడు.

పాటల రచయితగా

[మార్చు]

కిషోర్ చిన్నప్పటి నుండి సినిమా పాటలు, దేశభక్తి గేయాలు, తెలంగాణా పల్లెజానపద పాటలను పాడుతుండేవాడు. హైస్కూల్‌ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే కవితలు, పాటలు రాయడం ప్రారంభించిన కిషోర్, వాటిని 'నగారే మోగింది' పేరుతో ఆడియో క్యాసెట్‌ విడుదల చేశాడు. 'ఎట్లున్నవే నా పల్లె నువ్వెట్లున్నవే నా తల్లి', 'బాడర్లో సైనికుడా.. భారత్‌కూ రక్షకుడా!', 'పొడిసేటి పొద్దోలే ఎలమంద' లాంటి ఐదొందలకు పైగా ప్రైవేటు గీతాలు రాయడంతోపాటు కొన్ని పాటలను తానే స్వయంగా పాడాడు. 1996లో కొంతమంది మిత్రులతో కలసి నగారే కళాబృందంను స్థాపించాడు. ఆ కళాబృందం ద్వారా ఎయిడ్స్‌, వరకట్ననిర్మూలన లాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాడు.[2]

తెలంగాణ ఉద్యమం

[మార్చు]

కిషోర్ తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాడు. ఉద్యమంలో భాగంగా వందలాది ధూమ్ ధామ్‌లలో (తెలంగాణ పాటలు, నృత్య ప్రదర్శనలు) ప్రదర్శనలు ఇచ్చాడు. 2011 మార్చి 10న హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌పై జరిగిన తెలంగాణా మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న కిషోర్ అక్కడ పాటలు పాడాడు. దాంతో అక్కడ జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించి కిషోర్ పై పలు కేసులు బనాయించి, అరెస్ట్ చేసి తీవ్రంగా హింసించడంతోపాటు 12రోజులపాటు చంచల్ గూడా జైలులో నిర్భందించారు.[3]

సినిమారంగం

[మార్చు]

కిషోర్ లోని ప్రతిభను చూసిన డబ్బింగ్‌ ఆర్టిస్టు జయదేయ్‌ 2001లో సినీ నిర్మాత, దర్శకుడు ఆర్‌. నారాయణమూర్తికి పరిచయం చేశాడు. అలా ఊరుమనదిరా సినిమాలకు తొలిసారిగా పాటలు రాశాడు.

సినిమా పాటలు

[మార్చు]
  • ఊరు మనదిరా (2002): గుడుంబ కుండవెట్టకే..
  • వేగుచుక్కలు (2003): వందనమో వందనమన్నా మాయన్నో కార్మికుడా!
  • గంగమ్మ జాతర (2004): గంగమ్మా ఓ గంగమ్మా.. నా గంగమ్మా నా కన్నతల్లి గంగమ్మా
  • అమ్మమీద ఒట్టు (2005): రాగం పుట్టింది రామచిలక నోటి వెంటా
  • వీర తెలంగాణ (2010): తల్లి తెలంగాణ

మూలాలు

[మార్చు]
  1. "చైతన్య గీతాల కెరటం - Namasthetelangaana | DailyHunt Lite". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-28. Retrieved 2021-11-28.
  2. చైతన్య గీతాల కెరటం, తిరునగరి శరత్‌ చంద్ర, బతుకమ్మ ఆదివారం సంచిక, నమస్తే తెలంగాణ, 2021 ఏప్రిల్ 4.
  3. ఉద్యమపాటకు ఊపిరిలూదిన అమరుల త్యాగాలు-నేర్నాల కిషోర్, కలర్స్, సూర్య - దినపత్రిక, 2017 జూన్ 10, పుట 9.