పిట్టల రవీందర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పిట్టల రవీందర్‌ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మత్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

పిట్టల రవీందర్ 1963 మే 24న తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, వీణవంక గ్రామంలో పిట్టల ఉపేందర్, వీరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన వీణవంక ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యను, కళాశాల విద్య (ఇంటర్, డిగ్రీ) గోదావరిఖని ప్రభుత్వ  కళాశాలలో,  మైసూర్ యూనివర్శిటీ నుండి జర్నలిజం కోర్సు పూర్తి చేశాడు. ఆయన ఆ తరువాత బి.ఇడి., ఎం.బి.ఏ., పి. డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్, రిఫ్రెషర్ కోర్స్ ఆన్ మోబైల్ జర్నలిజం (మోకో), డిస్టెన్స్ లర్నింగ్ ఇన్ ఆక్వాకల్చర్ (ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం), సర్టిఫికేట్ కోర్స్ ఇన్ అక్సాప్రెన్యూర్ మేనేజ్మెంట్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ పియర్ల కల్చర్ (మంచినీటి ముత్యాల సాగు), మంచినీటి సముద్రపునాచు (స్ఫిరులీనా) ఉత్పత్తిలో సర్టిఫికేజ్ కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఐయో ఫిష్ ఫార్మింగ్ టెక్నాలజీ (బి.ఎఫ్.టి)  పూర్తి చేసి రీ-సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టం, కేజ్ కల్చర్ ప్రాక్టీ లాంటి అనేక అంశాలపై అవగాహన పెంచుకున్నాడు.

వృత్తి జీవితం[మార్చు]

పిట్టల రవీందర్ 1983లో జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించి తెలుగు, ఇంగ్లీషు పత్రికల్లో రిపోర్టర్ నుండి ఎడిటర్ స్థాయివరకు పాత్రికేయునిగా పని చేశాడు. ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్రప్రభ, వార్త, ఉదయం లాంటి ప్రధాన పత్రికలతోపాటు రచ్చబండ, జీవగడ్డ, ప్రజాతంత్రలాంటి పత్రికల్లోనూ దాదాపు 40 సంవత్సరాలుగా జర్నలిస్టు పని చేశాడు. ఆయన సింగరేణి గని కార్మికులకోసం ప్రత్యేకంగా 'చర్చ' అనే తెలుగు దినపత్రికను 'గోదావరిఖని' కేంద్రంగా నిర్వహించాడు. వృత్తి జర్నలిస్టుగా పూర్తికాలం పనిచేస్తున్న కాలంలోనే జర్నలిస్టుల ఉద్యమాలలో కూడా క్రియాశీలకమైన పాత్రను నిర్వహించాడు.

పిట్టల రవీందర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఎ.పి.యు.డబ్ల్యు.జె)లో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శిగా, అధ్యక్షునిగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించి గోదావరిఖని, వరంగల్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పని చేశాడు.

మూలాలు[మార్చు]

  1. telugu (22 May 2023). "మ‌త్స్య స‌మాఖ్య చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన పిట్ట‌ల ర‌వీంద‌ర్". Archived from the original on 23 May 2023. Retrieved 23 May 2023.