పార్శ్వనాథ జైన ఆలయం, గుమ్మిలేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ శంకేశ్వర పార్శ్వనాథ జైన ఆలయం, గుమ్మిలేరు

శ్రీ శంకేశ్వర పార్శ్వనాథ జైన ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ జైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ జైన ఆలయం తూర్పు గోదావరి జిల్లాలో ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు గ్రామంలో ఉంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ‘గుమ్మిలేరు జైన ఆలయం’ అని కూడా పిలుస్తారురు. పూర్తిగా పాలరాతితో నిర్మించబడిన ఈ జైన ఆలయంలో మూలనాయకుడుగా (మూల విరాట్టు) 23 వ జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడు నెలకొని ఉన్నాడు.

ఆలయ విశేషాలు[మార్చు]

  • ఆలయనిర్మాణం పూర్తిగా తెల్ల పాలరాతి (White Marble) తో జరిగింది. లోహాన్ని ఎక్కడా ఉపయోగించలేదు.
  • ఈ జైన ఆలయంలో మూల నాయకుడుగా 23 వ జైన తీర్థంకరుడు అయిన ‘పార్శ్వనాథుడు’ ప్రతిష్ఠించబడ్డాడు.
  • ఈ ఆలయంలో మూల నాయకుడి విగ్రహం చారిత్రకంగా ప్రాముఖ్యత కలిగివుంది. సుమారుగా 2000 సంవత్సరాలకు క్రితం నాటి ఈ పురాతన విగ్రహాన్ని (పార్శ్వనాథుడు) మౌర్యుల కాలం నాటిదిగా భావిస్తున్నారు.[1]

ఆలయ నిర్మాణ నేపధ్యం[మార్చు]

1977 లో ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు గ్రామంలో కాలువ కోసం త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ పురాతన జైన విగ్రహం బయల్పడింది. గ్రామస్థులు తొలుత దానిని బుద్ధుని విగ్రహంగా భావించి పూజించడం మొదలుపెట్టారు. అయితే నిపుణుల పరిశీలనలో ఆ పురాతన విగ్రహం 23వ జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడి విగ్రహంగా తేలింది. విగ్రహకాలం సుమారుగా 2000 సంవత్సరాలకు పూర్వం ఉండవచ్చని గుర్తించారు.[1] మౌర్యుల కాలం నాటిదిగా భావించబడిన ఈ తీర్థంకరుని విగ్రహం అర్థ పద్మాసన ముద్రలో ఆశీనుడిగా కనిపిస్తున్నది. ఈ పురాతన విగ్రహాన్ని రాజమండ్రికి తరలించడానికి చేసిన ప్రయత్నాలను, స్థానిక ప్రజలు గట్టిగా ప్రతిఘటించడంతో జైన సంఘం ఈ విగ్రహాన్ని గుమ్మిలేరులోనే వుంచి, అది బయల్పడిన ప్రదేశంలోనే ఒక సుందరమైన ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించింది.

ఆలయ నిర్మాణం[మార్చు]

మండపేట-ఆలమూరు కలిపే రహదారి వెంబడి, గుమ్ములూరు గ్రామంలో చుట్టూ పచ్చని పొలాల మధ్యన ఈ ఆలయాన్ని నిర్మించారు. జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడి గౌరవార్ధం నిర్మించబడిన ఈ ఆలయానికి నిర్మాణపరంగా ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయ నిర్మాణం కోసం రాజస్థాన్ నుంచి తెప్పించిన ఖరీదైన తెల్ల పాలరాతిని వాడారు. ఇనుము తదితర లోహాలను ఉపయోగించలేదు. 2006 లో జైన ఆచార్యుడు శ్రీ జయంతసేన సూరేశ్వర్ జీ మహరాజ్, ఈ పాలరాతి ఆలయంలో అర్ధ పద్మాసన రీతిలో వున్న పురాతన పార్స్వనాథ విగ్రహాన్ని మూల నాయకునిగా ప్రతిష్ఠించడం జరిగింది. సదూర ప్రాంతాల నుంచి వచ్చే జైన భక్తుల సౌకర్యార్ధం ఈ ఆలయం చుట్టూ వున్న ఆవరణలో వసతి గృహాలను నిర్మించారు. జైనులకు పుణ్యక్షేత్రంగా వున్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుండి జైనులు తరలి వస్తుంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

రిఫరెన్సులు[మార్చు]

  • "జైన గోదావరి". (Andhrojyothi Bureau Network). Andhra Jyothi ePaper. 8 July 2015. Retrieved 24 September 2017.[permanent dead link]
  • "Jain Temple, Gummileru, Andhra Pradesh". Tour my India.com. Archived from the original on 5 జూలై 2017. Retrieved 24 September 2017.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Jain Temple, Gummileru, Andhra Pradesh.