పాతాళేశ్వర మందిరం
పాతాళేశ్వర మందిరం | |
---|---|
బీహార్లో దేవాలయ స్థానం | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 25°40′N 85°13′E / 25.667°N 85.217°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | వైశాలి జిల్లా |
ప్రదేశం | జాధువా రోడ్, హాజీపూర్ |
సంస్కృతి | |
దైవం | శివుడు |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | భారతీయ |
పాతాళేశ్వర మందిరం భారతదేశంలోని బీహార్‌లోని హాజీపూర్ నగరంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. శివుడికి అంకితం చేయబడిన ఈ దేవాలయం హాజీపూర్‌లోని జాధువా రోడ్‌లో ఉంది.[1]
ప్రధాన దైవం
[మార్చు]శివుడి ప్రతిరుపమైన శివలింగం ఇక్కడ స్వయంభువుగా వెలిసింది. లింగ రూపంలోనే ఇక్కడి దైవాన్ని ప్రజలు ఆరాధిస్తారు.[2]
పండుగలు
[మార్చు]ఆలయ ప్రధాన దైవం 'శివుడు'. ఇక్కడ శివరాత్రిని ఘనంగా జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం శివుని గౌరవార్థం జరుపుకునే హిందూ పండుగ. 'హేరత్', 'హరరాత్రి', 'శివరాత్రి, మహాశివరాత్రి అనేవి ఈ పండుగకు ఉన్న ఇతర పేర్లు. శివుడు లింగ రూపం దాల్చిన రాత్రిని శివరాత్రి పండుగగా జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్‌లోని మాఘ లేదా ఫాల్గుణ మాసం 13వ/14వ రోజు జరుపుకుంటారు. భారతదేశంలోని వివిధ జాతి-భాషా సమూహాలు అనేక విభిన్న క్యాలెండర్‌లను అనుసరిస్తున్నందున, మాసం, తిథి పేరు భారతదేశం అంతటా ఒకే విధంగా లేవు. విక్రమ శకం ప్రకారం శాలివాహన లేదా గుజరాతీ విక్రమ లేదా ఫాల్గుణ ప్రకారం మాఘ మాసంలోని కృష్ణ పక్షం లో జరుపుకుంటారు.[3]
పాతాళేశ్వర మందిరం ప్రాముఖ్యత
[మార్చు]ఇక్కడి శివలింగం స్వయంభువుగా వెలిసింది. అంటే లింగం దానంతటదే మట్టిలోంచి బయటకు వచ్చింది. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఇక్కడ ఘనంగా వేడుకలు జరుగుతాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ nativeplanet.com
- ↑ "Spoken Sanskrit Dictionary". Archived from the original on 17 August 2017. Retrieved 1 May 2020.
- ↑ Hinduism: Beliefs and Practices, by Jeanne Fowler, pgs. 42–43, at Books.Google.com
- ↑ A Practical Sanskrit Dictionary