పట్వారీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నియాజ్ అలీ పట్వారీ. సర్గోధ. పంజాబ్ 1946. (ఫోటోగ్రాఫర్ ఎవరో తెలియదు)

పట్వారీ అనేది నిజాం పరిపాలన కాలంలో హైదరాబాద్ రాజ్య గ్రామ రెవెన్యూ వ్యవస్థలో గ్రామాధికారి లేదా కరణం ఉద్యోగం.[1] హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ వ్యవస్థ, భారత స్వాతంత్ర్యానంతరం భారత రెవెన్యూ వ్యవస్థలో భాగమైంది. 1984 వరకూ కొనసాగిన ఆ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా నాటి తెలుగు దేశం ప్రభుత్వం రద్దుచేసింది.

చరిత్ర[మార్చు]

1830ల కాలంలో హైదరాబాద్ రాజ్యంలో పట్వారీల అధికారాన్ని గురించి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాసుకున్నారు. హైదరాబాద్ దాటి వచ్చాకా ప్రతి గ్రామంలోనూ ఉన్న పట్వారీలు మంచి అధికారం కలిగివున్నారని, తాను వారి ద్వారా ప్రయాణించబోయే మజిలీ గ్రామానికి కబురు పంపి అన్ని ఏర్పాట్లూ సౌకర్యవంతం చేయించుకోగలిగానని వ్రాశారు.[2]

అధికారాలు[మార్చు]

గ్రామాధికారులుగా వీరికి ఉన్న అధికారాల్లో పరిమితులు ఉన్నా నాటి తెలంగాణలో విద్యావంతుల శాతం తక్కువగా ఉండడం, గ్రామంలోని రెవెన్యూ వ్యవహారాలన్నీ పట్వారీలకు కంఠోపాఠం కావడం కారణంగా వీరు చెలాయించినది అపరిమితాధికారమేనని చెప్పవచ్చు. ఆ కారణంగా రైతులంతా పట్వారీల కనుసన్నల్లో మెలిగేవారు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 గుమ్మన్నగారి, బాలశ్రీనివాసమూర్తి (జూన్ 2014). ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ. హైదరాబాద్: ఎమెస్కో బుక్స్. ISBN 978-93-89652-05-01. {{cite book}}: Check |isbn= value: length (help); Check date values in: |date= (help)
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పట్వారీ&oldid=3259765" నుండి వెలికితీశారు