నేషనల్ లేక్ షోర్ ఫీక్చర్డ్ రాక్స్
Pictured Rocks National Lakeshore | |
---|---|
Location | Alger County, Michigan, USA |
Nearest city | Munising, Michigan |
Area | 73,236 ఎకరాలు (296.4 కి.మీ2) |
Established | October 15, 1966 |
Visitors | 476,888 (in 2005) |
Governing body | National Park Service |
Website | Pictured Rocks National Lakeshore |
అధికారిక పేరు | Pictured Rocks |
గుర్తించిన తేదీ | February 17, 1965 |
నేషనల్ పార్క్ షోర్ పిక్చర్డ్ రాక్స్ యునైటెడ్ స్టేట్స్ లోని మిచిగాన్ అప్పర్ పెనింసులాలో ఉన్న సుపీరియర్ లేక్ తీరంలో ఉంటాయి. సుపీరియర్ సరోవరం తీరంలో 42 మైళ్ళపొడవున అలాగే 73236 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. మునిసింగ్ (మిచిగాన్), గ్రాండ్ మరైయాస్ (మిచిగాన్) మధ్య ఉన్న గ్రాండ్ నేషనల్ పార్క్ కొండల మధ్య ఉన్న సరోవరతీరం అద్భుతమైన వర్ణరంజితమైన సహజసిద్ధమైన చిత్రాలకు నిలయంగా ఉంది. ఇక్కడ వివిధరూపాలలో సహజసిద్ధమైన శిలారూపాలు, సహజసిద్ధమైన ఆర్చీలు, జలపాతాలు, ఇసుకతిప్పలు, నదీతీరాలు ఉన్నాయి. ఈశాన్య ముంసింగ్ లోని పిక్చర్ రాక్స్ (చిత్రాల రాళ్ళు) సరోవరమట్టానికి దాదాపు 200 మీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉన్నాయి. సరోవరతీరంలోని కొండచరియలలో ఇతర చిత్రాలతో గుహలు, ఆర్చీలు, సహజసిద్ధంగా ఏర్పడిన కోటబురుజుల వంటి ఆకారాలు, మానవ రూపాలు ఉంటాయి. గ్రాండ్ ఐలాండ్ ప్రాంతంలో ప్రత్యేకంగా సంరక్షించబడుతున్న ఈరాతి చిత్రాలు పర్యాటలకు కనువిందు చేస్తుంటాయి.1966లో యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం అధికారికంగా ఈప్రాంతాన్ని పర్యాటకకేంద్రంగా గుర్తించింది. నేషనల్ పార్క్ సర్వీసెస్ వీటి సంరక్షణ నిర్వహణ బాధ్యత వహిస్తుంది. 2005లో ఈప్రాంతాన్ని 4,76,888 మంది పర్యాటకులు సందర్శించారు.
భౌగోళికం
[మార్చు]రాళ్ళలో పెద్ద ఎత్తున నిక్షిప్తమై ఉన్న ఖనిజాలకారణంగా రాళ్ళలో వర్ణాలు ఏర్పడ్డాయి. మునిసింగ్ ప్రాంతంలో ఉన్న ఈ సహజవర్ణ శిలారూపాల వయస్సు 500 సంవత్సరాలు. ఈ వర్ణరంజిత ఇసుకరాళ్ళు కాంద్రియన్ కాలంనాటివని భావిస్తున్నారు. జాకబ్స్ లోయ ఫార్మేషన్‌లో ఉన్న " ప్రీకాంబ్రియన్ " ఇసుకరళ్ళలో ఈ చిత్రాలు రూపొందాయి. జాకబ్‌లోయలోని రక్తవర్ణ శిలారూపాలు ఈ పార్కులో ఉన్న అతిపురాతన శిలాఅరూపాలని