Jump to content

పరమేశ్వర్ హివ్రాలే

వికీపీడియా నుండి
Parameshwar Hivrale
పరమేశ్వర్ హివ్రాలే
స్థానిక పేరుపరమేశ్వర్ హివ్రాలే
జననం(1991-06-28)1991 జూన్ 28
కామారెడ్డి
నివాస ప్రాంతంకామారెడ్డి: గ్రామము
మండలం: కామారెడ్డి
జిల్లా:కామారెడ్డి
తెలంగాణ రాష్ట్రం  India ఇండియా
విద్యBtech
భార్య / భర్తశిరీష
పిల్లలుఈశ్వర్, శివాన్ష్
తల్లిదండ్రులుభుజంగ రావు పాటిల్, లక్ష్మీ బాయి

పరమేశ్వర్ హివ్రాలే (Parameshwar Hivrale) (జననం 1991 జూన్ 28) భారతీయ నటుడు, దర్శకుడు[1][2].[3][4][5]

జననం, విద్య

[మార్చు]

పరమేశ్వర్ హివ్రాలే  1991 జూన్ 28 (వయస్సు 29 ) కామారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన స్దలం, తన విద్యాభ్యాసం సాందీపని జూనియర్ కాలేజీ, విజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ & సైన్సెస్ బి.టెక్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి పూణేలో నుండి దర్శకత్వం, నటన, స్క్రిప్ట్ రైటింగ్‌లో తన కోర్సును పూర్తి చేశాడు.[6]

కుటుంబం

[మార్చు]

పరమేశ్వర్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు, అతని తండ్రి భుజంగ రావు పాటిల్ హివ్రాలే లారీ డ్రైవర్, తల్లి లక్ష్మీ బాయి హివ్రాలే గృహిణి, వారి జీవితంలో చాలా కష్టమైన సమయాలను ఎదుర్కొన్నారు . పరమేశ్వర్ తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరికొకరు మద్దతుగా ఉండి వారి ముగ్గురు పిల్లల కోసం కష్టపడ్డారు. వారికి మంచి విద్యను అందించారు. భుజంగ రావు, లక్ష్మీబాయిలకు పరమేశ్వర్ హివ్రాలే రెండవ సంతానం, రామేశ్వర్ రావ్ పాటిల్ హివ్రాలే మొదటి సంతానం, సాయినాధ్ రావ్ పాటిల్ హివ్రాలే ఆఖరి సంతానం. పరమేశ్వర్ గారి అన్న రామేశ్వర్ రావ్ పాటిల్ హివ్రాలే, అతని చదువు పూర్తయిన తర్వాత ప్రైవేట్ ఉద్యోగంలో ఉండి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పరమేశ్వర్ 2018లో శిరీషను వివాహం చేసుకున్నారు, వీరికి ఈశ్వర్, శివాన్ష్ అనే ఇద్దరు మగపిల్లలు జన్మించారు. సినిమాల పట్ల పరమేశ్వర్‌కు ఉన్న ఆసక్తిని చూసిన అతని కుటుంబసభ్యులకు అతని కెరీర్‌ని నిర్మించుకోవడానికి ప్రోత్సహించారు.[7]

సినిమా జీవితం

[మార్చు]

పరిశ్రమలోని ఏ వ్యక్తి నుండి ఎటువంటి మద్దతు లేకపోయినా అతను తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. అతని అభిరుచి దర్శకత్వం అయినప్పటికీ, అతను తన మనుగడ, ఆర్థిక అవసరాల కోసం నటనను తీసుకోవలసి వచ్చింది. అందుకే అతను చిరు గొడవలు (2015) కుమారి 18+, లావణ్య విత్ లవ్‌బాయ్స్, జాతీయ రహదారి, దారి వంటి సినిమాల్లో నటించాడు.[6][8] "గుమ్మడి నర్సయ్య" సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేయనున్నాడు.[3][9][10]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Parameshwar Hivrale's directorial leap". The New Indian Express. Retrieved 2022-04-22.
  2. Team, CelPox (2021-09-03). "Parameshwar Hivrale: Movies, Age, Photos, Family, Wife, Height, Birthday, Biography, Facts, Filmography, Upcoming Movies, TV, OTT, Social Media, Facebook, Instagram, Twitter, WhatsApp, Google YouTube & More » Celpox". CelPox (in ఇంగ్లీష్). Retrieved 2022-01-25.
  3. 3.0 3.1 A, Rajababu (2021-11-15). "Gummadi Narasaiah Biopic: నిష్కళంక నేత గొంతు మూగబోతే.. ఎంత నష్టమో.. ఆ కథే చెప్పబోతున్నాం.. దర్శకుడు పరమేశ్". telugu.filmibeat.com. Retrieved 2022-01-25.
  4. "Parameshwar Hivrale on his directorial debut Gummadi Narsaiah". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2022-04-22.
  5. "Linked PDF of Table of Contents". Synthesis. 54 (04): V. 2022-01-31. doi:10.1055/s-0041-1737535. ISSN 0039-7881.
  6. 6.0 6.1 Telanganatoday (2022-04-20). "Biopic on five time Yellandu MLA Gummadi Narsaiah soon". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-22.
  7. Hymavathi, Ravali (2022-04-20). "Director Parameshwar Hivrale: Gummadi Narasaiah's Simplicity And His Zeal To Work For The People Inspired Me". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-22.
  8. "సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ 'దారి' కాన్సెప్ట్ పోస్టర్ విడుదల". Sakshi. 2022-02-08. Retrieved 2022-04-22.
  9. Vardhan, Harsha (2021-07-31). "Star Director Sukumar launched the logo of Gummadi Narsaiah Biopic". Social News XYZ (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-25.
  10. Satyanarayana, P. V. (2021-09-26). "Biopic on tribal MLA Gummadi Narasaiah". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-25.