పిట్టగోడ
పిట్టగోడ | |
---|---|
దర్శకత్వం | కె.వి. అనుదీప్ |
రచన | రామ్ మోహన్ పి. (scenario), అనుదీప్ కె.వి.(సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | రామ్ మోహన్ పి. |
కథ | రామ్ మోహన్ పి. |
నిర్మాత | రామ్ మోహన్ పి. |
తారాగణం | విశ్వదేవ్ రాచకొండ పునర్నవి భూపాలం |
ఛాయాగ్రహణం | ఉదయ్ |
సంగీతం | 'ప్రాణం ' కమలాకర్ |
నిర్మాణ సంస్థలు | సన్‌షైన్ సినిమా, సురేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 24 డిసెంబరు 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పిట్టగోడ 2016 డిసెంబరు 24న విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రం ద్వారా కె.వి. అనుదీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.[1] సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రానికి సహ నిర్మాణ సంస్థ గా వ్యవహరిస్తున్నది.
కథ
[మార్చు]నలుగురు కుర్రాళ్లు తమ ఊరిలోని పిట్టగోడ మీద కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. సరిగ్గా చదవక, పరీక్షలు పాస్ అవడం లేదని తండ్రుల చేత చీవాట్లు తింటుంటారు. ఏదో ఒక పనికొచ్చే పని చేసి పేపర్లో పడాలని అనుకుని ఒక క్రికెట్ టోర్నీ నిర్వహిద్దామని అనుకుంటారు. ఆ క్రమంలో వారు ఇబ్బందుల్లో పడతారు. డబ్బులు వసూలు చేసి పోటీలు నిర్వహించలేకపోవడంతో వారిపై మోసం చేసిన నేరము కూడా నమోదవుతుంది. ఇదిలావుంటే తమ ఊరికి కొత్తగా వచ్చిన దివ్యతో (పునర్నవి) ప్రేమలో పడతాడు ఈ గుంపులోని ముఖ్యుడు అయిన టిప్పు (విశ్వదేవ్). ఆమె కారణంగా అతని జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది? చివరకు ఆ గోడ మీది నలుగురి జీవితాలు ఏమవుతాయి? అన్నదే మిగిలిన కథ.[2]
తారాగణం
[మార్చు]- విశ్వదేవ్ రాచకొండ
- పునర్ణవి భూపాలం
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాణ సంస్థ: సన్‌షైన్ సినిమా, సురేష్ ప్రొడక్షన్స్
- సంగీతం: 'ప్రాణం ' కమలాకర్
- ఛాయాగ్రహణం: ఉదయ్
- కథనం, నిర్మాత: రామ్ మోహన్ పి.
- మాటలు, దర్శకత్వం: కె.వి. అనుదీప్
- విడుదల తేదీ: డిసెంబరు 24, 2016
- కూర్పు : వెంకట కృష్ణ చిక్కాల
మూలాలు
[మార్చు]- ↑ http://www.thehindu.com/features/metroplus/director-anudeep-along-with-30-artistes-makes-his-debut-with-pitta-goda/article7986732.ece
- ↑ "తసినిమా రివ్యూ: పిట్టగోడ". greatandhra.com. 2016-12-24. Retrieved 2016-12-27.