పాగాల సంపత్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాగాల సంపత్ రెడ్డి

పదవీ కాలం
2019 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1975
రాజవరం గ్రామం, చిల్పూర్ మండలం, జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 2023 డిసెంబర్ 4
తెలంగాణ హైదరాబాద్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు జయపాల్‌రెడ్డి, సుకన్య
జీవిత భాగస్వామి సుజాత
సంతానం సంజనారెడ్డి
వృత్తి రాజకీయ నాయకుడు

పాగాల సంపత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం జనగామ జిల్లా ప్రజా పరిషత్‌ ఛైర్మన్‌గా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పాగాల సంపత్‌రెడ్డి 1975లో తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, చిల్పూర్ మండలం, రాజవరం గ్రామంలో జయపాల్‌రెడ్డి, సుకన్య దంపతులకు జన్మించాడు. ఆయన హన్మకొండలో ఐటీఐ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

పాగాల సంపత్‌రెడ్డి ఐటీఐ పూర్తి చేశాక హైదరాబాద్‌లో ఓ కాంట్రాక్టర్‌ దగ్గర కొంతకాలం పని చేశాడు. ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలోనే కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలందరూ ఉద్యమంలో చేరాలని కేసీఆర్‌ పిలుపునివ్వడంతో కరీంనగర్‌లో జరిగిన జైత్రయాత్ర సభకు పాల్గొన్నాడు. ఆయన 2002 నుండి 2006 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన విభాగం ప్రచార ప్రధాన కార్యదర్శిగా, 2006 నుండి 2013 వరకు స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల అధ్యక్షుడిగా, 2013 నుండి 2015 వరకు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పని చేశాడు. ఆయనపై తెలంగాణ ఉద్యమ సమయంలో 28 కేసులు నమోదయ్యాయి.

పాగాల సంపత్‌రెడ్డి రైతు సమన్వయ సమితి నియోజకవర్గ కో కన్వీనర్‌గా పని చేస్తున్న సమయంలో 2019లో జరిగిన జిల్లా ప్రజా పరిషత్‌ ఎన్నికల్లో చిల్పూర్‌ మండలం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై 7644 ఓట్ల మెజారిటీతో గెలిచి, 2019 జూన్ 8న జిల్లా ప్రజా పరిషత్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[3] ఆయన 26 జనవరి 2022న జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (8 June 2019). "తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  2. Sakshi (7 July 2019). "నా హీరో.. నా దైవం కేసీఆర్‌". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  3. HMTV (8 June 2019). "తెలంగాణాలో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌/ ఛైర్మన్లుగా ఎన్నికైంది వీళ్లే." Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  4. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
  5. Andhra Jyothy (28 January 2022). "సీఎం కేసీఆర్‌ను కలిసిన పాగాల". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.