Jump to content

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ

వికీపీడియా నుండి
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లోగో

నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (National Insurance Company Limited (NICL) 1906 సంవత్సరంలో కోల్ కతాలో రిజిస్టర్డ్ ఆఫీసుతో స్థాపించబడింది. 1972 సంవత్సరంలో జనరల్ ఇన్స్యూరెన్స్ బిజినెస్ నేషనలైజేషన్ యాక్ట్ ఆమోదించబడిన తరువాత, ఉత్తర, తూర్పు భారతదేశంలో పెద్ద మార్కెట్ కలిగి ఉన్న భారతదేశంలో రెండవ అతిపెద్ద నాన్ లైఫ్ ఇన్స్యూరర్ గా గుర్తింపు పొందింది. ఫైర్, మెరైన్, ఇతర బీమా , సాధారణ బీమా వ్యాపారాన్ని నిర్వహిస్తుంది.[1]

చరిత్ర

[మార్చు]

నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది భారతదేశపు పురాతన జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. 1906 డిసెంబరు 5 న పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో స్థాపించబడినది. 66 సంవత్సరాల తరువాత, 1972 లో జనరల్ ఇన్స్యూరెన్స్ బిజినెస్ నేషనలైజేషన్ యాక్ట్ ఆమోదించిన తరువాత, 21 విదేశీ, 11 భారతీయ కంపెనీలతో కలిసి నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది, ఇది జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాలుగు సబ్సిడరీలలో ఒకటి, పూర్తిగా భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ చట్టం లోని నిబంధనల ప్రకారం, బీమా వ్యాపారం నియంత్రణ కొరకు ఇప్పటికే ఉన్న భారతీయ సాధారణ బీమా కంపెనీల షేర్లు, ఇతర బీమా సంస్థల లోని అండర్ టేకింగ్ లు జిఐసికి బదిలీ చేయబడ్డాయి. ఆగస్టు 7, 2002న, జాతీయ బీమా దాని హోల్డింగ్ కంపెనీ అయిన జిఐసి నుండి విడదీయబడి, ఒక స్వతంత్ర బీమా కంపెనీగా ఏర్పడింది.

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
రకంజాతీయం చేయబడిన భీమా కంపనీ
పరిశ్రమఆర్ధిక సేవలు
స్థాపన1906; 118 సంవత్సరాల క్రితం (1906)
స్థాపకుడుగోర్ధన్ దాస్ దుతియా
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
సేవ చేసే ప్రాంతము
భారతదేశం,నేపాల్
కీలక వ్యక్తులు
సుచితా గుప్తా (ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్)
ఉత్పత్తులు
రెవెన్యూIncrease 14,233 crore (US$1.8 billion) (2020)[2]
Decrease −2,935 crore (US$−370 million) (2020)[2]
Decrease −2,170 crore (US$−270 million) (2020)[2]
Total assetsIncrease 34,782 crore (US$4.4 billion) (2020)[2]
యజమానిభారత ప్రభుత్వం (100%)
ఉద్యోగుల సంఖ్య
10,669
మాతృ సంస్థఆర్ధిక శాఖ , భారత ప్రభుత్వం

నేషనల్ ఇన్స్యూరెన్స్ కు భారతదేశం అంతటా కార్యాలయాలు, నేపాల్ లో ఒక విదేశీ కార్యాలయం ఉన్నాయి. కంపెనీ దేశవ్యాప్తంగా 1730 ఆఫీసులు, 13000 మందికి పైగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, 50,000 మందికి పైగా ఏజెంట్లతో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నది.[3]

సేవలు

[మార్చు]

నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ వినియోగదారులకు సుమారు సుమారు 300 రకాల (ప్రొడక్ట్ లతో) విస్త్రృత శ్రేణి బీమా సేవలను అందిస్తుంది[3].

  • పర్సనల్ ఇన్స్యూరెన్స్ పాలసీ: ఇందులో హెల్త్ ఇన్స్యూరెన్స్, మోటార్ ఇన్స్యూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఉంటాయి.
  • గ్రామీణ బీమా: దీనిలో ప్రకృతి వైపరీత్యాల నుండి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలను రక్షిస్తుంది
  • ఇండస్ట్రియల్ ఇన్స్యూరెన్స్: పరిశ్రమల వస్తువులకు జరిగే దొంగతనం,పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలు మొదలైనవి ఇందులో ఉంటాయి.
  • వాణిజ్య బీమా: ఈ భీమాలో వినియోగదారులకు రవాణా సమయంలో ఆస్తి నష్టం జరిగే వాటికీ పరిహారం అందచేస్తారు.

నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ బ్యాంకింగ్, టెలికాం, ఏవియేషన్, షిప్పింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పవర్, ఆయిల్ అండ్ ఎనర్జీ, అగ్రోనమీ, ప్లాంటేషన్స్, ఫారిన్ ట్రేడ్, హెల్త్ కేర్, టీ, ఆటోమొబైల్స్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్ మెంట్, స్పేస్ రీసెర్చ్ మొదలైన సేవలను అందించే తమ వినియోగ దారులకు బీమా సేవలను అందిస్తుంది.[4]

అవార్డులు

[మార్చు]

నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ వినియోగదారులకు అందచేసిన సేవలకు, కంపెనీ ప్రగతిలో సాధించిన అవార్డులు ఈ విధంగా ఉన్నాయి.[5]

  • బెస్ట్ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్.
  • ది ఎకనామిక్ టైమ్స్ బెస్ట్ బ్రాండ్స్ అవార్డు.
  • ఎకనామిక్ టైమ్స్ -బి ఎఫ్ ఎస్ ఐ (BFSI) బెస్ట్ బ్రాండ్స్ 2016 - జనరల్ ఇన్సూరెన్స్ కేటగిరీలో ఆల్ రౌండ్ ఎక్సలెన్స్.
  • సముద్ర మంథన్ బెస్ట్ ఇన్సూరర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2016.
  • స్కోచ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అవార్డ్స్ 2016.
  • ఐకానిక్ బ్రాండ్ అవార్డు (ఇన్సూరెన్స్ సెక్టార్) 2016.
  • ఎలెట్స్ 2015 ఆర్థిక చేరికలో అవార్డు
  • లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ ద్వారా బిజినెస్ ఎక్సలెన్స్ కోసం బి ఎం ఎల్ ముంజాల్ అవార్డ్స్ 2015
  • దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ 7వ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (PSU) అవార్డ్స్ 2015 .

మూలాలు

[మార్చు]
  1. www.ambitionbox.com. "National Insurance Company Overview and Company Profile". AmbitionBox (in ఇంగ్లీష్). Retrieved 2022-07-14.
  2. 2.0 2.1 2.2 2.3 "National Insurance Company Financial Statements" (PDF). nationalinsurance.nic.co.in (in ఇంగ్లీష్). Archived from the original (PDF) on 20 మార్చి 2022. Retrieved 14 July 2020.
  3. 3.0 3.1 "Company Profile- NATIONAL INSURANCE". nationalinsurance.nic.co.in/. Archived from the original on 14 జూలై 2022. Retrieved 14 July 2022.
  4. "National Insurance - Crunchbase Company Profile & Funding". Crunchbase (in ఇంగ్లీష్). Retrieved 2022-07-14.
  5. "Awards". nationalinsurance.nic.co.in/. Archived from the original on 14 జూలై 2022. Retrieved 14 July 2022.