పనస కుటుంబము
- పనసకుటుంబము
పనస చెట్లును చాల చోట్లనే పైరు చేస్తున్నారు.
ఆకులు ఒంటరి చేరిక, తొడిమ గలదు కణుపు పుచ్చములున్నవి. లఘు పత్రములు, అధశ్శిర అండాకారము. సమాచలము, విషమఖ పత్రము, పత్రము బిరుసుగా నుండును. శిరోదంతి ఆకులను త్రుంచిన పాలు గారును.
- పుష్పమంజరి.
- మాను మొదటి భాగము మీద మిక్కిలి చిన్న కొమ్మల నంటి కంకులు పుట్టుచున్నవి. ఏక లింగ పుష్పములు. మగ పువ్వుల కంకి మిక్కిలి చిన్నది.
- మగ కంకి.
- పుష్పనిచోళము
- రెండు రేకులు మాత్రమే యున్నవి. మంచి రంగు గాని వాసన గాని లేదు.
- కింజల్కములు
- . ఒకటియే కాడస్ లావుగ నున్నది. పుప్పొడి తిత్తి రెండు గదులు గలది.
- ఆడుకంకి
- మగ కంకి కంటే గుండ్రముగా నున్నది.
- పుష్ప నిచోళస్ము
- సంహ్యుక్తము. గొట్టమువలె నున్నది. గొట్టము మూతి సన్నముగా నున్నది.
- అండకోశము
- అండాశయము ఒక గది. ఒక అండము గలదు. కీలము ప్రక్కగాను కొంచెము పొడుగుగాను నున్నది. కీలాగ్రము లావు.
పండు ఒక పుష్పము వల్లనే ఏర్పడుట లేదు. కంకి మీద నున్న పుష్పములన్నియు గలిసి ఒక పండు అగుచున్నవి. ఒక్కొక్క పుష్పము తొనల ప్రక్కనుండెడు పీచును పుష్పములే గాని అవి గొడ్డులై యున్నవి. లేత కాయలను గోసిన పాలు వచ్చును.
మఱ్ఱి చెట్టు మనదేశములో పలు తావులందు పెరుగు చున్నది. దీనికి ఊడలు గిలది విశాలముగ వ్యాపించును. దీని కొమ్మలలోను పాలు గలవు.
- ఆకులు
- ఒంటరి చేరిక, లఘు పత్రములు, తొడిమ పెద్దది. కణుపు పుచ్ఛములు గలవు. అండాకారము, సమాంచలము, దట్టముగాను బిరుసుగాను నుండును.
- పుష్ప్ మంజరి
- మఱ్ఱి చెట్టునకు బువ్వులు లేవను కొను చున్నారు గాని, ఆకుల వద్ద కాయల వలె అగుపించునవి పుష్పములే. ఒక కాయ వలెనగు పించునది ఒక పుష్పము గాని, ఒక కాయ గాదు. పనసకంకి మీద మిమ్మట్లే దానిలోను చాల పుష్పములున్నవి. ఈ సంగతి లేత వానిని తుంపి పి చూచిన తెలియగలదు. వృంతము కాడ వలె నుండ్క, గుండ్రమై బంతివలెనై పుష్పస్ముల నాన్నిటిని నావరించు చున్నది. ఒక్కచోట మాత్రమఒక రంద్రము గలదు. ఈ రంధ్రము యొద్ద కాడస్ల నంటికొన్ని గలవు. అవి గొడ్డులైన పుష్పములు. పురుష పుష్పములును స్త్రీ పుష్పములును అడుగుగా నున్నవి. ఇవి మిక్కిలిచిన్నవి.
- పురుష పుష్పము
- పుష్పనిచోళము. కింజల్కములు వీని రేకుల కెదురుగా నున్నవి. గాన నిది పుష్ప కోశము. రక్షక పత్రములు నాలుగు.
