పాప్‌కార్న్
పాప్‌కార్న్ | |
---|---|
దర్శకత్వం | మురళి గంధం |
రచన | మురళి గంధం |
నిర్మాత | భోగేంద్ర ప్రసాద్ గుప్తా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎం.ఎన్. బాల్ రెడ్డి |
సంగీతం | శ్రవణ్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థలు | ఆచార్య క్రియేషన్స్ అవికా స్క్రీన్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 10 ఫిబ్రవరి 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పాప్‌కార్న్ 2023లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. ఎంఎస్ చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై భోగేంద్ర ప్రసాద్ గుప్తా నిర్మించిన సినిమాకు మురళి గంధం దర్శకత్వం వహించాడు. అవికా గోర్, సాయి రోనక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 4న హీరో నాగార్జున విడుదల చేయగా[1], సినిమా ఫిబ్రవరి 10న విడుదలైంది.[2]
కథ
[మార్చు]సమీరణ (అవికా గోర్) తన తల్లితో ఉంటూ ఆమె అందగత్తెనని అనుకుంటూ ఉంటుంది. ఉప్పల్ మాల్ లో షాపింగ్ కి వెళ్లి లిఫ్ట్ ఎక్కుతుంది. తన తాతయ్య (చారు హాసన్) కలను నెరవేర్చాలని తపించే మ్యూజిషియన్ పవన్ (సాయిరోనక్) తాతగారి పుట్టినరోజుకి షాపింగ్ మాల్ కి వచ్చి సామాన్లు కొని లిఫ్ట్ ఎక్కుతాడు. ఈ సమయంలో షాపింగ్ మాల్ లో బాంబ్ పేలుడు వలన లిఫ్టు ఆగిపోయి అందులో ఇద్దరూ ఉండిపోతారు. ఆ లిఫ్టులో ఆస్తమా వల్ల సమీరణ ప్రాణాలకు ముప్పు ఏర్పడితే పవన్ ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్
- నిర్మాత: భోగేంద్ర ప్రసాద్ గుప్తా
- సహ నిర్మాతలు: అవికా గోర్, ఎం.ఎస్. చలపతి రాజు, శేషు బాబు పెద్దింటి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మురళి గంధం
- సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
- సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (4 January 2023). "యూత్‌ని ఆకట్టుకునేలా 'పాప్‌కార్న్' ట్రైలర్". Archived from the original on 20 January 2023. Retrieved 20 January 2023.
- ↑ Namasthe Telangana (20 January 2023). "పాప్‌కార్న్ వినోదం". Archived from the original on 20 January 2023. Retrieved 20 January 2023.
- ↑ NTV Telugu (10 February 2023). "[[పాప్ కార్న్]] రివ్యూ". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
{{cite news}}
: URL–wikilink conflict (help) - ↑ Namasthe Telangana (10 February 2023). "తొలి అడుగు వేశాను". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.