చర్చ:పట్వారీ
స్వరూపం
సహాయం కోసం
[మార్చు]చంద్రకాంత రావు గారూ,
నమస్తే. నా దగ్గర ఉన్న అతికొద్ది సమాచారంతో ఈ వ్యాసం సృష్టించాను. ఐతే ఇది అవసరమైనదేనని నా అంచానా. పాపులర్ కల్చర్ గురించి మాత్రం నేను వ్రాయగలను. సాహిత్యంలోనూ, మాభూమి వంటి సినిమాల్లోనూ ప్రస్తావనల గురించి వ్రాయగలను. కానీ దీన్ని సమగ్రం కావించాలంటే మీ సహకారం అవసరమని నా భావన. మీరేమైనా సాయపడగలరా? అలాగే ఈ పదవికి బ్రిటీష్ ఇండియా కౌంటర్ పార్ట్ అయిన కరణంను ఇది సమగ్రం కావడాన్ని బట్టి, దీన్ని అభివృద్ధి చేసినప్పుడు కలిగే అనుభవాన్ని అనుసరించి తయారుచేద్దాం అనుకుంటున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 12:08, 1 జనవరి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, ఈ విషయంలో నేను తప్పకుండా సహకరించగలను. పట్వారీ పేరే ఇప్పుడు గ్రామ రెవెన్యూ అధికారిగా మారిననూ అధికారాలు, విధులు చాలా వరకు మారిపోయాయి. అప్పుడు గ్రామానికి ఓ పట్వారీ, ఇద్దరు పటేళ్ళు (మాలి పటేల్, పోలీస్ పటేల్) ఉంటే ఇప్పుడు రెవెన్యూ కార్యదర్శి, పంచాయతి కార్యదర్శి ఉన్నారు. ఈ కార్యదర్శి పేరుకంటే ముందు గ్రామ రెవెన్యూ అధికారి అనేవారు. పట్వారీ వ్యవస్థ ఎలా మొదలైందీ, ఎలా పరిణామం చెందుతూ చివరకు హైదరబాదు రాష్ట్రంలో, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (1983 వరకు) కొనసాగింది తదితర విషయాలు వ్రాయాల్సి ఉంటుంది. వంశపారంపర్య వ్యవస్థ నుంచి ప్రభుత్వ నియామకాల మార్పు వల్ల గ్రామస్థులకు, ప్రభుత్వానికి కలిగే లాభనష్టాలు, అప్పటి విధులకు, ఇప్పటి గ్రామ రెవెన్యూ కార్యదర్శి విధులకు, బాధ్యతలకు తేడాలు ... ఇలా చాలా వివరంగా వ్రాయవచ్చు. మూలాలు కావాలంటే పాత పుస్తకాలకు బూజు దులపాల్సి ఉంటుంది. అంతవరకు నా అవగాహన మేరకు వ్యాసాన్ని పొడగిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:10, 1 జనవరి 2015 (UTC)
- మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 17:22, 1 జనవరి 2015 (UTC)