- కింఝల్కములు ఒకటో రెండో యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
స్త్రీ పుష్పములలో రెండు రకములున్నవి. కొన్నిటి కాడ (ఉప వృంతము) పొడుగుగను కీలము పొట్టిగను నున్నది. కొన్నిటి కాడ పొట్టిగను కీలము పొడుగుగను నున్నది.
- అండకోశము
- ఒక గది అండము ఒకటి. కీలాగ్రము లావు.ఈ పువ్వులలో గర్భాధానము చిత్రముగ జరుగు చున్నది. కాయ వంటి దాని మీద నొక రంద్రముండుట్ జూచితిమి కదా... ఆరంధ్రము ద్వారా చిన్న చిన్న పురుగులు గుడ్లు పెట్టుకొనుటకు వచ్చును. అవి పొట్టి కీలమున్న అండాశయములోనే గ్రుడ్లు పెట్టును. అ గ్రుడ్లు పెరిగి పెద్దవి పురుగులి పైకెగిరి పోవు నపుడు వాని దేహములకు కింజల్కములు తగులు చున్నవి. పుప్పొడి వాని శరీరము మీద రాలు చున్నది. ఈ పురుగులు మరియొక దానిలో ప్రవేశించి నపుడు వీని పైనున్న పుప్పొడి కీలాగ్రముల పైబడు చున్నది. ఈ రీతిని చిన్న చిన్న పురుగుల సహాయమున గర్భ ధారణా పొందు చున్నవి.
ఇది యొక పెద్దకుటుంబము. దీనిలో పెద్ద వృక్షములు, గుబురు మొక్కలు, గుల్మములు కూడా గలవు. ఆకులు ఒంటరి చేరిక, వానికి కణుపు పుచ్చములున్నవి. కొన్ని చెట్లలో, కొమ్మలందును, ఆకులందును పాలు గలవు. పువ్వులు చిన్నవి. ఏక లింగములు; ఏక లింగ వృక్షములు కూడా గలవు. పుష్పనిచోళము మాత్రమున్నది. కింజల్కములు సాధారణంగా పుష్పని చోళపు తమ్మెలన్నియుండి వాని కెదురుగా నుండును. అండాశయములో నొక గది గలదు. చెట్లయందు పాలు గలవో, లేవో, ఏక లింగ పుష్పములు వేరువేరు చెట్ల మీద నున్నవో, కింఝల్కములు మొగ్గలో వంగి యున్నవో, తిన్నగనే యున్నవో మొదలగు అంశములను బట్టి ఈ కుటుంబమును జాతులుగను తెగలుగను విభజించి యున్నారు. కొందరు శాస్త్రజ్ఞలు ఈ కుటుంబము మూడు నాలుగు వేరు వేరు కుటుంబములుగా విడగొట్టి యున్నారు.
పనస పండ్లు రుచిగా నుండును. కావున మన దేశములో చాల చోట్లనే చెటేలును పెంచు చున్నారు. పనస తోటల కంతే విశేషముగ పాతు బడ నవసరము లేదు. ఈ చెట్ల ఉండి జిగురు కూడా వచ్చును. దీని పాలు జిగురుగా నుండుట చే వానిని దీసి పిట్టలను బట్టుకొనుటకు ఉపయోగింతురు. దీని కలపయు బాగుగనే యుండును. చిన్న పడవలు, తలుపులు, ద్వారబంధములు మొదలగునవి చేయుటకు బనికి వచ్చును. దీని రంపపు పొట్టును నీళ్ళతో కాచి పచ్చని రంగు చేయుదురు. ఆకులు వేళ్ళు కూడా ఔషధములలో ఉపయోగించును.
