Jump to content

పల్లవి ప్రశాంత్

వికీపీడియా నుండి

పల్లవి ప్రశాంత్, ఇతను ఒక సామాన్య రైతు బిడ్డ. ఇతను స్వగ్రామం తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం, కొల్గూర్ గ్రామం. ఇతను తండ్రి గొడుగు సత్యనారాయణ, తల్లి విజయమ్మ.[1] అయితే ఇతను గజ్వేల్ మండలం, ప్రజ్ఞాపూర్ గ్రామంలో 1995 మే 1న జన్మించాడు.[2] గ్రాడ్వేయేషన్ పూర్తి చేసాడు. చదువు పూర్తిచేసిన తరువాత ఇతను ఒక వైపు తండ్రికి వ్యవసాయపనులలో తోడ్పాటు అందిస్తూ, హాబీగా యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు ఎక్కించటం చేసేవాడు. ఆరకంగా సోషల్ మీడియాలో ఒక రకంగా గుర్తింపు పొందాడు. అతనికి ఎప్పటికైనా బిగ్‌బాస్‌లో పాల్గొనాలనే ఆసక్తి బలీయంగా ఉండేది.ఆ కోరికే అతను బిగ్‌బాస్ సీజన్ 7 లో పాల్గొనటానికి వేదిక అయింది.

సెలబ్రిటీగా గుర్తింపు

[మార్చు]

పల్లవి ప్రశాంత్, ఇతను ఉల్టా - పుల్టా అంటూ 2023 సెప్టెంబరు 3న ప్రారంభమై 105 రోజులు సాగిన బిగ్‌బాస్ సీజన్ 7 విజేతగా గుర్తింపు పొందాడు. 'రైతు బిడ్డ'గా పిలవబడే పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ తెలుగు 7 విజేతగా గెలుపొంది 35 లక్షల బహుమతిని గెలుచుకున్నాడు.[3] బిగ్‌బాస్ 7కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేసిన గ్రాండ్ ఫినాలే పల్లవి ప్రశాంత్, మరో ఐదుగురు ఫైనలిస్టుల మధ్య తీవ్రమైన యుద్ధాన్ని ప్రదర్శించింది. అమర్‌దీప్ చౌదరి, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, శివాజీ, ప్రిన్స్ యావన్. ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు విద్యుద్దీకరించే ఆహ్లాదకరమైన నృత్య ప్రదర్శనలు చేసారు. నటుడు రవితేజ హాజరై ముగింపుకు గ్లామర్ జోడించాడు.

అదనపు బహుమతులు

[మార్చు]

ప్రేక్షకులనుండి పల్లవి ప్రశాంత్ అత్యధిక ఓట్లు సాధించి బిగ్‌బాస్ సీజన్ 7 విజేతగా నిలిచినట్లు అక్కినేని నాగార్జున ప్రకటించిన కార్యక్రమంలో అందుకున్న 35 లక్షల పారితోషికంతోపాటు జోయాలుక్కాస్ వారు 15 లక్షలు విలువైన డైమండ్ జ్యూయలరీ అందుకున్నాడు.[4][5] ఇంకా మారుతీ సుజీకీ కంపెనీవారు వితారా బ్రెజా కారును బహుకరించారు.[6]

ప్రశాంత్ అరెస్ట్ ఘటన

[మార్చు]

పల్లవి ప్రశాంత్‌ను 2023 డిసెంబరు 20న గజ్వేల్‌లోని స్వగ్రామం కొల్గూరులో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఫైనల్స్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడిఘటనలో న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు మహా వీరేశంలను చంచల్‌గూడా జైలుకు తరలించారు.[7][8]

టైటిల్‌ విజేతగా నిలిచిన ప్రశాంత్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి బయటికి వస్తాడని తెలిసి, ప్రశాంత్ అభిమానులు అతనికి స్వాగతం పలకటానికి భారీగా చేరుకున్నారు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ సైతం బయటకు రాగా, ఇరువురి అభిమానుల మధ్య అనుకోకుండా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అందులోని కొందరు ఆకతాయులు అమర్‌దీప్‌ కారుపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు. మరో పోటీదారు అశ్వని కారు అద్దాలను పగులగొట్టారు. అదే సమయంలో అటువైపు ప్రయాణిస్తున్న 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దం, విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్‌ బస్సు అద్దం ధ్వసం చేసారు. దీనిపై పోలీసులు ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా ప్రశాంత్‌, ఏ2గా మనోహర్‌, ఏ3గా అతడి స్నేహిడుతు వినయ్‌ను చేర్చారు. ఇప్పటికే ఏ4గా ఉప్పల్‌కు చెందిన సాయికిరణ్‌, అంకిరావుపల్లి రాజును అరెస్ట్‌ చేసిన పోలీసులు తాజాగా ప్రశాంత్‌, మనోహర్‌తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.[9][10]

మూలాలు

[మార్చు]
  1. https://web.archive.org/web/20231221071058/https://www.sakshi.com/telugu-news/crime/bigg-boss-season7-winner-pallavi-prashant-arrested-1890121
  2. "Who is pallavi prashanth age biography Family Village bb7". web.archive.org. 2023-12-21. Archived from the original on 2023-12-21. Retrieved 2023-12-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Bigg Boss Telugu 7 Winner: Pallavi Prashanth emerges as the winner of the Nagarjuna hosted show - Times of India". web.archive.org. 2023-12-18. Archived from the original on 2023-12-18. Retrieved 2023-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Pallavi Prashanth: బిగ్‌బాస్‌ సీజన్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌.. రూ.35 లక్షలతో పాటు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్ సొంతం | bigg boss 7 telugu winner pallavi prashanth". web.archive.org. 2023-12-18. Archived from the original on 2023-12-18. Retrieved 2023-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. 10TV Telugu (18 December 2023). "బిగ్‌బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్.. ప్రైజ్ మనీ ఎంత? ఇంకేమేమి గెలుచుకున్నాడు?" (in Telugu). Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. "Pallavi Prashanth: బిగ్‌బాస్‌ సీజన్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌.. రూ.35 లక్షలతో పాటు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్ సొంతం | bigg boss 7 telugu winner pallavi prashanth". web.archive.org. 2023-12-21. Archived from the original on 2023-12-21. Retrieved 2023-12-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. Eenadu (21 December 2023). "బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్‌". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  8. Sakshi (20 December 2023). "బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్!". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  9. "Pallavi Prashanth | చంచల్‌గూడ జైలుకు పల్లవి ప్రశాంత్‌.. బిగ్‌బాస్‌-7 విజేతకు 14 రోజుల రిమాండ్-Namasthe Telangana". web.archive.org. 2023-12-21. Archived from the original on 2023-12-21. Retrieved 2023-12-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. "చంచల్ గూడ జైలుకు బిగ్‌బాస్‌ సీజన్‌–7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌". web.archive.org. 2023-12-21. Archived from the original on 2023-12-21. Retrieved 2023-12-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)