పన్నా దాయి
పన్నా దాయి, 16వ శతాబ్దానికి చెందిన మహారాజు ఉదయ్ సింగ్ II కు ఆయా. మహారాణా సంగ్రాం సింగ్ నాలుగో కొడుకు ఉదయ్ సింగ్ 1522లో పుట్టిన దగ్గర నుంచీ ఆమె పెంచారు. ఉదయ్ సింగ్ పన్నా పాలు తాగి పెరిగారు. ఆమె కుమారుడు చందన్, ఉదయ్ సింగ్ ఇద్దరూ ఒకే వయసు వారు. వారిద్దరూ కలిసి పెరిగారు. సంగ్రాం సింగ్ మరణించిన తరువాత, ఉదయ్ సింగ్ బంధువు అయిన భన్వీర్ రాజ్యం కోసం ఉదయ్ ను చంపడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పన్నా ఉదయ్ ను కాపాడుకునేందుకు, అతని బదులుగా తన కొడుకు చందన్ ను భన్వర్ కు ఇచ్చారు. అలా ఉదయ్ సింగ్ ను బతికించేందుకు తన కొడుకును త్యాగం చేశారు ఆమె.
జీవిత చిత్రణ
[మార్చు]ఆమె ముందు జీవితం గురించి పెద్దగా ఆధారాలు అందుబాటులోకి లేవు. కానీ ఆమె నాయిబ్రాహ్మణ కులానికి చెందినవారని చెప్పుకుంటారు. మహారాణా సంగ్రాం సింగ్ భార్య రాణీ కర్ణవతికి చెలికత్తె పన్నా. రాజకీయ వ్యవహారాల్లో కూడా పనా కర్ణవతికి సలహాలూ, సూచనలు ఇచ్చేవారు. పన్నా అంటే రాణి కర్ణవతికి ఎంతో నమ్మకం. అందుకే తన ఇద్దరు కుమారులు విక్రమాదిత్య సింగ్, ఉదయ్ సింగ్ ల పాలనా బాధ్యత పూర్తిగా పన్నాకు అప్పగించారు ఆమె.[1]
విక్రమాదిత్య సింగ్ పట్టాభిషేకం
[మార్చు]16వ శతాబ్దాంలోని రెండు, మూడు దశాబ్దాలు మేవాడ్ రాజ్యంలో అతి కష్టంగా గడిచాయని చెప్పుకోవచ్చు. ఎన్నో సంఘటనలు అతి వేగంగా జరిగిపోయాయి ఈ కాలంలో. 1527లో మొఘల్ చక్రవర్తి బాబర్ తో జరిగిన ఖన్వా యుద్ధంలో మహారాణా సంగ్రాం సింగ్ గాయాల పాలయ్యారు. ఆ గాయల వల్లనే మరణించారు. సంగ్రాం సింగ్ పెద్ద కుమారుడు భోజ రాజ్ 1521లో జరిగిన ఒక యుద్ధంలో మరణించారు. సంగ్రాం సింగ్ బతికి ఉన్న రోజుల్లోనే అతని ముగ్గురు కొడుకులూ మరణించారు. సంగ్రాంగ్ సింగ్ తరువాత అతని కొడుకు మహారాణా రతన్ సింగ్ II అధికారంలోకి వచ్చారు. అతను 1527 నుంచి 1531 వరకు నాలుగేళ్ళు పరిపాలించి, చనిపోయారు. ఆ తరువాత అతని తమ్ముడు విక్రమాదిత్య సింగ్ 14 ఏళ్ళ వయసులో పట్టాభిషిక్తుడయ్యారు. విక్రమాదిత్యకు పెంకితనం, అహంకారం బాగా ఎక్కువ. అతని ఆస్థానంలోని కొందరు ప్రముఖులు అతని ప్రవర్తన నచ్చక రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. విక్రమాదిత్య అధికారంలో ఉండగా ఆ దేశంలోకి రామని ప్రతిజ్ఞలు చేసినవారూ ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "A Great Sacrifice: Story of Panna Dhai". Archived from the original on 2016-03-15. Retrieved 2016-11-28.