Jump to content

పచ్చకామెర్లు

వికీపీడియా నుండి
(పచ్చ కామెర్లు నుండి దారిమార్పు చెందింది)
పచ్చకామెర్లు, జాండీస్
వర్గీకరణ & బయటి వనరులు
హెపటైటిస్ ఏ వలన పచ్చబడిన చర్మము, కనుగుడ్లు
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 7038
m:en:MedlinePlus 003243
MeSH {{{m:en:MeshID}}}
A 4-year-old boy with icteric (jaundiced) sclera which later proved to be a manifestation of hemolytic anemia due to G6PD deficiency following fava bean consumption.

పచ్చకామెర్లు, (జాండీస్) రక్తంలో బిలిరుబిన్ యొక్క స్థాయి హెచ్చినప్పుడు (హైపర్ బిలిరుబినీమియా) చర్మము, కనుగుడ్లు, మ్యూకస్ మెంబ్రేనులు పసుపు పచ్చ రంగుతేలడాన్ని పచ్చకామెర్లు అంటారు.ఈ పరిస్థితి వలన అన్ని శరీరద్రవాలలో బిలిరుబిన్ పెరుగుతుంది. సాధారణంగా, ఈ లక్షణాలు కంటికి స్పష్టంగా కనిపించాలంటే ప్లాస్మాలోని బిలిరుబిన్ యొక్క గాఢత సాధారణ విలువ అయిన 0.5 మి.గ్రా/డె.లీ[1] కంటే మూడు రెట్లకు (1.5 మి.గ్రా/డె.లీ) పైగా పెరగాలి.[1] జాండీస్ అన్న పదము ఫ్రెంచి భాషా పదమైన jaune (పసుపుపచ్చ) నుండి పుట్టింది. కామెర్లు కాలేయ సంబంధిత వ్యాధి.ఇటీవల కాలంలో తరచూ తలెత్తుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా కామెర్లను చెప్పవచ్చు. ఒక వ్యక్తి ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు అతని కన్నా ముందు ఇతరులే దీన్ని గుర్తిస్తారు. ఈ విచిత్ర పరిస్థితి కామెర్లలోనే కనిపిస్తుంది. దీన్ని వ్యాధిగా చెప్పేకన్నా అంతర్గతంగా ఉన్న రోగ లక్షణాల సముదాయంగా చెప్పవచ్చు. వాస్తవానికి శరీరానికి ప్రాణవాయువు అనదగ్గ ఆక్సిజన్‌ను రక్తంలోని ఎర్ర రక్త కణాలు సరఫరా చేస్తాయి. ఇందులో హీమోగ్లోబిన్ అనే ప్రొటీన్ పదార్థం కీలక పాత్ర పోషిస్తుంది. దీని జీవితకాలం 120 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత హీమోగ్లోబిన్‌లోని హీమ్ పదార్థం ప్లీహంలో (స్పీన్) శిథిలమైపోయి బైలిరూబిన్, బైలివర్డిన్ అనే పసుపు రంగు వ్యర్థ పదార్థాలుగా మారిపోతుంది. శరీరంలో ఈ పసుపు రంగు పదార్థాలు పేరుకుపోవడాన్ని కామెర్లుగా అభివర్ణించవచ్చు. సాధారణంగా కాలేయం ఈ వ్యర్థ పదార్థాలను సేకరించి పైత్యరసంతో పాటు కాలేయ వాహిక (బైల్‌డక్ట్) ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడ నుంచి మలంతో పాటు ఈ పసుపు రంగు వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. మలం పసుపు రంగులో ఉండటానికి ఇదే కారణంగా భావించవచ్చు.

