Jump to content

నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్

వికీపీడియా నుండి
నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌ (NSDL)
రకంసెంట్రల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ
పరిశ్రమడిపాజిటరీ సేవలు
స్థాపన1996
ప్రధాన కార్యాలయంముంబయి, మహారాష్ట్ర, భారతదేశం
కీలక వ్యక్తులు
పద్మజ చుండూరు,
(మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)
ఉత్పత్తులుడీమ్యాట్ ఖాతా, సెక్యూరిటీల బదిలీ , సెటిల్మెంట్
మాతృ సంస్థసెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా,
మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ (ఇండియా)

నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌) (ఆంగ్లం: National Securities Depository Limited) - ముంబైలో ఉన్న ఒక భారతీయ సెంట్రల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ సంస్థ. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ సెక్యూరిటీస్ డిపాజిటరీగా ఎన్‌ఎ్‌సడీఎల్‌ 1996 ఆగస్టులో స్థాపించబడింది.[1] ఇది దేశ ఆర్థికాభివృద్ధికి బాధ్యత వహించే జాతీయ సంస్థ.[2] నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్ https://nsdl.co.in/

ఎన్‌ఎస్‌డీఎల్ 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న ఆస్తుల విలువలో 300 లక్షల కోట్ల రూపాయల చారిత్రక మైలురాయిని అధిగమించింది.[3]

చరిత్ర

[మార్చు]

1995లో డిపాజిటరీల ఆర్డినెన్స్‌ను విడుదల చేయడం ద్వారా భారతదేశంలో మొట్టమొదటి డిపాజిటరీగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ స్థాపనకు మార్గం సుగమం అయింది. ఇప్పుడు, ఎన్‌ఎస్‌డీఎల్ ప్రపంచంలోని అతిపెద్ద డిపాజిటరీలలో ఒకటి. ఇది భారతీయ సెక్యూరిటీల మార్కెట్‌లలో డి-మెటీరియలైజ్డ్ రూపంలో ఉంచబడిన, స్థిరపడిన చాలా సెక్యూరిటీలను నిర్వహించే అత్యాధునిక మౌలిక సదుపాయాలను కలిగి ఉంది.[4] ఫిజికల్ సర్టిఫికేట్లలో లావాదేవీలతో పోలిస్తే డిపాజిటరీ రూపంలో లావాదేవీల ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. దీనికోసమని ఎన్‌ఎ్‌సడీఎల్‌ దేశానికి 'డీమ్యాట్' ని పరిచయం చేసింది. ఇది సెక్యూరిటీల మార్కెట్‌లోని వివిధ వాటాదారులకు ప్రపంచ స్థాయి డిజిటల్ సేవలను అందిస్తోంది.[4]

సంస్థ విధులు

[మార్చు]

ఎన్‌ఎస్‌డీఎల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (NDML), ఎన్‌ఎస్‌డీఎల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్.. ఇవి రెండూ నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌ అనుబంధ సంస్థలు. ఇవి ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్‌లో సెక్యూరిటీల డీమ్యాట్, సెక్యూరిటీల బదిలీ, సెటిల్‌మెంట్‌కు సంబంధించిన సేవలను అందిస్తాయి. ఎన్‌ఎస్‌డీఎల్ ఇ-గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్[2] అనేది ఒక ప్రత్యేక సంస్థ. ఇది పాన్ కార్డు (PAN) ల జారీకి సంబంధించిన సేవలను అందిస్తుంది. అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కోసం సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీగా కూడా పనిచేస్తుంది.

ఇవీ చదవండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sebi.gov.in Depositories". SEBI.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 "NSDL e-Governance Infrastructure Limited". www.egov-nsdl.co.in. Archived from the original on 2022-02-06. Retrieved 2022-01-17.
  3. Desk, B. Q. "Assets In NSDL Demat Accounts Now Worth $4 Trillion". BloombergQuint (in ఇంగ్లీష్). Retrieved 2022-01-17.
  4. 4.0 4.1 "What is NSDL service?". Business Insider. Retrieved 2022-01-17.