Jump to content

పద్మ లక్ష్మి

వికీపీడియా నుండి
పద్మలక్ష్మి
2008లో జరిగిన ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న లక్ష్మి
జననంపద్మ పార్వతి లక్ష్మి వైధ్యనాధన్
(1970-09-01) 1970 సెప్టెంబరు 1 (వయసు 54)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
పౌరసత్వంఅమెరికన్
వృత్తిమోడల్, రచయిత్రి, నటి, టీవీ వ్యాఖ్యాత
ఎత్తు5 అ. 10 అం. (1.78 మీ.)
భార్య/భర్తసల్మాన్ రష్డే
పిల్లలు1

పద్మ లక్ష్మి ( 1970 సెప్టెంబరు 1)[1] అమెరికాకు చెందిన భారతీయ రచయిత్రి, నటి, మోడల్, టీవీ వ్యాఖ్యాత, నిర్మాత. ఆమె అసలు పేరు పద్మ పార్వతి లక్ష్మి వైద్యనాధన్. ఆమె రాసిన మొట్టమొదటి వంటల పుస్తకం ఈజీ ఎగ్జాటిక్ 1999లో గౌర్మాండ్ ప్రపంచ వంటక పుస్తకాల పురస్కారాలలో, ఉత్తమ మొదటి వంటల పుస్తకంగా అవార్డు గెలుచుకుంది. ఆమె ప్రముఖ అమెరికా రియాలిటీ టీవీ కార్యక్రమం టాప్ షెఫ్ కు 2006 నుంచి (రెండవ సీజన్ నుంచి) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా ఆమెకు ప్రైంటైం ఎమ్మీ ఔట్ స్టాండింగ్ రియాలిటీ షో వ్యాఖ్యాతగా నామినేషన్ లభించింది. 2010లో టాప్ షెఫ్ కార్యక్రమం ఔట్ స్టాండింగ్ రియాలిటీ కార్యక్రమంగా ఎమ్మీ పురస్కారం గెలుచుకోవడం విశేషం. ఆమె రాసిన లవ్, లాస్ అండ్ వాట్ వియ్ ఈట్ పుస్తకం 2016 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు విడుదలైంది.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

పద్మ, తమిళనాడులోని మద్రాసు (ఇప్పటి చెన్నై)లో జన్మించింది. [2][3][4][5][6] ఆమె తల్లి, విజయ, క్యాన్సర్ వైద్య నిపుణురాలు. ప్రస్తుతం పదవీ విరమణ చేశారు. ఆమె తండ్రి ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ ఫైజర్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేసి, పదవీ విరమణ చేశారు.

లక్ష్మి తల్లి న్యూయార్క్ లో ఉండటంతో, ఆమె చిన్నతనమంతా చెన్నైలోని అమ్మమ్మా, తాతయ్యల దగ్గర కొన్నాళ్ళూ, తల్లి దగ్గర కొన్నాళ్ళూ ఉంటూ వచ్చింది.[6][7][8] ఆమె మాతృభాష తమిళం.[9]

1984లో, పద్మకు దాదాపు 14ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడింది. ఈ సిండ్రోమ్ లో ఒక ఇన్ఫెక్షన్ వల్ల శరీరం అతి సున్నితంగా మారుతుంది. ఆమె దాదాపు మూడు వారాలపాటు ఆసుపత్రిలోనే ఉండి, చికిత్స పొందాల్సి వచ్చింది. ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెండు రోజులకే కాలిఫోర్నియాలోని మలిబూలో పెద్ద కార్ యాక్సిడెంట్ కు గురైంది. ఈ యాక్సిడెంట్ వల్ల ఆమె కుడి చట్టకు, కుడి చేతికి ఫ్రాక్చర్ అయింది. [10] ఈ ఫ్రాక్చర్ వల్ల ఆమెకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆమె మోచేతి నుండి జబ్బ వరకూ ఏడు ఇంచుల మచ్చ ఉంటుంది.

