పనస బుట్టలు
Jump to navigation
Jump to search
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
పనస బుట్టలు ఉత్తరాంధ్ర వారి ప్రత్యేక వంటకం. వినాయక చవితికి తప్పక వండుతారు. లేత పనసాకులను బుట్టలా కుట్టి అందులో పిండి వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. వీటిని పొట్టిక్కలు అని కూడా అంటారు.[1][2]
కావలసిన పదార్థాలు
[మార్చు]తయారీ విధానం
[మార్చు]పనసాకులు తెచ్చి వాటిని శుభ్రం చేసి నాలుగు ఆకులను కలిపి ఒక బుట్టలా కుడతారు. మూడాకుల తొడిమలు తీసి వేసి, ఆకు కొసలను దగ్గరగా ఒకదాని మీద ఒకటి పెట్టి పుల్లలతో విస్తరి కుట్టినట్టుగా కుడతారు. ఒకాకు తొడిమను మాత్రము ఉంచుతారు. ఆ తొడిమతో బుట్టను పట్టుకుంటారు.[1][3]
మినపపప్పును మూడు గంటలు నానవేసి, మెత్తగా రుబ్బుకోవలి. దానికి ఇడ్లీ రవ్వను కలిపి కొంత సేపు నాననిచ్చి దానికి తగినంత ఉప్పును కలపాలి. ఈ పిండిని ఈ బుట్టలలో వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. లేత పనస రసము అంటిన ఆ బుట్టలు కొబ్బరి పచ్చడి లేక అల్లపు పచ్చడితో గాని తింటారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "పొట్టిక్కలు". andhrajyothy. Retrieved 2021-10-21.
- ↑ "ఆహా ఏమిరుచి: పనసాకు పొట్టిక్క... రుచిలో దిట్టక్క!". ETV Bharat News. Retrieved 2021-10-21.
- ↑ Kashetti, Srikanth. "Here's All You Need To Know About East Godavari's Traditional And Tasty Food "Ambajipeta Pottikkalu"!". Chai Bisket (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-21. Retrieved 2021-10-21.