Jump to content

పానన్‌మల్ పంజాబీ

వికీపీడియా నుండి
పానన్‌మల్ పంజాబీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పానన్‌మల్ హోత్‌చంద్ పంజాబీ
పుట్టిన తేదీ(1921-09-20)1921 సెప్టెంబరు 20
కరాచీ, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2011 అక్టోబరు 4(2011-10-04) (వయసు 90)
ముంబై
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 71)1955 జనవరి 1 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు1955 ఫిబ్రవరి 26 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 5 32
చేసిన పరుగులు 164 1,953
బ్యాటింగు సగటు 16.40 38.29
100లు/50లు 0/0 6/5
అత్యధిక స్కోరు 33 224*
వేసిన బంతులు 132
వికెట్లు 2
బౌలింగు సగటు 50.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/10
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 16/–
మూలం: CricInfo, 2022 నవంబరు 20

పనన్మల్ హాట్‌చంద్ పంజాబీ (1921 సెప్టెంబరు 20 – 2011 అక్టోబరు 4) [1] 1955 లో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారతీయ క్రికెటరు.

పంజాబీ కుడిచేతి వాటపు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. సుదీర్ఘమైనదే గానీ, మధ్య మధ్య అంతరాయాలతో కూడిన ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్‌ అతనిది. విభజనకు ముందు సింద్‌కు రెండు మ్యాచ్‌లూ ఆడ్దంతో మొదలుపెట్టి, 1951 నుండి గుజరాత్‌కు మరింత క్రమంగా ఆడాడు. 1953-54 సీజన్‌లో, అతను మూడు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు సాధించాడు. తరువాతి సీజన్‌లో, 1954-55లో పాకిస్తాన్ పర్యటనకు ఎంపికయ్యాడు. అతను పంకజ్ రాయ్‌తో కలిసి మొత్తం ఐదు టెస్టుల్లో బ్యాటింగ్ ప్రారంభించి, 164 పరుగులు చేశాడు. ఇది జట్టులో నాల్గవ అత్యధిక స్కోరు. కానీ సిరీస్‌లో అతని అత్యధిక స్కోరు 33 మాత్రమే. ఎక్కువగా డిఫెన్సివుగా ఆడిన ఆ సీరీస్‌లో అన్ని టెస్ట్‌లూ డ్రా అయ్యాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి.

అతను 1959-60 వరకు భారత దేశీయ క్రికెట్‌లో ఆడాడు. అతని చివరి ఆటలో అతని అత్యధిక స్కోరు, అజేయంగా 224 పరుగులు చేశాడు. కానీ మళ్లీ టెస్టు క్రికెట్‌కు ఎంపిక కాలేదు. పేరులో పంజాబీ ఉన్నప్పటికీ, అతను కరాచీ కి చెందినవాడు, సింధీ మాట్లాడేవాడు. అతని ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఎక్కువ భాగం గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. బర్మా షెల్‌లో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం చేసాడు. [2]

పంజాబీ 2011లో మరణించాడు. అయితే అతని మరణం గురించి క్రికెట్ వర్గాల్లో [3] 2014 వరకూ తెలియలేదు.

మూలాలు

[మార్చు]
  1. "Pananmal Punjabi". www.cricketarchive.com. Retrieved 2011-09-23.
  2. Richard Cashman, Patrons, Players and the Crowd., Orient Longman (1980)
  3. Deepak Shodhan, not Pananmal Punjabi is the oldest living Indian Test cricketer, Cricketcountry, 25 May 2014