మిషిగన్

వికీపీడియా నుండి
(మిచిగాన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మిషిగన్ (ఎరుపు రంగులో ఉన్న ప్రాంతం)
మిషిగన్ (ఎరుపు రంగులో ఉన్న ప్రాంతం)

మిషిగన్ సంయుక్త రాష్ట్రాల్లో తూర్పు వైపున ఉత్తరాన ఉన్న రాష్ట్రం. రాష్ట్రానికి ఆ పేరు మిషిగన్ సరస్సు నుండి వచ్చింది. మిషిగన్ అనగా "ఎక్కువ నీరు" లేక "పెద్ద సరస్సు" అని అర్థం.[1][2] దాదాపు కోటి మంది జనాభాతో మిషిగన్ అమెరికాలో అత్యధిక జనాభా గల రాష్ట్రాల్లో పదవ స్థాన్ంలో ఉంది. అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రాల్లో 11వ స్థానంలో ఉంది.[a] దీని రాజధాని లాన్సింగ్. అరిపెద్ద నగరం డెట్రాయిట్. మెట్రో డెట్రాయిట్ దేశం లోని అతిపెద్ద మెట్రోల్లో ఒకటి.

ఈరీ, హ్యూరాన్, మిషిగన్, సుపీరియర్ అనే నాలుగు మహా సరస్సులతో పాటు, సెయింట్ క్లెయిర్ అనే సరస్సుతో మొత్తం అయిదు సరస్సులను కలిగి, ప్రపంచంలో అతి పొడుగైన తాగు నీటి తీరం ఉన్న రాష్ట్రం ఇది.[3] ఇవే కాక, మిషిగన్‌లో మొత్తం 64,980 సరస్సులు, చెరువులూ దొరువులూ ఉన్నాయి.[4]

మిషిగన్ రాష్ట్రం రెండు విడి భాగాలుగా ఉంటుంది. ఈ రెంటినీ ఐదు మైళ్ళ వెడల్పు గల మెకినాక్ జలసంధి వేరు చేస్తుంది. ఈ జలసంధి మిషిగన్ సరస్సును, హ్యురాన్ సరస్సునూ కలుపుతూ ఉంది. పొడవు గల మెకినాక్ వంతెనతో కలుపబడి ఉంది. 1846లో మరణశిక్షను రద్దు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మిషిగన్.

2019 జూలై 1 నాటికి మిషిగన్ జనాభా 99,86,857. ఇది 2010 జనాభాతో పోలిస్తే 1.04% పెరుగుదల.[5] 2018 లో మూడవ త్రైమాసికంలో మిషిగన్ రాష్ట్రపు జిడిపి $538 బిలియన్లు. అమెరికా రాష్ట్రాల్లో ఇది 14 వ స్థానం.[6] మిషిగన్ లో ఆటోమొబైళ్ళు, అహర ఉత్పత్తులు, కంప్యూటరు సాఫ్టువేరు, ఏరోస్పేసు, మిలిటరీ పరికరాలు, ఫర్నిచరు, రాగి, ఇనుప ఖనిజం మొదలైనవి ఉత్పత్తి అవుతాయి. క్రిస్ట్‌మస్ చెట్లను పెంచడంలో మిషిగన్ మూడవ స్థాన్ంలో ఉంది. 60 వేలకు పైగా ఎకరాల్లో ఈ చెట్లను పెంచుతున్నారు.[7][8] నాలుగు అతిపెద్ద పిజ్జా గొలుసుకట్టు సంస్థల్లో రెండు మిషిగన్‌లో స్థాపించినవే. 2017 నాటికి మిషిగన్‌లో 38,59,949 మంది 2,22,553 సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు.[9]

దేవాలయాలు

[మార్చు]
  • సాయిబాబా దేవాలయం (సాగినా): మిచిగాన్ రాష్ట్రం సాగినా పట్టణంలో 2022 ఆగస్టు 18 నుండి 20 వరకు సాయిబాబా విగ్రహ వాయు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.[10]

నోట్స్

[మార్చు]
  1. i.e., including water that is part of state territory. Georgia is the largest state by land area alone east of the Mississippi and Michigan the second-largest.

మూలాలు

[మార్చు]
  1. "Michigan in Brief: Information About the State of Michigan" (PDF). Department of History, Arts and Libraries. Archived (PDF) from the original on November 8, 2006. Retrieved November 28, 2006.
  2. "Freelang Ojibwe Dictionary". Freelang.net. Archived from the original on March 15, 2008. Retrieved March 24, 2008.
  3. "My State: Michigan". NOAA Office of Ocean and Coastal Resource Management. Archived from the original on February 15, 2013. Retrieved July 25, 2010.
  4. "Compilation of Databases on Michigan Lakes" (PDF). Michigan Department of Natural Resources. p. 5. Archived (PDF) from the original on March 14, 2009. Retrieved April 18, 2009. Another unique code (Unique_ID) was previously assigned to all 70,542 polygons, including 5,526 islands, 35 streams and 64,980 lakes and ponds down to 0.008 acres (31.4 m2 , 338 ft2 ).
  5. "QuickFacts Michigan; UNITED STATES". 2018 Population Estimates. United States Census Bureau, Population Division. January 16, 2019. Retrieved January 16, 2019.
  6. "Regional Data GDP and Personal Income". Bureau of Economic Analysis. Archived from the original on 2019-03-29. Retrieved January 28, 2019.
  7. [1] Archived డిసెంబరు 17, 2008 at the Wayback Machine
  8. "National Christmas Tree Association: Industry Statistics". Christmastree.org. Archived from the original on June 16, 2010. Retrieved July 25, 2010.
  9. "U.S. Census Bureau QuickFacts: Michigan". Archived from the original on November 11, 2019. Retrieved November 11, 2019.
  10. telugu, NT News (2022-08-21). "మిచిగాన్‌లో వైభవంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వేడుకలు". Namasthe Telangana. Archived from the original on 2022-08-22. Retrieved 2022-08-22.
"https://te.wikipedia.org/w/index.php?title=మిషిగన్&oldid=3628282" నుండి వెలికితీశారు