గంజాయి చెట్టు చిన్న మొక్క. దాని నుండి నారయు గింజలనుండి నూనెయు, గంజాయి, భంగు వచ్చుచున్నవి గాన నీ మొక్కలను పైరు చేస్తున్నారు. ఇవి మూడు వేల అడుగుల ఎత్తులోపున గాని, ఏడు వేల అడుగుల యెత్తు పైన గాని వర్థిల్లలేవు. ఈ మొక్కలు హిందూస్థానము నందే పైరగు చున్నవి. వీనికి సార వంతమగు నేలలును విస్థారము ఎరువును గావలయును. విత్తులు జల్లినాయిదారు నెలలకు పది పడ్రెండు అడుగులు ఎత్తు పెరుగును. గంజాయి కావల్లెనన్న లేత కాయలను ఆకులను చేతులతో రాచిన వచ్చెడు జిగిరు పదార్థమును బాగు చేతురు. నారకై ఎదిగిన మొక్కలను గోసి కట్టలు కట్టి ఒక దినము ఎండలో పెట్టుదురు. వీనిని కోయుటలో మగ మొక్కలను, ఇరువది ముప్పది దినములు ముందుగా గోయుదురు. ఆడ మొక్కలను వాని కాయలలోని గింజలు పూర్తిగా నెదుగక పూర్వమే కోయుదురు. గింజలు పూర్తిగా నెదిగిన యెడల మంచి నార రాదు.మొగ మొక్కలు త్వరగ పెద్దవగును గావున ఆడమొక్కలేదుగు వరకు నుండ నిచ్చిన వాని నార పాడగును. గంజాయి గింజలను కొందరు తిందురు. వీని యందును మత్తు గలుగ జేయు గుణము గలదు. ఈ గింజలను నూనె తీసిన తరువాత తెలక పిండిగ పశువులకు బెట్టుట మంచిదందురు. అంగళ్ళ యందు భంగు అని అమ్మునది ఎండిన గంజాయి ఆకుల పొడి. గంజాయి కొరకే ఈ మొక్కలను సేద్యము చేసినప్పుడు విత్తనములను మొదట మళ్ళలో జల్లి కొంచమెత్తు ఎదిగిన తరువాత, పెంట వేసి దున్నిన పొలములో మొక్కలను నాటి వేయుదురు. అవి పుష్పింప బోవు చుండగనే మగ మొక్కలను బెరికి వేయుదురు. వీనిని బెరికి వేయుటచే పుప్పొడి లేక, ఆడ మొక్కలు కాయలు గాయవు. లేత కొమ్మల మీద నున్న రోమముల ద్వారా నొక రసము స్రవించి చిన్నబడును. ఈ మొక్కల మీదనున్న ముదురాకులను కూడా త్రుంపి వైచి మొక్కలు కోసి కట్టలు గట్టి కాలి క్రింద పెట్టి త్రొక్కుదురు. దానిచే లేతాకులు, పువ్వులు మొగ్గలు కలిసి ముద్దవలె నగును. గంజాయి ఆకును చిలుములలో పెట్టి హుక్కా పొగాకు మొదలగువాని త్రాగునట్లే త్రాగెదరు. భంగును వేడినీళ్ళలో గలపి వడకట్టి అందులో, పాలు, పంచదార, ఏలక పొడి మొదలగునవి వేసి పుచ్చు కొందురు. దీనిని మితముగ బుచ్చుకొనిన యెడల అంత హాని వాటిల్లదు.గంజాయి నందరును సేద్యము సేయకూడదు. చేయుటకు గవర్నమెంటు వారి అనుమతి పొంద వలయును. దీని అమ్మకము వల్ల చాల రాబడి గలదు. మఱ్ఱి చెట్ల నుండి రెండవరకము రబ్బరు వచ్చును. గాని మంచి రకము రాదు. మఱ్ఱిపాలను నొప్పులకు కీళ్ళ నొప్పులకు నుపయోగింతురు. ఆకులను గూడ కాచి పట్టు వేయుదురు. బెరడు కషాయము అతి మూట్ర్ము జబ్బునకు మంచినదను చున్నారు. దీని కలప పొయి లోనికి తప్ప మరెందుకు పనికి రాదు. జాగ్రత్తగ కోసి తగు కాలము నీళ్ళలో నాననిచ్చి ఎండనిచ్చిన యెడల దీని తోడను పెట్టెలు, తలుపులు చేయ వచ్చును. దీని ఊడలను పెద్ద వనిని చెక్కిన డేరామేకులుగా బనికి వచ్చును. లక్క పురుగు దీని ఆకులను దిని బ్రతుగ గలదు. పశువులను ఏనుగులును లేత కొమ్మలను ఆకులను దినును.