లక్షణాలు, నిర్ధారణ

[మార్చు]
  • కళ్ళు తెల్ల గుడ్డు పచ్చగా, నీరుడు మూత్రం ఎర్రగా, ఆకుపచ్చగా రంగులో ఉంటే అది అసలైన లివర్ కాలేయం పచ్చ కామెర్లు.
  • కళ్ళు పచ్చగా ఉండి నీరుడు మూత్రం తెల్లగా ఉంటే అది మలేరియాలో రక్తం విరిగి కావచ్చు.
  • కళ్ళు మూత్రం పచ్చగా ఉండి, కుడి వైపు డొక్కలో శూల పోటు వస్తుంటే అది పైత్యకోశ రాళ్ళు గురించి పరీక్ష చూడవలెను.
  • ఎన్ని పరీక్షలకు దొరక్క పోతే అది రాచపుండు కేన్సర్ కావచ్చా?
  • అల్ట్రాసౌండ్ స్కాన్, మామూలు ఎక్స్-రేల్లో రాళ్ళు తెలుస్తాయ
  • ఎండోస్కోప్ /లాపరోస్కోపుల్లో కొన్ని కేన్సర్లు దొరకవచ్చు.

పచ్ఛ కామెర్లు వస్తే రోజు స్వచ్ఛమైన ఈత కల్లు తాగాలి.

ప్రధాన కారణం

[మార్చు]

శరీరంలో ఈ రెండు వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడానికి మూడు కారణాలు కనిపిస్తాయి.

  • 1) హీమోలైటిక్ ఎనీమియా వంటి కారణాలతో ఎర్ర రక్త కణాలు ఎక్కువగా శిథిలమైనప్పుడు.
  • 2) కాలేయం పాడైనప్పుడు అంటే కాలేయం వ్యర్థ పదార్థాలను సేకరించలేకపోయినప్పుడు.
  • 3) కాలేయం నుంచి పేగుల్లోకి తీసుకుని వెళ్లే కాలేయ వాహికలో అంతరాయం ఏర్పడినప్పుడు ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది.

ఈ మూడింటిలో ప్రధానంగా కాలేయం పాడవడం కామెర్లకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

వైరస్‌

[మార్చు]

వైరస్ సంక్రమణలో ఐదు రకాల వైరస్‌లను గుర్తించవచ్చు. హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ అనే వైరస్‌ల కారణంగా కామెర్లు వచ్చే అవకాశం ఉంది. వీటిలో హెపటైటిస్ ఎ, ఇ వైరస్‌లు కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి. ఎక్కువ మందిలో ఈ వైరస్ ఎక్కువ హాని కలిగించకపోవచ్చు. ఇక హెపటైటిస్ బి, సి అనే వైరస్‌లు కలుషిత లాలాజలం, రక్తం, వీర్యం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. ఈ వైరస్‌లు మాత్రం కాలేయానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి.

మద్యపానము

[మార్చు]

దీర్ఘకాలం పాటు ఆల్కహాల్ తీసుకున్న వారిలో కాలేయం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. మొదట్లో కాలేయ కణాల స్థానంలో కొవ్వు కణాలు పోగుపడి తరువాతి కాలంలో అవే స్థిరపడతాయి. వాస్తవానికి మద్యం ఎంతవరకు తాగవచ్చు అనేదానికి పరిమితి చెప్పడం కష్టం. ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉండవచ్చు.

ఇతర కారణాలు

[మార్చు]

పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు కూడా కామెర్లకు దారితీస్తాయి. ఈ కారణంగా కాలేయంలో ఎంజైమేటిక్, నిర్మాణాత్మక సమస్యలు తలెత్తి విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడతాయి. అటువంటప్పుడు కాలేయం పాడైపోయి కామెర్లకు దారితీస్తుంది. ఒక్కోసారి కాలేయంలో పైన చెప్పిన ఇబ్బందుల కారణంగా సమస్య తలెత్తినప్పుడు, అదే సమయంలో కణితి ఏర్పడితే అది కామెర్లను బాగా పెంచుతుంది. (అన్ని కణితులు కేన్సర్ కణితులు కాదని గుర్తుంచుకోవాలి) కాలేయం నుంచి పేగుల్లోకి పైత్యరసాన్ని తీసుకుని వెళ్లే కాలేయ వాహికలో సమస్య తలెత్తవచ్చు. నిర్మాణపరమైన లోపాలు, అక్కడ రాళ్లు పేరుకుపోయినప్పుడు, కేన్సర్ సోకినప్పుడు ఇటువంటి ఇబ్బంది తలెత్తుతుంది. ఇది కామెర్లకు దారితీస్తుంది.

