పలమనేరు బాలాజీ
స్వరూపం
పలమనేరు బాలాజీ | |
---|---|
జననం | పలమనేరు, చిత్తూరు జిల్లా |
వృత్తి | రచయిత |
పలమనేరు బాలాజీ చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత.[1] చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్యకు కన్వీనరుగా వ్యవహరించాడు.[2] ఈయన కవితలు ద్రవిడ విశ్వవిద్యాలయం ద్వారా పలు భాషల్లోకి అనువాదమయ్యాయి. కథ, కవిత, నవల, విమర్శ రంగాల్లో చేసిన సేవకు గాను కేంద్ర సాహిత్య అకాడెమీ ఆయనను శాంతి నికేతన్ సందర్శనకు ఆహ్వానించారు. అనేక విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలపై పరిశోధనలు సాగుతున్నాయి. తెలుగు భాషా ప్రతినిథిగా ఆయన పలు అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన్నాడు.
పురస్కారాలు
[మార్చు]- మాటల్లేని వేళ కవిత్వానికి గాను స్మైల్ పురస్కారం
- ఇద్దరి మధ్య కవిత్వానికి నూతలపాటి పురస్కారం
- నేల నవ్వింది నవలకు గాను కందుకూరి వీరేశలింగం స్మారక పురస్కారం
- 2015లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2012 (గదిలోపలి గోడ పుస్తకానికి)[3]
మూలాలు
[మార్చు]- ↑ "పలమనేరు బాలాజీకి తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం". prajasakti.com. ప్రజాశక్తి. Retrieved 21 August 2017.[permanent dead link]
- ↑ "Chittoor as the fountain head of substantive literature". thehindu.com. ది హిందూ. Retrieved 21 August 2017.
- ↑ నవ తెలంగాణ, స్టోరి (16 June 2015). "ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". NavaTelangana. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.