విశ్వసిస్తున్నారు. మునిసింగ్ శిలారూపాల పైన ఉన్న శిలలు ఆర్డోవిషన్ కాలానికి చెందిన ఔ ట్రైన్ ఫార్మేషన్ అని భావిస్తున్నారు. ఔ ట్రైన్ ఫార్మేషన్ కఠినంగా ఉండి ఇతర శిలాఫలకాలకు రక్షణగా ఉంది. శిలలనుండి స్రవిస్తున్న జలం కారణంగా రాళ్ళలో ఉన్న ఖనిజాలు కరగడం కారణంగా శిలలపై వివిధవర్ణ చారికలు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. ఇనుము (ఎరుపు), మాంగనీస్ (నలుపు-తెలుపు), లిమోనైట్ (పసుపు-మట్టిరంగు), రాగి (రోజా-హరితవర్ణం), ఇతర వర్ణాలు ఉన్నాయి. నీరు ఆవిరికాగానే శిలలపై చారికలుగా ఏర్పడ్డాయి.[2]
చరిత్ర
[మార్చు]సుపీరియర్ లేక్‌లో తీరంలో ఉన్న శిలాచిత్రాల ప్రాంతం పుష్కలంగా చేపలకు నిలయంగా ఉన్నా ఇసుకరాతి శిలలు సరోవతీరానికి వచ్చిపోయే పడవలు, బోట్లకు ఆపత్కారణాలుగా ఉన్నాయి. 1658లో ఫర్ వ్యాపారి పియరీ ఎస్ప్రిట్ రాడిషన్ ఈ విపత్కర తీరానికి చేరుకుని ఇక్కడ స్థానిక అమెరికన్లను గుర్తించి వారికి స్నేహపూర్వకంగా పొగాకును బహుమతిగా ఇచ్చాడు. 1800లో రోమన్ శకం కాలంలో అమెరికన్ రచయితల పరంపర ఈ శిలాచిత్రాల సందర్శన కలిగించిన అనుభూతులను వర్ణించారు. 1820లో ఈప్రాంతాన్ని దర్శించిన " హెంరీ రోవే స్కోల్క్రాఫ్ట్ " ఇక్కడి శిలాచిత్రాల సౌందర్యాన్ని ప్రశంశించాడు.[3] 1850లో కొందరు వ్యాపారవేత్తలు ఈప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రాండ్ ఐలాండ్ సిటీలో ప్రస్తుత మునిసింగ్ నగరంలో ఒక పర్యాటక రిసార్ట్ నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 1910లో లంబరింగ్ శకం ముగింపుకు వచ్చిన తరువాత ఆస్తిపన్ను చెల్లించని కారణంగా నేషనల్ లేక్ షోర్ శిలాచిత్రాల ప్రాంతంలోని అధికభూభాగం మిచిగాన్ ప్రభుత్వానికి స్వాధీనం అయింది. ఫెడరల్ ప్రభుత్వ గుర్తింపు, అత్యుత్సాహమైన సహాయం అందుకుని మిచిగాన్ రాష్ట్ర ప్రభుత్వం ఈప్రాంత అభివృద్ధికి పాటుబడింది. 1966లో కాంగ్రెస్ మిచిగాన్ అప్పర్ పెనింసులాలో ఉన్న మునిసింగ్, గ్రాండ్ మారియాస్ మధ్య ఉన్న సరోవర తీరప్రాంతానికి ప్రాబలమైన పర్యాటక అంతస్తు ఇస్తూ చట్టం రూపొందించింది.[4] ఫలితంగా ఈప్రాంతం సరక్షించబడుతూ ప్రేరణ కలిగిస్తూ, విద్య, పునరుత్సాహ ఉపయోగం, ప్రజలకు ఆహ్లాదం కలిగిచడం వంటి ప్రయోజనాలు సమకూరాయి. అమెరికా అధ్యక్షుడు " లియాండన్ జాంసన్ " అల్గర్ కౌంటీ (మిచిగాన్) అమెరికా మొదటి నేషనల్ లేక్ షోర్‌లో భాగం అయింది. 