లాస్ ఏంజలెస్లో చదువుకునేటప్పుడు, ఆమెను సాటి విద్యార్థులు తీవ్ర జాతి వివక్షకు గురి చేశారు. దీంతో ఆమె చాలా కాలం తనను తాను ద్వేషించుకునేది. అప్పటికి టీనేజ్ లో ఉన్న ఆమె మనసుపై ఈ వివక్ష చాలా బలమైన ముద్ర వేసింది. అయితే, ఈ పరిస్థితి నుంచి తనను తాను బయట పడేసుకోవడానికి చాలా ప్రయత్నం చేసి, సఫలం కాగలిగింది పద్మ.[11]

విద్యాభ్యాసం

[మార్చు]

పద్మ 1988లో కాలిఫోర్నియాలోని సిటీ ఆఫ్ ఇండస్ట్రీలో ఉన్న విలియం వర్క్ మాన్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. తరువాత ఆమె, 1992లో, మస్సచ్సెట్స్, వర్సెస్టర్ లోని క్లార్క్ విశ్వవిద్యాలయం నుంచి థియేటర్ ఆర్ట్స్ విభాగంలో బిఏ ఆనర్స్ చదివింది.[12] ఆమె పాఠశాల చదువు నుంచే విదేశాలలో చదువుకుంది. మాడ్రిడ్ లో ఆమె చదువుకునేటప్పటి నుంచే మోడలింగ్ లో కెరీర్ ప్రారంభించింది.

సంపాదకత్వ లేఖనం

[మార్చు]

లక్ష్మీ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో అనేక వ్యాసాలు రాసేది. ఆమె అన్నా వింటర్ అభ్యర్థనపై "వోగే" (అమెరికన్ ఎడిషన్) లో తన శైలిలో వ్యాసాలు రాసేది. ఆమె హర్పెర్ బజార్ (యు.ఎస్, యు.కె ఎడిషన్స్) లో కూడా ఆర్టికల్స్ ను రాసేది.

మూలాలు

[మార్చు]
  1. "Padma Lakshmi". TVGuide.com. Retrieved 2014-04-21.
  2. Gauri Sinh (January 25, 2002). "It's my life, says Padma Lakshmi". The Times of India. Archived from the original on 2012-11-04. Retrieved 2011-01-03.
  3. Neha Tara Mehta (October 24, 2010). "Padma a secret in Rushdie memoir". India Today. Retrieved 2011-01-03.
  4. Amit Roy (April 30, 2006). "The Telegraph – Calcutta : Look". The Telegraph. Calcutta, India. Archived from the original on 2012-10-04. Retrieved 2011-01-03.
  5. Jennifer Bain (December 22, 2007). "Padma Lakshmi a global brand in the making". Toronto Star. Archived from the original on 2012-10-23. Retrieved 2011-01-01.
  6. 6.0 6.1 Jess Cartner-Morley, "Beautiful and Damned". The Guardian. April 8, 2006
  7. Escape Views Harpers & Queen—March 2004, Lakshmifilms.com
  8. Divya Unny (July 5, 2007). "Padma Lakshmi..the woman who broke Rushdie's heart". www.dnaindia.com. Retrieved 2011-01-01.
  9. K, Kannan (January 23, 2002). "Talk of The Town". The Hindu. Chennai, India. Archived from the original on 2013-05-30. Retrieved July 24, 2011.
  10. "Letter From New York". Vanity Fair. Issues 566–568. 2007. {{cite journal}}: |volume= has extra text (help)
  11. Hauser, Christine (2016-03-09). "Padma Lakshmi Opens Up About Rushdie in Memoir". The New York Times. ISSN 0362-4331. Retrieved 2016-04-29.
  12. Bravotv.com (2007)BIOS / Padma Lakshmi Archived నవంబరు 10, 2006 at the Wayback Machine