పరాశర భట్టర్

వికీపీడియా నుండి
(పరాసర భట్టర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పరాశర భట్టర్ (సా. శ 1122-1174)[1] 12వ శతాబ్దానికి చెందిన రామానుజాచార్యునకు అనుచరుడు, నాటి ప్రముఖ శ్రీవైష్ణవాచార్యుడు.[2] శ్రీరంగనాథుడి భక్తుడు. 12వ శతాబ్దాంతమున జన్మించిన ఈయన విష్ణు సహస్రనామ స్తోత్రమునకు, ఆదిశంకరులు రచించిన అద్వైత వ్యాఖ్యానమునకు భిన్నంగా, శ్రీవైష్ణవ తత్వానుగుణంగా వ్యాఖ్యానమును రచించాడు. రామానుజాచార్యుడు ఈయనను శ్రీవైష్ణవమునకు తమ ఉత్తరాధికారి నియమించారు.

జీవిత విశేషాలు[మార్చు]

పరాశర భట్టరు కూరేశ (కూరత్తాళ్వార్) తనయుడు. ఈయన పూర్వనామం రంగనాథన్.[1] గోవింద మిశ్రుల శిష్యుడు. ఈయన మేలుకోటె కు చెందిన మాధవ దాసు (నంజియ్యర్) అను పండితుని వాదమందు ఓడించి తన శిష్యునిగా చేసుకుని వారసునిగా ప్రకటించాడు.[2]

రచనలు[మార్చు]

  • శ్రీరంగరాజస్తవం
  • కైశికి పురాణం
  • భాగవత గుణదర్పణం (విష్ణు సహస్ర నామ వ్యాఖ్యానం)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 P. V, Sivarama Dikshitar (19 February 2002). "Devotional hymn". The Hindu. The Hindu. Retrieved 24 December 2018.
  2. 2.0 2.1 మొవ్వ, శ్రీనివాస పెరుమాళ్ళు. ఆచార్య పురుషుల చరిత్ర. తిరుమల తిరుపతి దేవస్థానములు. p. 16. మూలం నుండి 2019-01-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2018-12-24.

బయటి లింకులు[మార్చు]