2009 మార్చి 30న " ఆమ్నిబస్ పబ్లిక్ లాండ్ మేనేజిమెంట్ యాక్ట్ చట్టబద్ధం చేయబడింది. చట్టం కారణంగా పిక్చర్ రాక్స్ సరక్షితప్రాంతంగా మారింది. [5] 2010లో గాయకుడు " కిడ్ రాక్ " ఆయన పాటకు అనుగుణంగా పిక్చర్ రాక్స్ దృశ్యాలను చిత్రీకరించారు.[6][7] 2014లో కర్ట్నీ కొటేవా తీసిన పిక్చర్ రాక్స్ ఛాయాచిత్రాలు కర్ట్నీ కొటేవాను గ్రాండ్ ప్రైజ్ విజేతను చేసాయి. [8][9]
చేరుకునే మార్గం
[మార్చు]సుపీరియర్ లేక్ పశ్చిమ తీరాన ఉన్న మునిసింగ్ చేరుకోవడానికి మిచిగాన్ హైవే (ఎమ్-28), మిచిగాన్ హైవే (ఎమ్-94) ప్రయాణం చేయాలి. అలాగే తూర్పుతీరంలో ఉన్న గ్రాండ్ మరియాస్ చేరుకోవడానికి మిచిగాన్ హైవే (ఎమ్-77) లో ప్రయాణం చేయాలి.పిక్చర్డ్ రాక్స్ ప్రాంతాన్ని చేరుకోవడానికి సరోవర తీరాల వెంట పేవ్డ్ హైవే ఉంది. పర్యాటకులు ఒక చివర నుండి మరొక చివరకు చేరుకోవడానికి " హెచ్- 58 మిచిగాన్ కౌంటీ హైవే " ద్వారా ప్రయాణిస్తారు. రహదారి మినరల్ కాస్టిల్ 12 మైల్ బీచ్, గ్రాండ్ సేబుల్ డ్యూంస్ వద్దకు చేరుస్తాయి. మిగిలిన సరోవరతీరం వరకు కాలినడకన చేరుకోవచ్చు. సరోవరతీరం వెంట పిక్చర్ రాక్స్ 42 మైల్ దూరం ( " నార్త్ కౌంటీ ట్రైల్ " ) విస్తరించి ఉంటాయి.[10] సరోవరంలో పిక్చర్ రాక్స్ సందర్శించడానికి దినసరి క్రూసీ సర్వీసులు ఉంటాయి." సీ కయాక్ " ద్వారా పిక్చర్ రాక్స్ సందర్శన ఉత్తమమం. ప్రమాదరకరమైన శీతల జలాలలో పిక్చర్ రాక్స్ సందర్శించడానికి ప్రైవేట్ బోట్లు లభ్యమౌతుంటాయి. కాని సరైన ఉపకరణాలు తగిన అనుభవం లేకుండా వీటిలో ప్రయాణించడం ప్రమాదకరం. సీ కయాక్ పిక్చర్ రాక్స్ సందర్శించడానికి సరోవరతీరంలో మునిసింగ్ (మిచిగాన్) హార్బరు చేరుకుని క్రూసీలో ప్రయాణం చేయాలి.[11] పలు మైళ్ళ పొడవైన సరోవర తీరంలో అనుమతి తీసుకుని " బ్యాక్ కౌంటీ కేంపింగ్ " ప్రాంతంలో కేపింగ్ అనుభవాన్ని పొందవచ్చు. శీతాకాలంలో స్నో స్కేటింగ్, స్నో షూయింగ్, స్నో బౌలింగ్, ఐస్ ఫిషింగ్ వంటి క్రీడలు చేయడానికి అవసరమైన సౌకర్యాలు లభిస్తాయి.[12]
పిక్చర్ రాక్స్ సందర్శించడానికి కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి.అవి:
- ఇంటరజెంసీ విజిటర్ సెంటర్, మునిసింగ్ ఇంటర్ప్రిటివ్ సెంటర్, మైనర్స్ కాస్టిల్ ఇంఫర్మేషన్ స్టేషన్.
- గ్రాండ్ విజిటర్ సెంటర్, మునిసింగ్ జాల్స్ ఇంటర్ప్రీటివ్ సెంటర్ అండ్ మైనర్స్ కాస్టిల్ ఇంఫర్మేషన్ స్టేషన్ ఇన్ మునిసింగ్.
