Jump to content

పజవంగడి వినాయక దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 8°28′58″N 76°56′37″E / 8.48278°N 76.94361°E / 8.48278; 76.94361
వికీపీడియా నుండి
పజవంగడి వినాయక దేవాలయం
పజవంగడి వినాయక దేవాలయం
పజవంగడి వినాయక దేవాలయం
పజవంగడి వినాయక దేవాలయం is located in Kerala
పజవంగడి వినాయక దేవాలయం
కేరళలో దేవాలయ ప్రాంతం
భౌగోళికం
భౌగోళికాంశాలు8°28′58″N 76°56′37″E / 8.48278°N 76.94361°E / 8.48278; 76.94361
దేశంభారతదేశం
రాష్ట్రంకేరళ
ప్రదేశంతిరువనంతపురం
సంస్కృతి
దైవంవినాయకుడు

పజవంగడి వినాయక దేవాలయం, కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగర నడిబొడ్డునున్న తూర్పుకోట సమీపంలోని వినాయక దేవాలయం.[1] శ్రీ పద్మనాభస్వామి దేవాలయానికి సమీపంలో ఉన్న ఈ దేవాలయంలో వినాయకుడు, అయ్యప్ప, దుర్గాదేవి, నాగదేవత మొదలైన దేవుళ్ళు ఉన్నారు. దేవాలయ శిల్పాలలో 32 రూపాలలో వినాయక విగ్రహాలు ఉన్నాయి.[2]

చరిత్ర

[మార్చు]

మొదట్లో పద్మనాభపురం వద్ద నాయర్ బ్రిగేడ్ చేత అసలు విగ్రహం ప్రతిష్టించబడింది. తిరువనంతపురంకి మార్చబడినప్పుడు విగ్రహాన్ని స్థాపించి, ప్రస్తుత దేవాలయం ఉనికిలోకి వచ్చింది.[3] ట్రావెన్‌కోర్ సైన్యం భారత బలగాలతో విలీనం అయిన తర్వాత, ఈ దేవాలయాన్ని భారత సైన్యం నిర్వహిస్తోంది.[4]

నైవేద్యాలు

[మార్చు]

ఈ దేవాలయంలో కొబ్బరికాయలు పగలగొట్టడం ప్రధాన నైవేద్యంగా ఉంది. గణపతి హోమం, అప్పం, మోదకం మొదలైన వినాయకుడికి సంబంధించిన ఇతర నైవేద్యాలను కూడా ఇక్కడ వినాయకుడికి సమర్పిస్తారు.

ప్రధాన పండుగలు

[మార్చు]

ఈ దేవాలయంలో వినాయక చవితి (గణేష్ జయంతి), విరాడ్ చతుర్థి, సంకష్టి చతుర్థి మొదలైన ప్రధాన పండుగలు జరుపబడుతాయి. తిరువోణం, దసరా, విషు మొదలైన వాటి సందర్భంగా ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు.

దుస్తుల కోడ్

[మార్చు]

కేరళలోని అనేక ప్రముఖ దేవాలయాల మాదిరిగానే, ఇక్కడి ప్రధాన దేవాలయ సముదాయంలోకి ప్రవేశించడానికి పురుషులు ముండు ధరించాలి, పైభాగంలో దుస్తులు ధరించకూడదు. స్త్రీలు చీర వంటి సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాల్సివుంటుంది.

మూలాలు

[మార్చు]
  1. "Pazhavangadi Ganapathy Temple Trivandrum". keralatourism.travel. Archived from the original on 2021-08-05. Retrieved 2022-08-13.
  2. "Trivandrum temples that are architectural marvels". Times of India Travel. 2021-02-23. Archived from the original on 2021-02-23. Retrieved 2022-08-13.
  3. Regiments and Institutions, indianarmy.nic.in (2020-05-06). "Sree Mahaganapathy Temple". Archived from the original on 6 May 2020. Retrieved 2020-05-06.
  4. Apr 17, Aswin J. Kumar / TNN /; 2018; Ist, 12:53 (2018-04-17). "Pazhavangadi Ganapathy Temple in for a makeover | Thiruvananthapuram News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-13. Retrieved 2022-08-13. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]