Jump to content

పరస

వికీపీడియా నుండి

పరస , పల్నాడు జిల్లా, పెదకూరపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ప్రసిధ్ద పుణ్యక్షేత్రం అమరావతికి 10కి.మీ దూరంలో ఉంది. చుట్టూ తాడిచెట్లతో, పచ్చని పొలాలతో అలరారే ఈ గ్రామం గతంలో తెలుగుదేశం పార్టీకి పెట్టనికోట. జనాభా కేవలం 800 మాత్రమే, కానీ పరసకి పెదకూరపాడు నియోజకవర్గ స్దాయిలో పేరుంది. గ్రామం నుంచి నూతలపాటి వెంకటశివరావు( తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి), అమరనేని కోటేశ్వరరావు (కోటయ్య) (కాంగ్రెస్ నాయకులు) జిల్లాస్ఢాయిలో గుర్తింపు పొందారు.

ప్రముఖ టీవి ప్రయోక్త ఓంకార్ ఈ గ్రామానికి చెందినవాడు. ఈ గ్రామ పూర్వ సర్పంచిగా పనిచేసిన సరిపూడి కోటయ్య (1920-1990) గ్రామాభివృద్దిలో తనవంతు పాత్ర పోషించాడు. కోటయ్య హయాంలోనే గ్రామానికి విద్యుదీకరణ జరిగింది. తరువాత సర్పంచిగా చేసిన వెంకటశివరావు జిల్లాస్ధాయిలో తనకున్న విస్త్రుతపరిచయాలను ఉపయోగించి గ్రామానికి త్రాగునీరు, సిమెంట్ రోడ్లు మంజూరు చేయించాడు. రిజర్వేషన్లలో భాగంగా 2001లో జరిగిన ఏకగ్రీవ ఎన్నికల్లో దళితమహిళ కొండవీటి మేరమ్మ సర్పంచిగా, నూతలపాటి అరుణ, రాములు తదితర మహిళలు వార్డు సభ్యులుగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ప్రశంసలు కూడా పొందారు. ప్రస్తుత సర్పంచిగా నంబూరి నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఏన్నికయ్యాడు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • నర్రా వెంకయ్య చౌదరి - కవి
  • సరిపూడి వెంకటకృష్ణయ్య (1900-1977) - మాజీ మునసబు
  • సరిపూడి కోటయ్య (1920 - 1990) - మాజీ సర్పంచి
  • నూతలపాటి వెంకటకృష్ణారావు - వైద్యులు
  • ఓంకార్ - ప్రముఖ టీవి యాంకర్ (జెమిని, ఆదిత్య, జీ తెలుగు)

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పరస&oldid=3580796" నుండి వెలికితీశారు