పంకజ్ భడౌరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పంకజ్ భడౌరియా[1] 2010లో జరిగిన మాస్టర్ షెఫ్ ఇండియా మొదటి సీజన్ విజేత.[2] ఈ పోటీలో పాల్గొనేందుకు పాఠశాల ఉపాధ్యాయినిగా ఆమెకు ఉన్న 16ఏళ్ళ సుదీర్ఘ కెరీర్ ను వదులుకున్నారు ఆమె. స్టార్ ప్లస్ లో ప్రసారమైన షెఫ్ పంకజ్ కా జయ్కా[3] జీ ఖానా ఖజానా చానెల్ లో వచ్చిన కిఫయతీ కిచెన్,[4] [5] 3 కోర్స్ విత్ పంకజ్, ఈటీవిలో ప్రసారమైన రసోయీ సే-పంకజ్ భడౌరియా కే సాత్, సేల్స్ కా బాజీగర్[6] వంటి టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరించారు పంకజ్. ప్రపంచవ్యాప్తంగా అఫీషియల్ మాస్టర్ షెఫ్ కుక్ బుక్ రాసిన మొట్టమొదటి మాస్టర్ షెఫ్ విజేత ఈమే కావడం విశేషం.[7] బార్బీ- ఐ యాం ఏ షెఫ్, చికెన్ ఫ్రం మై కిచెన్ అనే మరో రెండు వంటల పుస్తకాలు కూడా రాశారామె.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

1971 జూలై 14న ఢిల్లీలో వినోద్ ఖన్నా, ప్రియా ఖన్నాల మొదటి  సంతానంగా జన్మించారు పంకజ్. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నారు. పంకజ్ 13ఏళ్ళ వయసులో తండ్రి చనిపోగా, ఆమె 22ఏళ్ళ వయసులో తల్లిని పోగొట్టుకున్నారు. ఢిల్లిలోని కేంద్రీయ విద్యాలయాలో ప్రాథమిక విద్య అభ్యసించిన పంకజ్, లక్నోలో ఉన్నత విద్య పూర్తి చేశారు. లక్నో  విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లో బ్యాచిలర్స్, ఇంగ్లీష్ సాహిత్యంలో  మాస్టర్స్ డిగ్రీ చదివారు ఆమె. అలాగే లక్నో విశ్వవిద్యాలయంలో  విద్యలో బ్యాచిలర్స్ చేశారు. ఆమె భర్త చారు సామ్రాట్. ఆమెకు ఇద్దరు పిల్లలు సొనాలికా, సిద్ధాంత్.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-30. Retrieved 2017-01-07.
  2. "Ash is more beautiful than Kat: Pankaj Bhadauria". The Times of India. Retrieved 19 June 2015.
  3. "'I am nervous about Pankaj Ka Zayka'". Rediff. 16 September 2011. Retrieved 19 June 2015.
  4. "Kifayti Kitchen - Zee Khana Khazana show - Kifayti Kitchen Recipes, videos & show episodes with Pankaj Bhadouria online at zeekhanakhazana.com". zeekhanakhazana.com. Archived from the original on 9 జనవరి 2019. Retrieved 7 జనవరి 2017.
  5. "Pankaj Bhadouria". zeekhanakhazana.com. Archived from the original on 6 జనవరి 2019. Retrieved 7 జనవరి 2017.
  6. "SGI Group". sgei.org. Archived from the original on 18 జూన్ 2015. Retrieved 19 June 2015.
  7. "Learning Twice". The Indian Express. 26 November 2011. Retrieved 19 June 2015.