రావి చెట్టు కూడా చాల పెద్ద చెట్టు. పక్షులు దీని కాయలను దిని ఇతర చెట్ల మీద దీని గింజలను బడవైచుటచే వాని మీద మొకలెత్తు చుండును. ఈ చెట్లు మనకును బౌద్ధులకును పవిత్రమనదే. ఇదియు వేప చెట్టును దగ్గర దగ్గరగా మొలచుచో వీని రెండింటికిని వివాహము చేస్తున్నారు. రావి చెట్టు నుండి పాలు వచ్చి చిక్కబడి ఒక గట్టి పదార్థమగును. ఈ చెట్టు నుండి జిగురు కూడా వచ్చు చున్నది. ఈ జిగురును గుల్ల నగల లోపల బెట్టు చుందురు. దీని బెరడు నుండి తీసిన నారతో కొన్ని చోట్ల కాగితములను చేస్తున్నారు. ఇది తోళ్ళు బాగు చేయుటలో కూడా పనికి వచ్చును. నీళ్ళలో వేసి మరుగ నిచ్చిన యెడల నీటికి కొంచె మెరుపు రంగు వచ్చును. వేరును పటిక నీళ్ళలో కాచిన యెడల ఒకవిధమగు ఊదారంగు వచ్చును. కలప పొయ్యి లోనికి మాత్రము పనికి వచ్చు చున్నది. దీని ఆకులు, కాయలు, బెరడు కూడా ఔషధములో వాడు చున్నారు.
అత్తి చెట్టు ఎత్తుగానె పెరుగును గాని మాను వంకర టింకరగా నుండును. వర్షాకాలములో దీని ఆకులు రాలి పోవును. దీని పచ్చి కాయలను పండ్లను కూడా తిందురు. దీని నుండి వచ్చు జిగురును పిట్టలను పట్టుకొనుటకు ఉపయోగించెదరు. కలప పొయి లోనికిని నూతి చట్రములకును బనికి వచ్చును.
రబ్బరు చెట్ల నుండియే వచ్చును. చెట్లలో నున్న పాలు చిక్కబడి, పరిశుద్ధము చేయ బడిన అది రబ్బరగును. పాలనుండి రబ్బరు వంటివే మరి రెండు పదార్థములు కూడా వచ్చును. ఈ పాలు ఒక జాతి చెట్లలోనే కాక చాల వానిలో గలవు. ఆముదము, గన్నేరు, జిల్లేడు పనస కుటుంబములలో పాలున్న మొక్కలనుండి రబ్బరు తియ వచ్చును.
పనస కుటుంబములో విస్తారము రబ్బరు నిచ్చెడు ఒక చెట్టు గలదు. దీనికి తెలుగు పేరేమియు దొరకలేదు గావున దీనినే రబ్బరు చెట్టు అందము.
రబ్బరు చెట్టును మఱ్ఱి చెట్టువలె పెద్ద వృక్షము. దీనికిని ఊడలు దిగును. ఆకులు అండాకారముగానైనను, నిడివి చౌక పాకారముగానైనను నుండును. దీని పండ్లను పక్షులు తిని చెట్లమీదనే రెట్ట వేయుటచే గింజలు చెట్ల మీదనే మొలచు చున్నవి. అవి పెద్దవై ఊడలు భూమిలో నాటుకొనిన తరువాత అది దేని పై పెరుగెనో ఆ చెట్టు చచ్చి పోవుచున్నది..
