పంజాబీ భథీ
పంజాబీ భథీ(పంజాబీ: ਭੱਠੀ) అనేది పంజాబ్ ప్రాంతంలో ఉపయోగించే ఒకరకమైన వంట చేసుకునే పరికరము.[1]
రూపకల్పన
[మార్చు]సాంప్రదాయమైన పంజాబీ భథీ అనే వంట చేసుకునే పరికరాన్ని ఈ రకముగా తయారుచేస్తారు. ముందుగా మట్టిలో ఒక గుంత తవ్వుతారు తరువాత ఒక గుండ్రటి ఆకారంలో ఉన్న గోట్టాన్ని పొగ బయిటకు పోవడానికి దూరంగా అమర్చుతారు.[2] రంద్రము చుట్టు ఇరువైపుల మట్టితో అలుకుతారు. తరువాత నేలకు కొంత ఎత్తులో గుండ్రముగా ఒక గోడను కడతారు. భథీకు ఒకవైపు మంట పెట్టడానికి అవసరమయ్యే పుల్లలు, వెదురు, ఆకులు పెట్టడానికి రంధ్రం పెడతారు.[3]భథీకు పై భాగంలో ఖాళీ పెడతారు కాని దాన్ని ఒక లోహపు దాకతో మూసి ఉంచి అధిక వేడి ఉత్పత్తి కావడానికి ఇసుకతో నింపి ఊంచుతారు.
ఉపయోగాలు
[మార్చు]పంజాబ్ వంటకాలైన గోదుమలు, జొన్నలు దీని మీద వండితే అధిక రుచి సంతరించుకుంటాయి. అలా వండిన వాటిని బెల్లం పాకంలో కలుపుతారు.[3]పూర్వం పంజాబ్లోని ప్రతి ఇంట్లో ఈ భథీలు ఉండేవి[4][3]
ఇతర ప్రదేశాల్లో వీటి వాడకం
[మార్చు]రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని వాడతారు.
రాజస్థాన్ ప్రాంతంలో ఎక్కువగా బార్లీ గింజల్ని వండటానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ భథీ లోపల గిన్నెలను పెట్టి వాటిలో బార్లీ గింజల్ని పెట్టి, పైన మూత పెట్టి వండుతారు.[5]
భథీల్లో మరో రకం కూడా ఉంటాయి. పెద్ద మొత్తంలో వండేందుకు పెనం వంటి, పైన మూతలు లేని భథీలు ఉంటాయి.[6]
మూలాలు
[మార్చు]- ↑ Photo of a Punjabi bhathi
- ↑ Punjabi bhathi
- ↑ 3.0 3.1 3.2 Alop ho riha Punjabi virsa byHarkesh Singh Kehal Pub Lokgeet Parkashan ISBN 81-7142-869-X
- ↑ Punjabi bhathi
- ↑ The Hindu Mohammed Iqbal 14 10 2012
- ↑ "Traditional stoves". Archived from the original on 2016-10-28. Retrieved 2016-08-02.