- ఒక్కొక " డ్రైవ్ ఇన్ కేంప్ సెంటర్ వద్ద హాండీ కాప్డ్ - అక్సెసబుల్ కేంప్ సైట్ ఉంటాయి. అలాగే పిక్నిక్ టేబుల్, ఫెడెస్టల్ ఫైర్ గ్రేట్, సమీపంలో ఉండే మరుగుదొడ్డి (రెస్ట్ రూం) ఉంటాయి.
- లాంగ్ స్లైడ్ ఓవర్ లుక్.
- ఆల్ మైనర్స్ ఓవర్ లుక్ (వీక్షణా కేంద్రాలను చేరుకోవడానికి నడవడానికి సులువైన మెట్లతో కూడిన కొండమార్గం ఉంటుంది).
- మునిసింగ్ జలపాతాలు చూడడానికి కొండలలోని అడవిమార్గంలో కాలిమార్గం ఉంటుంది.
- శాండ్ పాయింట్ బోర్డ్ వాక్. ఇక్కడ ఇక్కడ చూడదగిన ప్రాంతాలను వివరించే మ్యాప్ లభిస్తుంది.
- శాండ్ పాయింట్ బీచ్ వద్ద కార్ పార్కింగ్, కాలిబాట ఉంటుంది. పర్యాటకులు బోర్డ్ వాక్ ద్వారా ఈ లేక్ సుపీరియర్ పిక్నిక్ సైట్ చేరుకోవచ్చు.
సందర్శన కేంద్రాలు
[మార్చు]పశ్చిమ తీరంలో ఉన్న మునిసింగ్ నుండి తూర్పుతీరంలో ఉన్న (గ్రాండ్ మరియాస్) :
- మునిసింగ్ జలపాతం, ఇంటర్ప్రీటివ్ సెంటర్.
- శాండ్ పాయింట్ : నేషనల్ లేక్‌షోర్ హెడ్ క్వార్టర్స్.
- మైనర్స్ కేస్టిల్ : రాక్ ఫార్మేషన్, పై నుండి వీక్షించడానికి కాలిబాట. ఇది 2006 ఏప్రిల్ 13 నిర్మించబడింది.
- మైనర్స్ నది: మైనర్స్ లేక్, మైనర్స్ జలపాతం. ఈ నదీ జలాలు సమీపంలో ఉన్న మైనర్స్ బీచ్ వద్ద సుపీరియర్ లేక్‌లో సంగమిస్తుంటాయి.
- మైనర్ జలపాతాలు, ఇంటర్ప్రీటివ్ ట్రైల్.
- గ్రాండ్ పోర్టల్ పాయింట్: రాక్ ఫార్మేషంస్.
- మస్కిటో జలపాతం.
- మస్కిటో నది.
- చాపెల్ రాక్.
- చాపెల్ జలపాతం.
- బీవర్ బేసిన్ విల్డర్నెస్.
- ట్వెల్వ్ మైల్ బీచ్.
- షిప్రెక్స్.
- వైట్ బిర్చ్ ఫారెస్ట్.
- ఔ సేబుల్ పాయింట్: ఔ సేబుల్ లైట్.
- లాగ్ స్లైడ్.
- గ్రాండ్ సేబుల్ డ్యూంస్.
- సేబుల్ ఫాల్స్, ఇంటర్ప్రీటివ్ సెంటర్.
జలపాతాలు
[మార్చు]పిక్చర్ రాక్స్ ప్రాంతంలో పలుజలపాతాలు ఉన్నాయి. ఈ జలపాతాల నుండి ప్రవహిస్తున్న జలాలు మునిసింగ్ లోని ఖనిజసమృద్ధమైన శిలలలో వర్ణరంజిత చిత్రాలు ఏర్పడడానికి కారణం అయ్యాయి. సుపీరియర్ సరోవరం తూర్పున ఉన్న తంక్వామేనన్ జలపాతాల (75 మైళ్ళు) నుండి పశ్చిమ తీరంలోని లాఫింగ్ వైట్ ఫిష్ జలపాతాల (30 మైళ్ళు) వరకు ఉన్న లైం, ఇసుకశిలలు ఉన్నాయి. పలు ట్రైల్స్‌లో పెంపుడు జంతువులకు అనుమతి లేదు.[13]
- మునిసింగ్ జలపాతాలు: ఇసుకరాళ్ళ మీదుగా కిందకు పడుతున్న జలపాతం. అడవి, కొండ మార్గం వెంట ఫెర్న్ మొక్కలు, అడవి పూలు, మింక్ ఉంటాయి. వనమార్గం పర్యాటకులు నడవడానికి సులువైనదిగా ఉంటుంది. ఇక్కడ పెంపుడు కుక్కలను వెంటతీసుకుని వెళ్ళవచ్చు.
