పి.ఆర్.కృష్ణ కుమార్
పి.ఆర్.కృష్ణ కుమార్ | |
---|---|
జననం | |
మరణం | 2020 సెప్టెంబరు 16 | (వయసు 68)
వృత్తి | ఆయుర్వేద వైద్యుడు[1] |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | AVP రీసెర్చ్ ఫౌండేషన్ |
పురస్కారాలు | పద్మశ్రీ; ధన్వంతరి పురస్కారం |
పి.ఆర్. కృష్ణ కుమార్ (1951 సెప్టెంబరు 23 – 2020 సెప్టెంబరు 16) భారతీయ ఆయుర్వేద నిపుణుడు,[1] ది ఆర్య వైద్య ఫార్మసీ (కోయంబత్తూరు) లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టరు. అతను AVCRI (ది ఆర్య వైద్య చికిత్సాలయం అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్), AVP రీసెర్చ్ ఫౌండేషన్, లాభాపేక్ష లేని సంస్థను పర్యవేక్షించాడు. ఆయుర్వేదంలో పరిశోధనను ప్రోత్సహించే సంస్థ ఆయుర్వేద ట్రస్ట్‌ను స్థాపించాడు.[2] అతను అవినాశిలింగం యూనివర్శిటీకి ఛాన్సలర్,[3] ఆయుర్వేద ఔషధాలను ప్రామాణీకరించే ప్రయత్నాలలో పాలుపంచుకున్న వనరుల కేంద్రం అయిన CARE కేరళం (కాన్ఫెడరేషన్ ఫర్ ఆయుర్వేద పునరుజ్జీవన – కేరళం) కు చైర్మన్‌గా పనిచేసాడు.[4] ఆయుర్వేదానికి ఆయన చేసిన సేవలకు గాను 2009 లో భారత ప్రభుత్వం ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ ప్రదానం చేసింది.[5]
ప్రారంభ జీవితం
[మార్చు]కృష్ణ కుమార్ 1951 సెప్టెంబరు 23 న దక్షిణ భారతదేశంలోని కేరళ, పాలక్కాడ్ జిల్లాలోని షోరనూర్‌లో ఆయుర్వేద వైద్యుల కుటుంబంలో ఆయుర్వేద వైద్యుడు, ఆర్య వైద్య ఫార్మసీ వ్యవస్థాపకుడూ అయిన పివి రామ వారియర్, పంకజంలకు జన్మించాడు. ఆయుర్వేదంలో అతని అధికారిక విద్యాభ్యాసం పాలక్కాడ్‌లోని షోరనూర్‌లోని షోరనూర్ ఆయుర్వేద కళాశాలలో జరిగింది.[6]
కుమార్ తన విద్యను పూర్తి చేసిన తర్వాత ఆర్య వైద్య ఫార్మసీలో చేరి, ఫౌండేషన్‌లో ఆయుర్వేద అధ్యయనంలో నిమగ్నమయ్యాడు.[7]
1977 లో అతను ఆయుర్వేద అధ్యయనాల కోసం ఏడున్నర సంవత్సరాల పాఠ్యాంశాలను రూపొందించి, అమలు చేశాడు. ఈ కోర్సు మొదట మద్రాస్ విశ్వవిద్యాలయానికి, ఆ తరువాత భారతియార్ విశ్వవిద్యాలయాలలో ఉండేది. ఈ కోర్సు ఆధ్యాత్మిక అభ్యాసాలు, సాంప్రదాయ యుద్ధ కళల భాగాలతో పాటు ఆయుర్వేద అధ్యయనాలను పరిచయం చేసింది. పాఠ్యాంశాలు "కోయంబత్తూరు ప్రయోగం"గా విద్యా వర్గాలలో ప్రసిద్ధి చెందాయి.[7] అదే సంవత్సరంలో, అతను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌తో సంయుక్త అధ్యయనంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కోసం ఆయుర్వేద ఔషధాల సామర్థ్యాన్ని అధ్యయనం చేయడానికి మొట్టమొదటి క్లినికల్ పరిశోధనను ప్రారంభించాడు.[6]
కుమార్ 1985 - 1988 మధ్య పశ్చిమ కనుమలలో గిరిజనుల ఎథ్నోబయాలజీపై ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ ప్రాజెక్ట్ అమలుతో సహా ఆయుర్వేదం, సాంప్రదాయ భూ వినియోగంతో అనుసంధానించబడిన భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, పర్యావరణ శాఖల కోసం ప్రాజెక్ట్‌లను అమలు చేశాడు.[7][8]
2003 లో కుమార్ AVT ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్'ని స్థాపించాడు. ఆయుర్వేదంలో శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడానికి AVP రీసెర్చ్ ఫౌండేషన్‌గా దాని పేరు మార్చారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌తో సంయుక్తంగా నిధులు సమకూర్చుకుని ఫౌండేషన్ అనేక పరిశోధన కార్యక్రమాలను ప్రారంభించింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలో ఆయుర్వేద ఔషధాల సామర్థ్యాన్ని నిర్ధారించడానికి సీటెల్ లోని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్, లాస్ ఏంజిల్స్ లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఈ పరిశోధనను నిర్వహించాయి.[9] అదే సంవత్సరంలో ఫౌండేషన్, ఆయుర్వేదంలో అభ్యాస-ఆధారిత సాక్ష్యాలను ప్రోత్సహించడానికి రుద్ర అనే క్లినికల్ డాక్యుమెంటేషన్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది.[10]
