పటాని సమంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పటాని సమంత్

పాశ్చాత్య విజ్ఞాన మేధస్సుకు ప్రభావితం కాకుండా పూర్తిగా స్వయంకృషితో విజ్ఞాన తృష్ణతో ఖగోళ శాస్త్ర రంగానికి తమ కృషి ఫలాలు అందించిన పటాని సమంత్ పూర్తిపేరు మహామహోపాధ్యాయ చంద్రశేఖర్ సింగ్ హరిచందన్ మహాపాత్ర సమంత్. ఈయన పటాని సమంత్ చంద్రశేఖర్ గా కూడా ప్రసిద్ధి చెందారు.

బాల్యం

[మార్చు]

ఈయన 1835, డిసెంబర్ 13ఒడిషా రాష్ట్రంలోని ఖండాపర ప్రాంతంలో జన్మించారు. బాల్యం నుంచి విశ్వం, ఖగోళం, రాశులు మొదలైన అంసాల మిద ఆసక్తి పెంచుకొని సంస్కృతంలోని శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేశారు. తన తండ్రియే ఈయన ప్రధమ గురువు. చేతికర్ర సహాయంతో కొలతలు కొలుస్తున్న కొడుకు చేష్టలు చూసిన తండ్రి ఆతడిని సంస్కృత శిక్షణకు చేర్చగా, సుమంత్ ప్రాచీనుల శస్త్రీయ పరిజ్ఞానాన్ని ఔపాశన పట్టారు. ఈయన జీవిత కాలంలో పాశ్చాత్య దేశాలలో ఖగోళ విజ్ఞాన పరిధిపెరుగుతున్నా, ఈయనకు ఏ మాత్రం తెలియడానికి అవకాశమూలేదు. ఆ ప్రభావానికి దరి చేరనేలేదు. అందుబాటులో ఉన్న సంస్కృత భాషలోని సంప్రదాయ సిద్ధాంత గ్రంథాలనే అధ్యయనం చేసి, ప్రయోగశీలిగా రూపొందారు. లీలావతీ బీజగణితాన్ని, సిద్ధాంతశిరోమణి, సూర్యసిధ్దాంతం, వ్యాకరణం, కవ్యాలు చదివి అధికజ్ఞానం సంపాదించాడు పటాని సుమంత్. కాటికర్ర, చేతికర్ర, ఏనుగును దండించే శూలం ఇవే సుమంత్ వాడిన తన ఖగోళ పరిశీలనా పరికరాలు. తన 11 ఏళ్ళ పాటు ఖగోళశాస్త్రం పై దృష్టి మరల్చి సమయం దొరికినప్పుడల్లా ఒరిస్సా అడవుల్లో, కొండలమీద తన పరిశోధనలు జరిపేవాడు.

ఖగోళ పరిశోధనలు

[మార్చు]