- మైనర్స్ జలపాతాలు :- స్వయం మార్గదర్శక వనమార్గం మైనర్స్ బేసిన్ దాటి మైనర్ జలపాతానికి తీసుకుని పోతుంది. వీక్షణా కేంద్రానికి చేరుకోవడానికి 77 మెట్లు ఉంటాయి. 50 అడుగుల ఎత్తైన జలపాతం ఇసుకరాళ్ళ మీదుగా ప్రవహిస్తుంటుంది.[14]
- బ్రైడల్ వెయిల్ జలపాతం (మిచిగాన్) :- బ్రైడల్ వెయిల్ సీజనల్ జలపాతం. వేసవిలో ఇది ప్రవహించదు.[14]
- మస్కిటో జలపాతం:- 8 అడుగుల ఎత్తైన ఈ జలపాతం మస్కిటో నదిజలాలతో రాక్ షెల్ఫ్ మీదుగా ప్రవహిస్తుంటాయి. ఉభయచరాలు, జలచరాలు అడవిమార్గం లోని ప్రవాహంలో పయనిస్తుంటాయి.[14]
- చాపెల్ జలపాతం:- చాపెల్ బేసిన్ వెంట నడుస్తూ రెండు వీక్షణాకేంద్రాల నుండి చాపెల్ జపాతాన్ని సందర్శించవచ్చు. 60 అడుగుల ఎత్తు నుండి ప్రవహించే ఇసుకరాళ్ళ మీదుగా ప్రవహిస్తుంది.[14]
- స్ప్రే జలపాతం :- ఈ జలపాతం సుపీరియర్ సరోవర్ నుండి చక్కగా కనిపిస్తుంది. ఈ జలపాతం ఎత్తు 20 అడుగులు.[14]
- సేబుల్ జలపాతం :- సేబుల్ జలపాతం 75 అడుగుల ఎత్తు నుండి మునిసింగ్, జాకబ్ వెల్లీ ఇసుకరాళ్ళ మీదుగా ప్రవహిస్తుంది.[14]
గోధుమవర్ణ ఇసుకమేటలు
[మార్చు]సుపీరియర్ సరోవరం తూర్పు తీరంలో ఉన్న ది గ్రాండ్ సేబుల్ డ్యూంస్ ఆకర్షణీయమైన శిలాచిత్రాలలో ఒకటి. సరోవరంలోని అలలు తీసువచ్చిన ఇసుకతో ఏర్పడిన ఇసుకమేటలివి. ఈ ఇసుకమేటల ఎత్తు సరోవరతీరానికి 275 అడుగుల ఎత్తులో ఉంది.
