పక్షి సంరక్షణ (వలస) కేంద్రాలు
మనదేశంలో అందమైన పక్షులు ఎన్నో ఉన్నాయి. సుమారు 1200 రకాల పక్షులున్నాయని అంచనా. అయితే పెరుగుతున్న కాలుష్యం కారణంగా వీటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. పక్షుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో పక్షుల సంరక్షణా(వలస) కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఇవి కేవలం పక్షుల సంరక్షణ కోసమే కాదు అందమైన పక్షులను చూడాలనుకునే వారికి సందర్శన క్షేత్రాలు కూడా[1].
ఆసియాలోనే అతి పెద్దది
[మార్చు]రాయ్‌గంజ్‌లోని పక్షుల కేంద్రం ఆసియాలోనే అతి పెద్దది. అరుదైన పక్షులు ఎన్నో ఈ కేంద్రంలో ఉన్నాయి. అరుదైన పక్షులను రక్షించేందుకు ప్రభుత్వం అనేక ప్రాంతాలలో పక్షుల కేంద్రాలును ఏర్పాటు చేసింది.
భరత్‌పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం
[మార్చు]రాజస్థాన్‌లో ఉన్న భరత్‌పూర్ పక్షుల సంరక్షణా కేంద్రానికి మరో పేరు కియోలాడియోఖనా జాతీయ పార్‌క . రాజస్థాన్‌లోని థార్ ఎడారి, జైపూర్ కోట, సరస్సులతో పాటుగా భరత్‌పూర్ పక్షుల సంరక్షణా కేంద్రం ఎంతో మంది సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడకు శీతాకాలంలో అనేక అరుదైన పక్షులు వేల సంఖ్యలో వలస వస్తా్తయి. ఆ పక్షులు రాల్చే రంగురంగుల ఈగలతో తయారు చేసిన అందమైన అలంకరణ వస్తువులు ఇక్కడ లభిస్తాయి.
సుల్తాన్‌పూర్ పక్షుల కేంద్రం
[మార్చు]హర్యానా రాష్ట్రంలో గుర్గావ్ జిల్లాలో ఉన్న సుల్తాన్ పూర్ పక్షుల కేంద్రం లో అరుదైన పక్షులతో పాటు అందమైన సరస్సు కూడా ఉంది. ప్రతి సంవత్సరం రంగురంగుల విహంగాలు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తాయి. ఇక్కడ పక్షులతో పాటు అనేక జంతువులు కూడా ఉన్నాయి.
సలీం ఆలీ పక్షుల కేంద్రం
[మార్చు]గోవాలోని మండోవీ ప్రాంతంలోని కొరావోద్వీపంలో అనేక రకాల చిన్న పక్షులు ఉన్నాయి. ఈ పక్షుల సంర క్షణ కోసం పక్షీ ప్రేమికుడు సలీం అలీ జ్ఞాపకార్థం ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ చిలుకలు, పిచ్చుకలు, సెలికాన్లతో పాటు పెద్ద ఉడతలు, అనేక రకాల పుష్ప జాతులు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
కుమారకోమ్ పక్షుల సంరక్షణ కేంద్రం
[మార్చు]సైబీరియా పక్షులను చూడాలంటే ఈ కేంద్రానికి వెళ్లాల్సిందే. కేరళలోని వెంబనాడ్ సరస్సు సమీపంలోని ఈ కేంద్రానికి మరో పేరు వెంబూడ్ పక్షుల సంరక్షణ కేంద్రం. ఇక్కడకు సైబీరియా పక్షులు, వివిధ దేశాల పక్షులు వలసకు వస్తాయి. ఈ కేంద్రంలో పాటు కేరళలోని మంగళ వనం, తట్టెక్యాడ్‌లో కూడా పక్షుల సంరక్షణ కేంద్రాలున్నాయి. పెరియార్ నదీ తీరంలోని ఈ ప్రాంతాలలో అరుదైన పక్షులను చూడవచ్చు.
రంగన్ తిట్టా పక్షుల సంరక్షణ కేంద్రం
[మార్చు]కర్ణాటక లోని కావేరి నదీ తీరాన ఉ న్న ఈ కేంద్రానికి అనేక రకాలైన అరుదైన పక్షులు వలస వస్తా్తయి. ఇగ్రైడ్, పాట్రిడ్‌జ, హీరన్, లైట్ ఇబిస్ లాంటి పక్షులు ఎన్నో సందర్శకులను అలరిస్తాయి. మైసూర్‌లోని బౄఎందావన్ గార్డెర్‌సకు 20 కి.మీ. పరిధిలోని ఈ కేంద్రానికి కృష్ణరాజ సాగర్ డామ్ ప్రత్యేక ఆకర్షణ.