Jump to content

పిర్తి సింగ్

వికీపీడియా నుండి
పిర్తీ సింగ్ నంబర్‌దార్

పదవీ కాలం
2009 – 2014
ముందు రణదీప్ సుర్జేవాలా
తరువాత రామ్ నివాస్ సుర్జాఖేరా
నియోజకవర్గం నర్వానా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ఐఎన్ఎల్‌డీ
జేజేపీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

పిర్తీ సింగ్ నంబర్‌దార్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నర్వానా నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పిర్తీ సింగ్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాంఫాల్ లాట్ పై 20,640 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2014 ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సంతోష్ రాణిపై 9,152 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఆ తరువాత ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) పార్టీలో విభేదాల కారణంగా ఐఎన్ఎల్‌డీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.[3] ఆయన ఆ తరువాత 2019 ఫిబ్రవరి 7న కొత్తగా ఏర్పాటు చేసిన జననాయక్ జనతా పార్టీ (జెజెపి)లో చేరాడు.[4]

పిర్తీ సింగ్ 2024 సెప్టెంబర్ 19న బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం 'మంగల్ కమల్'లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ, రాజ్యసభ ఎంపీ సుభాష్ బరాలా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. News18 हिंदी (6 September 2019). "विधायक पद से इस्तीफा देने के बाद INLD के चारों बागियों ने छोड़ी पार्टी". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Times of India (7 February 2019). "INLD's Narwana MLA joins JJP, cites Devi Lal's ideology". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  5. The Tribune (19 September 2024). "Former Narwana MLA Prithi Singh joins BJP in Rohtak" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.