కంటితో చూడలేని ధనూరాశిని అయిదారు శతాబ్దాల క్రితమే మన పూర్వీకులు కనిపెట్టగలిగారు. ధనూరాశినే కాదు. మిగిలిన పదకొండు రాశులను వారు ఏ శాస్త్రీయ పరిజ్ఞానంతో గుర్తించగలిగిందీ ఈ రోజున మనం తెలుసుకోలేకపోతున్నాం. రవి (సూర్యుడు) సప్తశ్వరుఢుడని చెబుతూ సూర్యకాంతి వేరురంగుల కలయిక అని వేలాది సంవత్సరాల ఏ విధంగా గుర్తించగలిగారు.ప్రపంచ ప్రఖ్యాత ఖగోల శాస్త్రవేత్త "నెకల్షన్ మెర్లే" జీవిత కాలానికి కొన్ని వందల సంవత్సరాల పూర్వమే శ్రీనాధకవి తన "కాశీ ఖండం"లో కాంతివేగాన్ని ఎలా చెప్పగలిగాడు? దానికి ఆయన కనిపెట్టలే;దు. తన కాలం నాటికి తెలిసిన శాస్త్రీయ జ్ఞానాన్ని ఆయన తన పధ్యాలలో అవసరార్థం వాడుకున్నారు. ఈ కోవలోనే పటాని సమంత్ ఖగోళ శాస్త్రానికి సంబంధించి చేసిన పరిశీలనలు, గణింపులకు మూలాధారాలేమిటో అంతుపట్టడం లేదు. ఖగోళ విజ్ఞానంలో దృగ్గోచరమయ్యే ఘటనాల విలువలు గణించడానికి ప్రధానంగా రెండు రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి భూకేంద్రక సిద్ధాంతం, రెండవది సూర్యకేంద్రక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాల ఆధారంగానే రోదసి మీద పరిశోధనలు, పరిశీలనలు గణింపులూ చేయవచును. ఖగోళంలో సంభవించే అపురూప సంఘటనల ఆధారంగా ఆయా గణింపులను, గణీంచిన విలువలను పరీక్షించి సరిచేసుకోవచ్చును. ఫక్తు సంప్రదాయ పండితుడైన పటాని సమంత్ 1874 లో జరుగబోయే శుక్ర గ్రహ సంక్రమణం (శుక్ర గ్రహం ప్రయాణ మార్గం - ట్రాన్సిల్ ఆఫ్ వీనస్) గూర్చి చాలా కాలం ముందుగానే ప్రకటించారు. త్రికోణ శాస్త్రం ఆధారంగా ఎగురుతున్న పక్షి గమనం, పర్వతాల ఎత్తు సుమంత్ నిర్దిష్టంగా కనుక్కునేవారు. తను స్వయంగా తయారు చేసిన మాన పరికరం ఆధారంగా భూమికి-సూర్యుడికి మధ్య దూరాన్ని కనుక్కోగలిగారు. అది ఈకాలంలో అధునాతన శాస్ర గణిత లెక్కలతో సరిసమానంగా సూచించబడినది. దానినే తాను స్వయంగా వ్రాసిన సిద్ధాంతదర్పణం అనే పుస్తకంలో తెలియపరిచారు. ఆర్యభట్ట, భాస్కరాచార్యులు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు వారివ్రాతలను పరిశీలించి పై (Pi) లేదా π అనేది చాలా ముఖ్యమైన గణిత స్థిరాంకాలలో ఒకటి. దీని విలువ సుమారుగా 3.14159 అని సుమంత్ తన పరిశోధనలద్వారా తెలియపరిచారు. సుమంత్ చేసిన అద్వితీయ పరిశోధనల ఆధారంగా పూరీ రాజు చంద్రశేఖరసమంత్ ని, హరిచందన్ మహొపాత్ర, మహా మహోపాధ్యాయ అన్న బిరుదులతో సత్కరించారు.

ఈయన పరిశీలనలకు జ్ఞాన ప్రపంచానికి కోపర్నికస్ తీసుకు వచ్చిన ఖగోళ శాస్త్ర విప్లవం గూర్చి పరిచయమే లేదు. అయినప్పటికీ 1874, డిసెంబరు 9 వ తేదీన శుక్ర గ్రహం సంక్రమణం ఈయన నిర్ధారించిన తేదీనే జరిగింది. ఎదిగీ ఎదగని ఆనాటి భారతీయ ఆధునిక ఖగోళ శాస్త్ర చరిత్రలో ఒక అధ్బుత పరిశోధనగా మిగిలి పోయింది. ఈ సంఘటన వ్య్వధి, సమయం ఆధారంగా భూమి - సూర్యుడి నడుమ దూరాన్ని గణన చేయతం ఎంతో ఆసక్తికరం. ఆనాడు దేశం లోని అనేకమందిని దిగ్భ్రాంతి పరిచిన ఆ సంఘటన బ్రిటిష్ పాలకులకు కూడా ఆసక్తిని కల్పించింది. ప్రభుత్వ అధ్వర్యంలో అబ్జర్వేటరీ సెంటర్లు ప్ర్రారంభమై పనిచేయడం ప్రారంభించేలా సమంత్ కృషి చేయగలిగాడు. అంతే కాదు, దేశంలో విద్యావంతులైన కొంతమంది జిజ్ఞానువులు, సంస్థానాధీశులు ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి పెంచుకొని, ఈ దిశగా కృషి ప్రారంభించారు.