ఈ చెట్లను పైరు చేయుటకు వేసవి కాలమందు కాసిన కాయల గింజలు మంచివి. విత్తనములకై కాయలను బాగుచేసి, అవి పాడు కాకుండ బొగ్గు పొడితో కలిపి ఎండ పెట్టుదురు. వర్షాకాలములో కాయలను జిదిపి ఆముక్కలను మళ్ళలో జల్లుదురు. సుమారు మూడు నెలలలో మొలకెత్తును.లేత మొల్కలు రెండు మూడు అంగులముల ఎత్తు పెరుగ గనే వానిని దీసి మరి యొక మడిలో పాతుదురు. అచ్చట రెండు మూడు అడుగుల ఎత్తు పెరుగగనే దీసి చెట్లను పాతవలసిన చోట దూర దూరముగ పాతుదురు. లేత మొలకలకు ఎండ దగులనీయ కుండ కాపాడు చుండవలెను. మళ్ళు మిక్కిలి తేమగా గాని ఎండి పోయి గాని యుండ కూడదు. ఈ చెట్లను కొమ్మలు నాటి కూడా పెంచ వచ్చును. చెట్లకు పదునాలుగు సంవత్సరములు వచ్చి నప్పటికి నుండి రబ్బరుకై వానిని గీయ వచ్చును. చెట్ల మీద ఎనిమిది చోట్ల నేల వాలుగ నాట్లు పెట్టుదురు. ఈ నాట్లు మిక్కిలి లోతుగ నుండ కూడదు. పాలు బెరడునకు దగ్గరగానే యుండును. నాట్లు పెట్టుటకూ మంచి సాధనములు గలవు. ప్రతి నాటు క్రిందను ఒక కుండను కట్టుదురు. పాలు ఈ కుండ లోనికి దిగును. ఒక దినమాకుండ చెట్టు మీదస్నున్న పిదప దానిని దీసి, అందులోని పాలను శుభ్రపరచి కొంచెము పటిక నీళ్ళను చల్లుదురు. పాలు చిక్కబడి రబ్బరగును.
ఈ రబ్బరు చెట్లు విస్తారముగ హిమాలయ పర్వతముల ప్రాంతములను అస్సాము దేశములోని గలవు. రబ్బరుతో బళ్ళ చక్రములు, బంతులు మొదలగు నెన్నియో సాధనములు చేస్తున్నారు. రబ్బరు మనదేఅములో కూడా కొంచెమో గొప్పయో దొరుకు చిండినను దానితో మనకేమి చేయుట్కు చేక కాకున్నది. జువ్వి చెట్టు కూడా చాల పెద్ద చెట్టు. దీని ఆకుల తొడిమలు పొడుగుగానుండును. దీని లోను పాలు గలవు. ఎర్రజువ్వి ఆకుల తొడిమలు పొట్టివి. లేత కొమ్మలు మిక్కిలి నున్నగా నుండును. పిట్ట మర్రి చెట్టును కొండలమీద పెరుగు పెద్ద చెట్టు దీనికిని ఊడలు గలవు. కాని అవి పెద్దవి కావు.
పుత్ర జీవియు కొండలమీద పెరుగును. దీని ఆకులకొన వంకరగను సన్నముగను నున్నది.
తెల్ల భరిణిక చెట్టుకూడ కొండ ప్రదేశములందే పెరుగును. మాను పొట్టి ఆకులు శీతా ఫలపు ఆకుల వలె కొమ్మకు రెండు వైపుల నే యుండును.
గజనిమ్మ చెట్టు. మిక్కిలి పెద్దదిగాదు. దీని పండ్లను తిందురు. మొగ కంకులను కూర వండుకొందురు. ఈ చెట్టులోను పాలు గలవు.
మూలం
[మార్చు]https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:VrukshaSastramu.djvu/429&action=edit[permanent dead link]