Jump to content

నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
నైట్రోసైల్‌ సల్ఫ్యూరిక్ ఆమ్లం
Structural formula of nitrosylsulfuric acid
Ball-and-stick model
పేర్లు
IUPAC నామము
Nitrosylsulfuric acid
ఇతర పేర్లు
nitrosonium bisulfate, chamber crystals
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7782-78-7]
పబ్ కెమ్ 82157
SMILES O=NOS(=O)(=O)O
ధర్మములు
HNO5S
మోలార్ ద్రవ్యరాశి 127.08 g/mol
స్వరూపం pale yellow crystals
సాంద్రత 1.612 g/mL in
40% sulfuric acid soln
ద్రవీభవన స్థానం 73.5 °C (164.3 °F; 346.6 K)
బాష్పీభవన స్థానం decomposes
decomposes
ద్రావణీయత soluble in H2SO4
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు oxidizer
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
NaHSO4
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం(Nitrosylsulfuric acid) ఒక రసాయన సమ్మేళనపదార్థం. ఇందులో Nitrosyl ఉచ్చరణ:/ˈnʌɪtrəsʌɪl/ /ˈnʌɪtrəsɪl/ /nʌɪˈtrəʊsʌɪl/. ఈ రసాయన సంయోగపదార్థం యొక్క రసాయన సంకేతపదం NOHSO4(HO.SO2.ONO.లేదా HNO5S గా కూడా చూపవచ్చును. నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం రంగులేనటువంటి ఘన రసాయన పదార్థం. నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాణిజ్యపరంగా ఎక్కువగా కాప్రోలాక్టం(caprolactam)ను తయారీలో ఉపయోగిస్తారు.

భౌతిక లక్షణాలు

[మార్చు]

నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఘన రసాయనపదార్థం. సాధారణంగా పాలిపోయిన/రంగువెలసిన పసుపురంగు స్పటికాలుగాఉండును.నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ యొక్క అణుభారం 127.08 గ్రాములు/మోల్.40% సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణంలో ఈ రసాయన సంయోగపదార్థం యొక్క సాంద్రత 1.612 గ్రాములు/సెం.మీ3.నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ద్రవీభవన స్థానం 73.5 °C (164.3 °F; 346.6 K). వేడి చేసిన ద్రవీభవన స్థానం చేరకముందే విఘటన చెందును.నీటిలో వియోగం చెందును.సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కరుగుతుంది.

సంశ్లేషణ-రసాయన చర్యలు

[మార్చు]

మంచు/హిమతొట్టి(ice bath)లో గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం(H2SO4)లో సోడియం నైట్రైట్(HNO2)ను కరిగించడంవలన నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడును.

HNO2 + H2SO4 → NOHSO4 +H2O

ప్రత్నామ్యాయంగా నైట్రిక్ ఆమ్లం, సల్ఫర్ డయాక్సైడుల రసాయనచర్య వలన కుడా నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉత్పత్తి చెయ్యవచ్చును. నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని నైట్రస్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లంల మిశ్రమం వలన ఏర్పడిన నిర్జల ఆమ్లంగా భావించ వచ్చును.

ఉపయోగాలు

[మార్చు]

సేంద్రియ రసాయన శాస్త్రంలో డైఅజోనియం లవణాలను, అమీనులను(amines)తయారుచేయుటలో నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు.అలాగే NO- విడుదలచేసే రసాయన కారకాలు నైట్రో సోనియం టెట్రాఫ్లోరోబోరేట్, నైట్రోసైల్ క్లోరైడులను కూడా ఉత్పత్తి చేస్తారు

మూలాలు

[మార్చు]