పటాని సమంత్ పరిశీలించి గణింపులు చేసి, నిర్ధారించిన ఖగోళ సంఘటన తిరిగి 2004 జూన్ 8 న జరిగింది. 1874 తర్వాత తిరిగి శుక్రగ్రహం సంక్రమణం జరిగింది. ఈయన 1874 నాటి శుక్రగ్రహ సంక్రమణమునకు సంబంధించిన పరిశీలనలు, గణీంపులు పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్తలు చేసిన కృషికి ఏమాత్రం తీసిపోవు. విశ్వాంతరాళంలోని ఘటనా ఘటనలను తాము స్వయంగా తయారుచేసుకున్న పరికరాల సాయంతో, నైపుణ్యంతో పరిశీలించారు. ఖగోళ రహస్యాలను ఛేదించడానికి అనేకానేక అంశాలను శోధించి తన జీవిత కాలాన్ని వ్యయపరచిన సమంత్ భవిషత్తరాల కోసం ఎన్నెన్నో అమూల్యమైన పరిశీలనలు, గణింపులు, నిర్దారణలు చేశారు. ఖగోళ శాస్త్ర అంశాలను అవిరామంగా శోధించి, పరిశోధించి, తమ కృషి యావత్తును సిద్ధాంతదర్పణ సంస్కృత గ్రంథంలో పొందుపరచారు. ఈ గ్రంథాన్ని ఒరియా లిపిలో తాళపత్రాల మీద రాయగా 1899 లో కలకత్తా యూనివర్సిటీ వారు ప్రచురించారు. ఈ గ్రంథం మొత్తం 2500 శ్లోకాలలో నిండి ఉంది.

సిద్ధాంత దర్పణ

[మార్చు]

సిద్ధాంత దర్పణలో ఖగోళ శాస్త్ర సంబంధమైన అనేక అద్భుత అంశాలు ఉన్నాయి. సూర్య, శుక్ర గ్రహాల బింబాల నిష్పత్తి 1:32 అని లెక్కించడం, పరమాద్భుతమేకాదు, విస్మయం కూడా ఇది 31 నిమిషాల 31 సెకన్లు అని లెక్కించడం మరింత గొప్ప విషయం. ఈయన రాసిన సిద్ధాంత దర్పన లోని అనేక ముఖ్యాంశాలను ఆంగ్లంలోనికి అరుణ్ కుమార్ ఉపాధ్యాయ అనువదించారు. అయినప్పటికీ పటాని సుమంత్ కృషి చరిత్ర గర్భంలోనే మిగిలిపోయింది. విశ్వాంతరాళంలో సంభవింపబోయే శుక్ర గ్రహ సంక్రమణం గురించి ఈయనకు ఎలా తెలిసిందో ఎవరూ ఊహించలేకపోయారు. స్వయంగా అధ్యయనం చేసి, గణించి, గుర్తించి పరిశీలనలు చేసి ఉండి ఉంటారని అందరూ భావిస్తారు.

అస్తమయం

[మార్చు]

ఖగోళశాస్త్ర విజ్ఞానంలో అనితర సాధ్యమైన కృషి చేసిన పటాని సుమంత్ 1904 లో మరణించాడు. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలలో మంత్ర రూపంలోనూ, శ్లోకాల రూపంలోనూ అనేకానేక వైజ్ఞానిక రహస్యాలు నిక్షిప్తమై ఉండేవి. ధృవుడు అనే కల్పిత పాత్రను సృష్టించి అతని తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై "ఆకాశంలో అత్యున్నత స్థానాన్ని పొందిన నీ చుట్టూ సప్తర్షులు 26000 సంవత్సరాల అంతరాలలో ప్రకక్షిణలు చేస్తూ ఉంటారు" అని వరమిచ్చినట్లుగా భాగవత రచనలో ఉంది. విష్ణువచ్చల యనంలో ఒక వలయం పూర్తి కావడానికి 26000 సంవత్సరాలు పడుతుందని భాగవత రచయితకు హ్గిపార్చస్ (ఈ విషయాన్ని క్రీ.పూ 143 లో కనుగొన్నాడు) కంటే ఎంతో ముందుగా తెలియడం చాచా ఆశ్చర్యకరమే. ఇదే తరహాలో పటాని సమంత్ డాక్టరేట్లు, డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టాలు లేకుండానే అద్వితీయ కృషిచేసి ఖగోళ శాస్త్ర పరిశోధనలు వెలువరించారు. ఈయన ఖగోళ శాస్త్రపరమైన కృషి చిరస్మరణీయం. ఈయన చేసిన అపూర్వ పరిశోధనా కృషిని గుర్తించిన మన కేంద్ర ప్రభుత్వం (తపాలా శాఖ) 2001, జూన్ 11 వ తేదీన చంద్రశెఖర సుమంత్ పేరుమీదుగా ఒక పోస్టేజి స్టాంపును విడుదల చేసింది.

సూచికలు

[మార్చు]