పాత కడప
Appearance
పాతకడప | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°29′59″N 78°50′14″E / 14.499635139495194°N 78.8372022715985°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | కడప |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516001 |
ఎస్.టి.డి కోడ్ |
పాత కడప, 2004కు ముందు వైఎస్‌ఆర్ జిల్లా, కడప మండలానికి చెందిన రెవెన్యూ గ్రామంగా ఉండేది. కడప పురపాలక సంఘం పరిధిని విస్తరించి నగరపాలక సంస్థగా ఏర్పరచినప్పుడు కలిపేసిన గ్రామాల్లో పాత కడప ఒకటి.
పాత కడప పరిధిలోని రెవెన్యూయేతర గ్రామాల్లో "దేవుని కడప" ఒకటి. ఇక్కడ పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ తిరుమల వెళ్ళేందుకు మొక్కు ఉన్న భక్తులు ఈ ఊరు వచ్చి మొదట ఈ లక్ష్మీ వెంకటేశ్వరస్వామిని దర్శించిన తరువాత తిరుమల వెళ్ళడం చేస్తారు. ఈ స్వామిని కృపాచార్యుడు ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణంలో తెలుస్తుంది.ఈ స్వామి వెనుకగా క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి విగ్రహం ఉంది.