పాల పొదుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాల పొదుగు.... పెద్ద కథ

[మార్చు]

ఇది పెద్ద కథ. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు వ్రాసిన ఈ కథలోని భాష అతని అన్ని రచనలోని భాష లాగే చిత్తూరు జిల్లా మాండలికంలో సాగి కొత్త అనుభూతినిస్తుంది. కాని ఒక్కోసారి కొంత వెగటును కూడా కలిగిస్తుంది. కారణమేమంటే..... ఒకె ఇంట్లోని అమ్మ కొడుకులు కూడా బూతు మాటలతో తిట్టు కోవడం కొంత ఎబ్బెట్టుగా ఉంది. వాటిని పక్కన బెడితే కథా గమనం మాత్రం పాఠకుణ్ణి మాత్రం వదలకుండా చదివిస్తుంది. రచయిత ఈ కథ వ్రాయడానికి ఒక ప్రస్తావన ఉంది. అది అతని మాటల్లోనే వింటే ఇంకా బాగుటుంది.

కథలోని విషయం

[మార్చు]

ఎక్కడినుండో తప్పి పోయి వచ్చిన ఒక ఎనుము ఆ వూరిలోకి చేరింది. అందరూ దానిని వెళ్ళగొట్టగా చివరకు అది కర్రెక్క దొడ్డిలోకి చేరింది. సొంత గాళ్ళు ఎవరో వెతుకు లాడుతూ రేపో మాపో వచ్చి తొలుక పోతారులే ననుకుని కర్రెక్క తన గొడ్లతో పాటు దానికి కూడా నాలుగు గడ్డి పరకలు విదిలించింది. దాని గురించి ఎవరూ రాక పోగా చివరకు అది కర్రెక్క సొంతమై పోయింది. ఆక్కడే ఈనింది. పాలిచ్చింది. ఈ విషయం తెలిసిన వూరి ఆడంగులు అసూయతో కర్రెక్కను ఆడి పోసుకోవడం ఈ కతలోని ముఖ్యాంశం. పల్లెలలోని బీద బ్రతుల జీవన విధానము కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు రచయిత నామిని సు బ్రాహ్మణ్య నాయుడు గారు.

ప్రస్థావన

[మార్చు]

ఒక రోజు పతంజలి,.............. నాయుడు గారూ......... 'ఖాకీ వనం' అని నేనొకటి రాశాను. ఇదేమైనా చదివి నాతో ఏమైనా చెప్తారా' అని చతుర పుస్తకాన్నిచ్చినాడు " నేనొక రోజులో చదివేసి 'ఏమైనా అర్థం వుండాదా ..... మీకేమిటికి పోలీసోళ్ళతో ....థూ... నానినం , దరిద్రంగా ఉండాది సార్.... మీవూరోళ్ళ గురించి ఏమన్నా రాయండి బాగుంటాది ' అనేసినా. నాయుడుగారూ ఒక్కడన్లేదీ మాట. మనకు జనాలలో మంచి పేరు తెచ్చిందోయ్ ఈ పుస్తకం. అన్నాడాయన. 'కులుకు ఎక్కువైపోతే ఓయ్, ఓయీ ' అనడం ఆయన వాడిక.

ఆయనకు టాల్ స్టాయ్ అంటే పిచ్చి. పిచ్చి అనే పదం కంటే ఉమాదం అనే పదం వాడడం మంచిది. ఒక సారి నన్ను పట్టుకుని టాల్ స్టయ్ గొప్పతం చెప్పేదానికి కుచ్చునేసినాడు. గంట కాదు, రెండు గంటలు కాదు, మూడు గంటలు కాదు. ఒక రోజంతా.... ఇల్లు దగ్గరున్నా మెస్ లోనే భోజనం. ఇద్దరమూ, \...... ఆయన స్నానం చెయ్యలా... నేను చెయ్యలా... ఆయన టాల్ స్టయ్ ఆరడుగుల నేల కథ నాకు మొత్తం పూస గుచ్చి నట్లు చెప్పినాడు. నేను పొగురుగా ఒకే మాట అన్నాను. ఆయనంత చెత్త రచయిత ఈ భూమండలం మీద ఇంక పుట్టడు సార్. ఇదా మీరు చదువుకున్న చదువు...... నన్ను చదువుకోమనే చదువు? .... నామాట నా నోట్లో వుండగానే..... ఆయ చెయ్యి పైకి లేచింది. నా చెంప మీద పడే దానికి. ఒక్క కథ కూడ అచ్చుకాని వాడికి అంత పొగరు ఉండ కూడదనేది ఆయన ఉద్దేశం. ఉండాలనేని నా ఉద్దేశం. నేనూ ఏం తగ్గలా.... కొట్టండి సార్... పర్వాలేదు. ఈ ఆరడుగుల నేల అనేది ఎట్లా మంచి కథో చెప్పండి వింటా.... అది ఏరకంగా చెత్త కథో నేను జెప్తా విందురు అన్నాన్నేను కుదురుగా... ఆయన సిగరెట్టునే కాలస్తా.

