పర్వత సత్యనారాయణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్వత సత్యనారాయణమూర్తి (చిట్టిబాబు)

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 - 2014
ముందు వరుపుల సుబ్బారావు
తరువాత వరుపుల సుబ్బారావు
నియోజకవర్గం ప్రత్తిపాడు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1957
శంఖవరం, శంఖవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 2016 మార్చి 13
కాకినాడ
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు పర్వత రామమూర్తి, సీతారత్నం
జీవిత భాగస్వామి అన్నపూర్ణ
బంధువులు పర్వత సుబ్బారావు, పర్వత బాపనమ్మ
సంతానం కనకదుర్గ, రాజేష్
వృత్తి రాజకీయ నాయకుడు

పర్వత సత్యనారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పర్వత సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు పై 3286 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు చేతిలో 3413 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. పర్వత సత్యనారాయణమూర్తి అనంతరం తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

మరణం

[మార్చు]

పర్వత సత్యనారాయణమూర్తి 2016 మార్చి 13న గుండెపోటు రావడంతో ఆయనను కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్సనందిస్తుండగానే ఆయన మరణించాడు.ఆయనకు భార్య అన్నపూర్ణ, కుమారై కనకదుర్గ, కుమారుడు రాజేష్ ఉన్నారు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (14 March 2016). "శంఖవరంలో విషాదం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  2. Deccan Chronicle (13 March 2016). "Former TDP MLA Parvatha Sri Satyanarayana Murthy passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  3. Andhra Jyothy (14 March 2016). "టీడీపీ తూర్పు అధ్యక్షుడు పర్వత హఠాన్మరణం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.