Jump to content

పామాపురం రామేశ్వరస్వామి దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 16°15′07″N 77°55′21″E / 16.251903°N 77.922560°E / 16.251903; 77.922560
వికీపీడియా నుండి
పామాపురం రామేశ్వరస్వామి దేవాలయం
పామాపురం రామేశ్వరస్వామి దేవాలయం
పామాపురం రామేశ్వరస్వామి దేవాలయం
పామాపురం రామేశ్వరస్వామి దేవాలయం is located in Telangana
పామాపురం రామేశ్వరస్వామి దేవాలయం
తెలంగాణలో దేవాలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు16°15′07″N 77°55′21″E / 16.251903°N 77.922560°E / 16.251903; 77.922560
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లావనపర్తి
స్థలంపామాపూర్, కొత్తకోట మండలం
సంస్కృతి
దైవంరామేశ్వరస్వామి (రామనాథస్వామి)
వాస్తుశైలి
నిర్మాణ శైలులుకాకతీయ నిర్మాణ శైలి
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీసామాన్య శకం 543 నుండి 750 వరకు

పామాపురం రామేశ్వరస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, కొత్తకోట మండలంలోని పామాపూర్ గ్రామంలో ఉన్న దేవాలయం. దీనిని ముచ్చ రామనాథస్వామి దేవాలయం అనికూడా పిలుస్తారు. సామాన్య శకం 543 నుండి 750 మధ్యకాలంలో చాళుక్యుల ఆధ్యాత్మిక చిహ్నంగా నిర్మించబడింది. దేవాలయంలోని స్వామి స్వయంభూగా వెలిసాడని భక్తుల నమ్మకం.[1] ఇక్కడ భ్రమరాంబ సహిత రామేశ్వరస్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు.

చరిత్ర

[మార్చు]

రెండుసార్లు ఆనవాళ్ళు కోల్పోయిన ఈ దేవాలయాన్ని మళ్ళీ కట్టించారని చరిత్రకారులు చెబుతున్నారు. శతాబ్దాల క్రితం కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఇక్కడికి వచ్చి గుట్టమీద ఉన్న శిథిలమైన దేవాలయాన్ని చూసి దేవాలయాన్ని పునర్నిర్మించి, నిర్వహణ బాధ్యతలను పామాపురం గ్రామానికి చెందిన తంబాల వంశస్థులకు అప్పగించింది. స్వామి కైంకర్యాల కోసం రుద్రమదేవి అనేక మాన్యాలను ప్రకటించినట్టు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. గుట్ట అడుగున ఊకచెట్టు వాగు ఉంది.

నిర్మాణం

[మార్చు]

ఈ దేవాలయంలోని శివలింగం, కాశీలోని శివలింగాన్ని పోలి ఉంటుంది. శివాలయంతోపాటు నవగ్రహ మందిరం, జంటనాగుల మందిరం, సంజీవ, ఆంజనేయస్వామి దేవాలయం, కళ్యాణ మంటపం మొదలైనవి ఉన్నాయి. ఆలయ పుష్కరిణిలో నంది విగ్రహం కూడా ఉంది. నిరంతరం ప్రవహిస్తున్న ఈ వాగు మధ్యలోని ఏడడుగుల పీఠంపై 18 అడుగుల ఎత్తులో ధ్యానముద్రంలో కూర్చున్న శివుని భారీ విగ్రహం ఏర్పాటుచేయబడింది.[2]

1981లో ఇక్కడికి వచ్చిన అలంపూర్‌ రెడ్డిరాజుల వంశస్థుడు సురేందర్‌రెడ్డి కోరిక మేరకు అతని కొడుకు దేవాదాయ శాఖ అనుమతితో గణపతి సచ్చిదానందస్వామి ఆశీస్సులతో 2017లో ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఇక్కడ భ్రమరాంబ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో ఆనాటి నుంచి భ్రమరాంబ సహిత రామేశ్వరస్వామిగా భక్తులు పిలుస్తున్నారు. [3]

ఉత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. గిరిజా కళ్యాణం, రథోత్సవం వేడుకలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, టూరిజం (7 August 2021). "అపర శ్రీశైలం పామాపురం". Namasthe Telangana. రాందేని చంద్రమౌళి. Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 October 2021.
  2. సాక్షి, తెలంగాణ (22 July 2021). "Photo Story: 'నీళ్ల'కంఠుడు.. పూర్తిగా మునిగిన శివాలయం". Sakshi. Archived from the original on 22 July 2021. Retrieved 19 October 2021.
  3. ఈనాడు, ఆదివారం అనుబంధం. "మరో శ్రీశైలం... పామాపురం!". EENADU. కాయల పూర్ణచందర్. Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]