వాతావరణం
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - గ్రాండ్ మరియాస్, మిచిగాన్ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °F | 25.3 | 27.4 | 36.4 | 49.2 | 62.1 | 70.4 | 75.9 | 74.8 | 67 | 55.8 | 41.5 | 29.7 | 51.3 |
సగటు అల్ప °F | 11.2 | 10.6 | 17.9 | 29.3 | 37.9 | 45.7 | 51.9 | 52.8 | 47.1 | 38 | 28.2 | 17 | 32.3 |
సగటు వర్షపాతం inches | 2.3 | 1.4 | 1.6 | 1.6 | 2.5 | 2.9 | 2.5 | 3.2 | 3.6 | 3 | 2.6 | 2.5 | 29.8 |
సగటు హిమపాతం inches | 47.3 | 30.7 | 16 | 4.8 | 0.3 | 0.0 | 0.0 | 0.0 | 0.0 | 0.9 | 12.6 | 41.7 | 154.2 |
సగటు అధిక °C | −3.7 | −2.6 | 2.4 | 9.6 | 16.7 | 21.3 | 24.4 | 23.8 | 19 | 13.2 | 5.3 | −1.3 | 10.7 |
సగటు అల్ప °C | −11.6 | −11.9 | −7.8 | −1.5 | 3.3 | 7.6 | 11.1 | 11.6 | 8.4 | 3 | −2.1 | −8 | 0.2 |
సగటు వర్షపాతం mm | 58 | 36 | 41 | 41 | 64 | 74 | 64 | 81 | 91 | 76 | 66 | 64 | 760 |
సగటు హిమపాతం cm | 120 | 78 | 41 | 12 | 0.76 | 0.0 | 0.0 | 0.0 | 0.0 | 2.3 | 32 | 106 | 392 |
Source: [15] |
మూలాలు
[మార్చు]- ↑ Hach, Larry (April 14, 2006). "Miners Castle Turret Collapses". Pictured Rocks National Lakeshore. Retrieved April 24, 2012.
- ↑ Pictured Rocks National Lakeshore, Michigan; Park brochure, Harpers Ferry, West Virginia; 2002
- ↑ Schoolcraft, Henry R. (1821). Narrative Journal of Travels through the Northwestern Regions of the United States, p. 150. E. & E. Hosford.
- ↑ The Pictured Rocks: An Administrative History of Pictured Rocks National Lakeshore (Table of Contents)
- ↑ National Park Service: Beaver Basin Wilderness. Accessed 9-28-2011.
- ↑ "Kid Rock "Born Free" Video at Pictured Rocks". National Park Service. November 2010. Retrieved 14 December 2011.
- ↑ Anderson, Kyle; Kash, Tim (4 November 2010). "MTV news article with link to video: Kid Rock Goes Majestic in Born Free Video". MTV News. Archived from the original on 8 డిసెంబరు 2010. Retrieved 14 December 2011.
- ↑ "Northern Michigan To Be Featured On National Parks Pass | Michigan Radio". Michigan Radio and Interlochen Public Radio. May 2, 2014. Archived from the original on 4 మే 2014. Retrieved 4 May 2014.
- ↑ "2013 Share The Experience Photo Contest | National Park Foundation". National Park Foundation. 2014. Archived from the original on 4 మే 2014. Retrieved 4 May 2014.
- ↑ "Pictured Rocks Cruises Inc. Boat Tours". Archived from the original on 2019-12-25. Retrieved 2020-03-14.
- ↑ National Park Service on visiting Pictured Rocks
- ↑ 12.0 12.1 Pictured Rocks Accessibility
- ↑ Waterfalls
- ↑ 14.0 14.1 14.2 14.3 14.4 14.5 14.6 Waterfalls site bulletin, Pictured Rocks NL, Munising, Michigan
- ↑ "Weatherbase: Historical Weather for Grand Marais, Michigan". Retrieved June 5, 2009.
అదనపు అధ్యయనం
[మార్చు]- Stonehouse, Frederick. Dangerous Coast: Shipwrecks of Pictured Rocks, Avery Color Studios, June 1997. ISBN 0-932212-93-X.
వెలుపలి లింకులు
[మార్చు]- NPS Site
- UP Trails Guide
- Accessibility information from The Disabled Traveler's Companion
- Michigan Interactive Tour of Pictured Rocks
- Additional photos of Pictured Rocks
మూస:SeashoreLakes మూస:Upper Peninsula of Michigan మూస:Greatlakes మూస:Protected areas of Michigan
- IUCN Category III
- Pages using infobox protected area with unknown parameters
- Commons category link from Wikidata
- Pictured Rocks National Lakeshore
- National Park Service areas in Michigan
- Protected areas of Alger County, Michigan
- Cliffs of the United States
- Dunes of Michigan
- Landforms of Alger County, Michigan
- Cambrian Michigan
- Landmarks in Michigan
- Protected areas established in 1966
- 1966 స్థాపితాలు
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు