Jump to content

నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్

వికీపీడియా నుండి
నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్
దస్త్రం:CSIR-National Aerospace Laboratories Logo.png
స్థాపన1 June 1959 (1 June 1959)
పరిశోధనా రంగం
ఏరోస్పేస్
స్థలంబెంగళూరు, భారతదేశం
యాజమాన్య సంస్థ
CSIR
వెబ్‌సైటుnal.res.in

నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL), 1959 లో ఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) స్థాపించిన ఏరోస్పేస్ పరిశోధన సంస్థ. ఇది భారతదేశపు మొట్టమొదటిదే కాక, అతిపెద్ద ఏరోస్పేస్ సంస్థ. HAL, DRDO, ISRO లతో సన్నిహితంగా పనిచేస్తుంది. భారతదేశంలో పౌర విమానాలను అభివృద్ధి చేసే ప్రాథమిక బాధ్యతను దీనికి ఉంది. ఇది ఏరోస్పేస్, సంబంధిత విభాగాలలో అధునాతన అంశాలలో పరిశోధనపై దృష్టి పెడుతుంది.

NAL లో నీలకంఠన్ విండ్ టన్నెల్ సెంటర్, కంప్యూటరైజ్డ్ ఫెటీగ్ టెస్ట్ ఫెసిలిటీలు ఉన్నాయి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డొమైన్‌లో వైఫల్యాలు, ప్రమాదాలను పరిశోధించడానికి కూడా NAL లో సౌకర్యాలున్నాయి.

చరిత్ర

[మార్చు]

1959 జూన్ 1న, నేషనల్ ఏరోనాటికల్ రీసెర్చ్ లాబొరేటరీ (NARL) ని ఢిల్లీలో స్థాపించారు. పి నీలకంఠన్ దాని మొదటి డైరెక్టరు. 1960 మార్చిలో, ఇది బెంగళూరులోని జయమహల్ రోడ్‌లో నేషనల్ ఏరోనాటికల్ లాబొరేటరీ (NAL)గా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. మొదటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు JRD టాటా అధ్యక్షత వహించాడు. దీని సభ్యులు సతీష్ ధావన్, డిజైనర్ VM ఘటగే ఉన్నారు. వాస్తవానికి నేషనల్ ఏరోనాటికల్ లాబొరేటరీగా దీన్ని ప్రారంభించినప్పటికీ, 1993 ఏప్రిల్ లో దీన్ని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL)గా మార్చారు. పేరు మార్చడంలో భారతీయ అంతరిక్ష కార్యక్రమంలో పెరుగుతున్న దాని ప్రమేయాన్ని, దాని బహుళ విభాగాల కార్యకలాపాలనూ ప్రతిబింబించే లక్ష్యం ఉంది.

ఫ్లోసోల్వర్

[మార్చు]

Flosolver అనేది NAL రూపొందించి, అసెంబుల్ చేసిన భారతీయ సూపర్ కంప్యూటర్ల శ్రేణి. కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్‌కు సహాయం చేయడానికి 1986 లో మొట్టమొదటి కంప్యూటరు తయారీ మొదలైంది.

ప్రస్తుత ప్రాజెక్టులు

[మార్చు]

RTA-70 (ఇండియన్ రీజినల్ జెట్)

[మార్చు]

HAL/NAL రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (RTA) లేదా ఇండియన్ రీజినల్ జెట్ ( IRJ ) అనేది నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) రూపొందిందిన ప్రాంతీయ విమానం. దీనిని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేస్తుంది. ఈ విమానం 80–100 మంది ప్రయాణికుల సామర్థ్యంతో టర్బోప్రాప్ లేదా జెట్‌గా ఉండేలా ప్రణాళిక చేసారు. దీని ప్రాథమిక వెర్షనులో 70–90 సీట్లు (RTA-70) ఉంటాయి.[1][2]

2021 నాటికి ఈ విమానంలో 90-సీట్లుండే మోడల్‌కు రూపకల్పన చేస్తున్నారు. 2026లో ఇది సేవలోకి ప్రవేశించే అవకాశం ఉంది.[3]

ఉత్పత్తులు

[మార్చు]

విమానాలు

[మార్చు]
  • <b id="mwSg">NAL HANSA</b> - లైట్ వెయిట్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్

హన్సా అనే పేరున్న NAL వారి లైట్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ మొదటి ఫ్లైట్, 1993 నవంబరు 17 న జరిగింది. 2000 సంవత్సరంలో DGCA దీన్ని JAR-VLA సర్టిఫికేషన్ కింద ధృవీకరించింది. ఇది రెండు-సీట్లు ఉండే కాంపోజిట్ పదార్థాలతో తయారైన విమానం. DGCA వివిధ ఫ్లయింగ్ క్లబ్‌లు హన్సా-3 వినియోగిస్తున్నాయి. మొత్తం పద్నాలుగు విమానాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 13 విమానాలు పనిచేస్తున్నాయి. వీటిలో పది వివిధ ఫ్లయింగ్ క్లబ్‌లకు చెందినవి కాగా, ఒకటి IIT-కాన్పూర్‌లో ఉన్నాయి.

  • NAL/HAL SARAS - మల్టీరోల్ లైట్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్

SARAS తన తొలి ఫ్లైట్ 2004 మే 29న చేసింది. విమానం 08:15కి బయలుదేరి దాదాపు 25 నిమిషాల పాటు ప్రయాణించింది. SARAS భారతదేశంలో రూపొందించి, అభివృద్ధి చేసిన మొదటి పౌర విమానం. ASTE (IAF) రెండు నమూనాలను నిర్మించింది. మూడవ నమూనా విమానం (ఉత్పత్తి ప్రమాణం) CSIR-NAL వద్ద ఉత్పత్తిలో ఉంది. విమానంలో ఆల్-గ్లాస్ కాక్‌పిట్ ఉంటుంది. ఇది 2x1200 SHP టర్బోప్రాప్ PT6A-67A ఇంజిన్‌ల (ప్రాట్ & విట్నీ) డ్రైవింగ్ 5-బ్లేడ్ MT-ప్రొపెల్లర్‌లతో నడుస్తుంది. SARAS 30,000ft (క్యాబిన్ ఎత్తు 8,000ft) వరకు ఎగురుతుంది. చిన్న రన్‌వేలపై పనిచేస్తుంది. ఎగ్జిక్యూటివ్ ట్రాన్స్‌పోర్ట్, లైట్ ప్యాకేజీ క్యారియర్, రిమోట్ సెన్సింగ్, ఎయిర్ అంబులెన్స్ మొదలైన అనేక పాత్రల కోసం SARAS ను రూపొందించారు.

2011 సెప్టెంబరు 1న C-NM5 మొదటి విమానం.
  • NAL NM5 - ఐదు సీట్ల - జనరల్ ఏవియేషన్ విమానం

M/s మహీంద్రా ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (MAPL) సహకారంతో సివిల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ అభివృద్ధికి ఏర్పాటు చేసిన C-NM5, దేశం లోనే మొట్టమొదటి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP). 2011 సెప్టెంబరు 1న, విమానాల అభివృద్ధిలో భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి ఒక మైలురాయి సంఘటన జరిగింది; C-NM5 ఆస్ట్రేలియాలో తన మొదటి ఫ్లైట్‌ను విజయవంతంగా చేసింది. C-NM5 300 HP పిస్టన్ ఇంజిన్‌తో 1525 కిలోల గరిష్ట AUW (ఆల్ అప్ వెయిట్)తో 160 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఎయిర్ టాక్సీలు, ఎయిర్ అంబులెన్స్‌లు, శిక్షణ, పర్యాటకం, కార్గోకు అనువైన విమానం.

మానవరహిత వైమానిక వాహనాలు

[మార్చు]
  • NAL / ADE బ్లాక్ కైట్
  • NAL / ADE గోల్డెన్ హాక్
  • NAL / ADE పుష్పక్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Waldron2010-12-23T06:30:00+00:00, Greg. "India's regional aircraft could be a jet". Flight Global (in ఇంగ్లీష్). Retrieved 2023-02-17.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Ministry of Defence gives nod for proposal to produce Saras civil aircraft developed by NAL". United News of India. 21 February 2019. Retrieved 16 February 2023.
  3. "IIMB hosts International Conference on the Future of Aviation and Aerospace". India Education | Latest Education News | Global Educational News | Recent Educational News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-02-18. Archived from the original on 2023-02-17. Retrieved 2023-02-17.

ఉల్లేఖన లోపం: <references> లో "1990-bhatkar" అనే పేరుతో నిర్వచించిన <ref> ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references> లో "1997-ECMWF-flosolver" అనే పేరుతో నిర్వచించిన <ref> ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.

ఉల్లేఖన లోపం: <references> లో "1998-sinha" అనే పేరుతో నిర్వచించిన <ref> ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.