పాకాల్ దుల్ ఆనకట్ట
పాకల్ దుల్ ఆనకట్ట జమ్మూ కాశ్మీర్, కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదికి ఉపనది అయిన మరుసుదార్ నదిపై నిర్మాణంలో ఉన్న కాంక్రీట్-ఫేస్ రాక్-ఫిల్ డ్యామ్. ఆనకట్ట ప్రధాన ప్రయోజనం విద్యుదుత్పత్తి. ఇది 10 కి.మీ. (6.2 మై.) పొడవైన హెడ్‌రేస్ టన్నెల్ ద్వారా నీటిని దక్షిణానికి మళ్లించి, చీనాబ్ నదిపై ఉన్న దుల్ హస్తి డ్యామ్ జలాశయంపై ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రానికి పంపుతుంది.[1] 2014 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టును దేశీయ, విదేశీ సంస్థల కన్సార్టియంకు ఇచ్చారు. ఇందులో AFCONS, JP అసోసియేట్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఉన్నాయి.[2] చీనాబ్ నదికి దిగువన ఉన్న పాకిస్తాన్, పాకాల్ దుల్ ఆనకట్ట సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపిస్తుంది.[3] అయితే ఇది ఒప్పంద నిబంధనలకు లోబడే ఉందని భారతదేశం పేర్కొంది. భారత వ్యాఖ్యాత హర్షిల్ మెహతా - కిరు, రాట్లే, ఉజ్ బహుళార్ధసాధక ప్రాజెక్టుల లాగానే ఈ ప్రాజెక్టుకు కూడా జలవిద్యుదుత్పత్తి మాత్రమే కాకుండా వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఉందని రాశాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Pakal Dul H E Project". Chenab Valley Power Projects. Archived from the original on 28 జూలై 2012. Retrieved 22 May 2014.
- ↑ "Patel Engineering consortium lowest bidder for 1,000 MW hydel project". Economic Times of India. 7 February 2014. Archived from the original on 15 ఫిబ్రవరి 2014. Retrieved 22 May 2014.
- ↑ "Pakistan sees Indus Water Treaty violations in proposed Pakal Dul hydroelectric plant". HydroWorld. 22 January 2013. Retrieved 22 May 2014.
- ↑ Mehta, Harshil (2022-06-04). "India is All Set to Harness Hydropower With Eye on the China-Pakistan Axis". News18 (in ఇంగ్లీష్). Retrieved 2022-11-28.