Jump to content

పద్మరాజన్ (రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి

దేశంలో ఎక్కడ  ఎన్నికలు జరిగినా  మొదట నామినేషన్‌ వేసే కె.పద్మరాజన్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు , వివిధ రాష్ట్రాల సీఎం ల పై పోటీచేసిన పద్మరాజన్ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించడమే లక్ష్యంగా ముందుకు వెళతానన్నాడు.[1]

జననం

[మార్చు]

తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరు సమీపంలోని ఎరటై పులియ మరత్తూరులో ఆయన జన్మిచాడు.[2]

గల్లీ నుండి ఢిల్లీ వరకు పోటీ

[మార్చు]

1986లో మెట్టూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగాడు. ఆ తర్వాత మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయిపై లక్నోలో, పీవీ నరసింహారావుపై నంద్యాలలో పోటీ చేశాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్‌ నారాయణన్, ఏ.పి.జె. అబ్దుల్ కలామ్, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీలపై కూడా ఆయన పోటీ చేశాడు. అదే విదంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఎడప్పడి కె. పళనిస్వామికి పోటీగా ఎడపాడి నియోజకవర్గంలో, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో  సీఎం పినరయి విజయన్‌కు పోటీగా ధర్మదం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీకి దిగాడు.[3]

సొంత డబ్బుతో నామినేషన్లు

[మార్చు]

పద్మరాజన్ ప్రతి ఎన్నికల్లోనూ తన సొంత డబ్బు ఖర్చు పెట్టి డిపాజిట్‌ సొమ్ము చెల్లించి నామినేషన్లు వేస్తుంటాడు. ఇప్పటి వరకు 226 సార్లు ఆయన నామినేషన్లు వేశాడు. 227వ సారి తమిళనాడు స్థానిక సంస్థలకు నామినేషను వేసాడు. ఇన్ని సార్లు నామినేషనులు వేసిన పద్మరాజన్ ఇప్పటివరకు కనీసం వార్డు సభ్యునిగా కూడా గెలవలేదు.[4]

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు

[మార్చు]

వివిధ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న ఆయనకు మంచి గుర్తింపు దక్కింది. ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు గాను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు ఆయన్ను గుర్తించి  తమ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు కల్పిస్తూ సర్టిఫికెట్‌ను అందించింది.

గిన్నిస్‌ బుక్‌లో  చోటే లక్ష్యంగా

[మార్చు]

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించిన అనంతరం  పద్మరాజన్‌ గిన్నిస్‌ బుక్‌ రికార్డులో తన పేరు నమోదయ్యే వరకు అన్నీ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు. అప్పటిదాకా తన ప్రయత్నాన్ని ఆపననన్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న పద్మ రాజన్." indiaherald.com. Retrieved 2022-01-30.
  2. tupaki.com. "Padmarajan enters the records with defeat". tupaki. Retrieved 2022-01-30.
  3. telugu, 10tv (2022-01-29). "Padmarajan : 226 సార్లు ఓటమి.. అయినా తగ్గేదేలే.. 227వ సారి ఎన్నికల బరిలోకి.. | Election King Padmarajan Files Nomination For 227th Time In Tamil Nadu Polls". 10TV (in telugu). Retrieved 2022-01-30.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. "padma raajan".{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]