Jump to content

నేలవేము

వికీపీడియా నుండి

నేలవేము
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
A. paniculata
Binomial name
Andrographis paniculata

నేలవేము ఒకరకమైన ఔషధ మొక్క. దీనిని ఇంటి వద్ద కుండీలలో పెంచుకోవచ్చును. ఇది వేప కన్నా చేదుగా ఉంటుంది. కాండంలోను, ఆకులోను ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆండ్రోగ్రాఫిస్ పనికులట అనేది వార్షిక పత్ర వృక్షం. ఈ వృక్షం భారతదేశం, శ్రీలంక లలో అకంతేసి అనే కుటుంబానికి చెందినది. ఇది విస్తృతంగా దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో సాగు చేస్తారు. ఇది సాంప్రదాయకంగా అంటువ్యాధులు, కొన్ని వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. ఎక్కువగా ఆకులు, మూలాల ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించారు.

నేలవేము ఇంట్లో పెంచే విధానం

[మార్చు]

కుండీలో విత్తనాలు చల్లుకోవాలి. 8 రోజులకు మొక్క మొలుస్తుంది. కుండీకి రెండు మొక్కలు ఉంచితే చాలు. జూన్‌లో విత్తుకోవచ్చు. ఇది వంద సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. పిలకలు కత్తిరిస్తుంటే గుమ్మటంలా పెరుగుతుంది. సెప్టెంబర్ నాటికి పూత వస్తుంది. ఆ సమయంలో మొక్కను కత్తిరించి నీడన ఆరబెట్టి భద్రపరచుకోవచ్చు. 10-15 సెంటీమీటర్ల ఎత్తున మొక్కను కత్తిరిస్తే.. మళ్లీ చిగుళ్లు వస్తాయి. 60 రోజుల్లో రెండోసారి కోసుకోవచ్చు. చూర్ణం చేసి దాచుకోవచ్చు. తులసి మాదిరిగానే.. దీన్ని రోజూ రెండు పచ్చి ఆకులు లేదా కాండం, ఆకుల పొడి లేదా వాటి కషాయం ఎలా వీలైతే అలా వాడొచ్చు.

ఉపయోగాలు

[మార్చు]

చక్కెర వ్యాధిని అరికడుతుంది. కాలేయ వ్యాధులు రాకుండా చూస్తుంది. వైరల్ / విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. చికున్ గున్యా / విష జ్వరాలు వచ్చిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. గిరిజనులు నేలవేము చెట్లను ఇంట్లో వేలాడగట్టుకొని వాడుకుంటూ ఉంటారు. తేలుకుట్టిన వారికి నేలవేము ఆకు తినిపిస్తే తగ్గిపోతుంది. ఈ ఆకుల చేదు తెలిసే అంతవరకూ తినిపిస్తుండాలి. ఈ వృక్షం ను అలంకరణ కొరకు వాడుతారు. #ఈ మొక్క ఫలాలను నీటి వనరుగా వాడతారు.[1]

ఔషధం వాడే మోతాదు
  1. జ్వరాలు - 1 నుంచి 2 చెంచాల (టేబుల్ స్పూన్ల) చూర్ణం / అర ఔన్సు కషాయం
  2. కామెర్లు - 1 నుంచి 2 చెంచాల చూర్ణం / అర ఔన్సు కషాయం
  3. మధుమేహం - 1 నుంచి 2 చెంచాల చూర్ణం
  4. చర్మ వ్యాధులు - 1 చెంచా చూర్ణం
  5. కాలేయ వ్యాధులు - 1 చెంచా చూర్ణం

మూలాలు

[మార్చు]
  1. [# http://www.ars-grin.gov/cgi-bin/npgs/html/taxon.pl?414228 Archived 2009-05-05 at the Wayback Machine]
  1. https://web.archive.org/web/20090505040402/http://www.ars-grin.gov/cgi-bin/npgs/html/taxon.pl?414228
  2. http://www.theplantlist.org/tpl1.1/record/kew-2637069
  3. http://www.mobot.org/MOBOT/research/APweb/orders/lamialesweb.htm#Lamiales

వెలుపలి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=నేలవేము&oldid=3849334" నుండి వెలికితీశారు