అది ప్రపంచంలోనే గొప్ప కథ. ఆయనంత పరిశుద్ధమైన రచయిత మరోడు లేడు. రష్యన్ సాహిత్యం, ప్రపంచ సాహిత్యం మీకు బొత్తిగా తెలియదు అనేసి అన్నాడు ఆయన. అది ప్రపంచంలోనే చెత్త కథ సార్....... కోపం తగ్గించుకొని వినండి. నేను చదుకోలా.... మేథ్శ్లో వచ్చే సిన్స్, ప్రం, దేర్ ఫోర్, వైబికాస్, ఇల్లాంటి పదాలకు మించి ఇంగ్లీషు నాకు రాదు. మీరొక సారి టాల్స్టాయిని వుద్దేశిచి... ఆయనో పెద్ద కౌంట్ అని అంటే...... కౌంట్ అంటే లిక్కించడం కద సార్..... ఆయన్ని నేనెక్కడ లెక్కించేది అని అడిగిన్నాకొడుకుని నేను. మీరు నన్నప్పుడు ఎగతాళి చెయ్యకుండా కౌంట్ అంటే...... వందాలాది ఎకరాలున్న ప్రభువు అని అర్థ చెప్పానారు గుర్తుండాదా? వందలాది ఎకరాలు ఉన్నవాడూ, వ్వవసాయాల్ని గుర్రాల మీద తిరిగి చెయ్యించే వాళ్ళూ మాత్రమే రాసె కథ అది. నాకు మాదిరిగా రెండెకరాలే ఉండి దానికి తోడు ఒక అన్న కూడా వున్నవాడు ఆ కథ రాయనే రాయడు. చచ్చినాక ఆరడుగుల నేల చాలు. సరే, బతికున్నప్పుడు.... ఈ భూమండలాన్నంతా జానాభాతో భాగిస్తే పాయింట్ల తర్వాత వచ్చే నేల కూడా కావాల నాకు. మీరు రాజా, ఆయ ప్రభువు... ఇద్దరూ దొందు దొందే.

ఆరోజు నాకొచ్చింది చూడు కోపం....... చంద్ర బాబు మీద వైఎస్ మండి పడ్డాడు అని పత్రికల్లో రాస్తారే అట్లా నేను టాల్ స్టాయ్ మీద మండి పడ్డా. ఇంకా నేను ఏం వాగానంటే మీరు టాల్ స్టాయ్ ది ఇంకో చెత్త పుస్తకం ఫాదర్ ఫెర్గ్యూసన్ గురించి చెప్తిరి. అది ఇంకా చెత్త .... భూమిని ఏలంలో పాడాలని ఆబగా, ఆసిగా ఫెర్గ్యూసన్ పోతే చచ్చి పోయి తిరిగొచ్చే కథ అదేదో భూనిని వేలంలో పాడుకొని క్షేమంగా ఫెర్గ్యూసన్ ఇంటి కొస్తే టాల్ స్టయ్ కేం తీపా? కానీ ఆయన రానియ్యడు. అదే మాదిరిగా టాల్ స్టయ్ దే ''అనాకెరీనినా '' - రైలు కింద పడి కుక్క చావు చచ్చినట్లు ఆ నవల గంటల కొద్ది చెప్పి నారు. లంజిరికం చేసినంత మాత్రాన ఆ ఆడమనిషి అట్లాంటి చావు చచ్చి పోల్నా? నీతేందిసార్, నీతి దరిద్దరంగా........ ఇట్టాంటి వన్నీ భుములు బావులు పుష్కలంగా వున్న వాళ్ళు తప్ప లేని వాళ్ళు రాయరు సార్... మీరు చెప్పండి దాస్తోవిస్కీ ఇట్టాంటి శిక్షలు వేసుంటే చెప్పండి చూద్దాం. ఆ టాల్స్టాయ్ ప్రభువు తప్ప.

తోట కూర కాడ మాదిరిగా ఆయన అట్లానే మెడ వాల్చేసాడు నాతో ఏగలేక.

నేను దేశాల సాహిత్యం చదుకో లేదని ఆయనకు పెద్ద బాధ. నాకు ఇంగ్లీషు పుస్తకాలిచ్చే వాడు చదమని చెప్పి. నాకు ఒక వాఖ్యంలో అన్ని పదాలకు అర్థాలు డిక్షనరీ చూసి తెలుసుకున్నా ఆ వాఖ్యం అర్థ అయ్యేది కాదు. నాకొక సారి కోపం వచ్చేసి సార్., నన్ను గాని ఇంగ్లీషు పుస్తకాలిచ్చి చదుకోమంటే మీ మొకం కూడ చూడను. అన్నా. ఆ తర్వాత నన్నెప్పుడూ ఆయన ఇంగ్లీషు పుస్తకాన్నిచ్చి చదువుకోండి నాయుడు గారూ అని అననే అనలేదు.

టాల్ స్టాయ్ మీద చర్చ జరిగాక ఒక రోజు, నాయుడు గారూ మిమ్ముల్ని మెప్పించేది ఒకటి రాయాలని మహా దురదగా ఉంది. మీ ఊరి వాళ్ళ మీది మీరొక కథా, మా వూరోళ్ళమీద నేనొక కథా రాద్దాం. నాలుగే నాలుగు రోజుల్లో రాసెయ్యాలి. ఇద్దరం రాసేసి ''చతుర ''కు పంపిద్దాం అని సవాలేసినాడాయన. నేనూ కూర్చున్నా ఆయన కూచ్చున్నాడు. నేను పాల పొదుగు అనేది రెండు రోజుల్లో రాసినా, పతంజలి రాజుగోరు అనేది నాలుగైదు రోజులకు రాసినాడు. ఒకరి దొకరు చదువుకున్నాం. ఆయన ఒకే ఒక మాటన్నాడు. నాయుడు గారూ మీరు మీ కథని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడిటర్ కి కూడా అర్థం కాకూడదనీ, అది అచ్చు కూడా కాకూడని వ్రాశారు.... నేను ...... ఎట్టి పరిస్థితుల్లోను అది అచ్చయి తీరాలని వ్రాశాను. అని అన్నాడు. ........... ........ ........ ......... ......... .... .