అతను పిల్లల కోసం సంపూర్ణ విలువ ఆధారిత విద్యకు కేంద్రంగా DIVYAM అకాడమీని స్థాపించాడు. టాబ్లెట్ రూపంలో ఆయుర్వేద ఔషధాల తయారీని సంభావితం చేయడంలో, అమలు చేయడంలో అతను సహకరించాడు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాడు. భారత ప్రభుత్వం అతనిని 2009 లో పద్మశ్రీ పౌర పురస్కారంతో సత్కరించింది కేరళలోని కాన్ఫెడరేషన్ ఫర్ ఆయుర్వేద పునరుజ్జీవనానికి (CARE) ఛైర్మన్‌గా కూడా పనిచేసాడు.[6]
భారతదేశంలో COVID-19 మహమ్మారి ప్రారంభంలో, కోవిడ్-19 నిర్వహణకు ఆయుర్వేద అవకాశాలను చర్చించడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కుమార్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాడు.[6]
అనారోగ్యం, మరణం
[మార్చు]డయాబెటిక్ ఫుట్ అల్సర్ కారణంగా కుమార్ కుడి కాలు మోకాలి నుండి క్రింద భాగాన్ని తొలగించారు.[6]
భారతదేశంలో COVID-19 మహమ్మారి సమయంలో COVID-19 బారిన పడిన తర్వాత కుమార్, ఒక వారం పాటు కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందాడు.[6] అతను 2020 సెప్టెంబరు 16 న తన 69వ పుట్టినరోజుకు ఏడు రోజుల ముందు మరణించాడు.[11]
సత్కారాలు
[మార్చు]కుమార్ కువెంపు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరల్ డిగ్రీని అందుకున్నాడు. [10]
ఇది కూడా చూడండి
[మార్చు]- AVP రీసెర్చ్ ఫౌండేషన్
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Ayurveda expert P R Krishnakumar passes away". Deccan Herald (in ఇంగ్లీష్). 17 September 2020. Retrieved 2 December 2020.
- ↑ "Research conducted by Kovai scientists on rheumatic patients shortlisted for prestigious award". Times of India. 17 July 2012. Archived from the original on 3 October 2016. Retrieved 24 February 2016.
- ↑ "Krishnakumar assumes charge as Chancellor". Mathrubhumi. 23 November 2015. Archived from the original on 9 March 2016. Retrieved 24 February 2016.
- ↑ Staff Reporter (16 September 2020). "Ayurveda doyen P. R. Krishnakumar dies of COVID-19". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 18 September 2020.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived (PDF) from the original on 15 October 2015. Retrieved 3 January 2016.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 Reporter?, Staff (16 September 2020). "Ayurveda doyen P. R. Krishnakumar dies of COVID-19". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 17 September 2020. Retrieved 16 September 2020.
- ↑ 7.0 7.1 7.2 Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ "Padmashree Dr. P. R. Krishna Kumar". ayurvedicpointcongress.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 18 September 2020.
- ↑ "U.S. study shows efficacy of Ayurveda medicines in rheumatoid arthritis cure". The Hindu. 18 July 2011. Archived from the original on 22 February 2014. Retrieved 24 February 2016.
- ↑ 10.0 10.1 "Arya Vaidya Pharmacy Chairman Krishnakumar dies of COVID-19 in Coimbatore". The New Indian Express. Retrieved 18 September 2020.
- ↑ "Doyen of Ayurveda – P R Krishnakumar is no more". @businessline (in ఇంగ్లీష్). 17 September 2020.