పరాశర భట్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరాశర భట్టర్ (సా. శ 1122-1174)[1] 12వ శతాబ్దానికి చెందిన రామానుజాచార్యునకు అనుచరుడు, నాటి ప్రముఖ శ్రీవైష్ణవాచార్యుడు.[2] శ్రీరంగనాథుడి భక్తుడు. 12వ శతాబ్దాంతమున జన్మించిన ఈయన విష్ణు సహస్రనామ స్తోత్రమునకు, ఆదిశంకరులు రచించిన అద్వైత వ్యాఖ్యానమునకు భిన్నంగా, శ్రీవైష్ణవ తత్వానుగుణంగా వ్యాఖ్యానమును రచించాడు. రామానుజాచార్యుడు ఈయనను శ్రీవైష్ణవమునకు తమ ఉత్తరాధికారి నియమించారు.

జీవిత విశేషాలు[మార్చు]

పరాశర భట్టరు కూరేశ (కూరత్తాళ్వార్) తనయుడు. ఈయన పూర్వనామం రంగనాథన్.[1] గోవింద మిశ్రుల శిష్యుడు. ఈయన మేలుకోటె కు చెందిన మాధవ దాసు (నంజియ్యర్) అను పండితుని వాదమందు ఓడించి తన శిష్యునిగా చేసుకుని వారసునిగా ప్రకటించాడు.[2]

రచనలు[మార్చు]

  • శ్రీరంగరాజస్తవం
  • కైశికి పురాణం
  • భాగవత గుణదర్పణం (విష్ణు సహస్ర నామ వ్యాఖ్యానం)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 P. V, Sivarama Dikshitar (19 February 2002). "Devotional hymn". The Hindu. The Hindu. Retrieved 24 December 2018. CS1 maint: discouraged parameter (link)
  2. 2.0 2.1 మొవ్వ, శ్రీనివాస పెరుమాళ్ళు. ఆచార్య పురుషుల చరిత్ర. తిరుమల తిరుపతి దేవస్థానములు. p. 16. Archived from the original on 2019-01-11. Retrieved 2018-12-24.

బయటి లింకులు[మార్చు]