ముఖ్యమైన లక్షణాలు

[మార్చు]
  • కామెర్లు సోకినప్పుడు ప్రధాన లక్షణంగా కళ్లు పచ్చబడటాన్ని గమనించవచ్చు.
  • దీంతో పాటు మూత్రం పసుపు రంగులోకి మారడం, బూడిదరంగు మలం, జ్వరం, ఒళ్లు నొప్పులు, ఆకలి తగ్గడం, దురదలు, వాంతులు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
  • కాలేయ సమస్యను గుర్తించకపోతే కామెర్లు తీవ్రతరం అవుతాయి. అప్పుడు పాదాల వాపు, నిద్ర పట్టకపోవడం, రక్తపు వాంతులు, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నిర్ధారణ

[మార్చు]

సాధారణంగా దీన్ని ఒక మామూలు రక్త పరీక్ష (లివర్ ఫంక్షన్ టెస్ట్) తో గుర్తించవచ్చు. అల్ట్రాసౌండ్ పరీక్షతో సమస్యను నిర్ధారణ చేసుకోవచ్చు. అవసరమైతే సీటీస్కాన్, ఎమ్ఆర్ఐ, ఎండోస్కోపి వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. నివారణ: వాస్తవానికి రోగం వచ్చాక చికిత్స కన్నా ముందు జాగ్రత్తపడటం ఉత్తమం. మద్యానికి దూరంగా ఉండాలి. వ్యక్తిగత శుభ్రత పాటించడం, కలుషిత నీరు, ఆహారానికి దూరంగా ఉండటంతో రక్షణ పొందవచ్చు. కాచి చల్లార్చిన నీరు తాగడం శ్రేయస్కరం. హెపటైటిస్ నివారణకు టీకాలు తీసుకోవడం చేయాలి.

చికిత్స

[మార్చు]

కామెర్లకు చికిత్స అనేక విధానాల్లో ఉంటుంది. హెమటాలజిస్ట్ సహాయంతో పరీక్షించినప్పుడే శిథిల కణాలు ఎక్కువగా పేరుకుపోవడానికి కారణం అర్థమవుతుంది. ప్రారంభ దశలో కామెర్లకు మందులతో చికిత్స అందించవచ్చు. కాలేయం పూర్తిగా పాడైనప్పుడు మాత్రం కాలేయ మార్పిడి ఆపరేషన్ అవసరం అవుతుంది. కాలేయ వాహికలో అంతరాయం కలిగినప్పుడు మాత్రం శస్త్రచికిత్స అవసరం అవుతుంది. రాళ్లు ఉన్నప్పుడు ఎండోస్కోపి విధానంలో, కేన్సర్ ఉన్నప్పుడు సర్జరీ చేయడం ద్వారా చికిత్స అందించాల్సి వస్తుంది. ముందుగా చెప్పుకున్నట్లుగా కామెర్లు ఒక వ్యాధి అనడం కన్నా రోగ లక్షణాల సముదాయంగా చెప్పవచ్చు. దీన్ని తగ్గించడానికి ఇప్పుడు మంచి మందులు, చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. నాటు మందులను వాడి రోగాన్ని ముదరపెట్టుకోవడం మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలి.

వైరస్ హెపటైటిస్ మామూలు లివర్ కామెర్లకు వైరస్ కారణం కాబట్టి వైద్యం లేదు. అందు చేత పసర్లు వగైరా చలామణీలో ఉన్నాయి. 15-30 రోజులు సేదతీరితే అదే తగ్గిపోతుంది. నీరసం 2 నెలలు ఉంటుంది. మాంసము, పప్పులు తగ్గించి తినాలి. ఎక్కువ తింటే మెదడుకు ఎక్కగలదు. మలేరియాకు క్లోరోక్విన్ పూర్తి కోర్సు 10 బిళ్ళలు రెండున్నర రోజులపాటు భోజనం తరువాత వేసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఖరీదైన మందులు ఇంజక్షన్లు అక్కర్లేదు. వైరస్ జాండిస్ ఉన్నవారికి చేసిన ఇంజక్షన్ సూదులు మళ్ళీ వాడవలసి వస్తే ఎక్కువ మరిగించవలెను. hai

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Guyton, A and Hall, J, "Textbook of Medical Physiology", 11th Ed., Elsevier, 2006

బయటి లింకులు

[మార్చు]