పి.ఎస్.నారాయణ
పి.ఎస్.నారాయణ ప్రముఖ కథారచయిత. ఇతడు 230కు పైగా కథలు, 31 నవలలు, 10 రేడియో నాటికలు, 2 స్టేజి నాటకాలు, ఏన్నో విమర్శా వ్యాసాలు రచించాడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]పి.ఎస్.నారాయణగా పిలువబడే పొత్తూరి సత్యనారాయణ 1938లో గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, చినకాకానిలో పొత్తూరి రామయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని బాల్యంలోనే తల్లిదండ్రులు మరణించడంతో పెద్ద అక్కయ్య వద్ద పెరిగి పెద్ద అయ్యాడు. ఇతడు ప్రాథమిక విద్య చినకాకానిలోను, సెకెండ్ ఫారం వరకు మంగళగిరిలోను, థర్డ్ ఫారం నుండి బి.కాం వరకు గుంటూరులోని హిందూ కళాశాలలో చదివాడు. కాలేజీ చదివే సమయంలో మన్నవ గిరిధరరావు ఇతని గురువు.[1]
ఉద్యోగం, కుటుంబం
[మార్చు]ఇతడు 1957లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. మొదట రెవెన్యూ శాఖలో గుమాస్తాగా తాత్కాలికంగా పనిలోకి చేరాడు. తరువాత అదే గుమాస్తాగా వైద్య శాఖలోనికి మారాడు. అక్కడ రెండేళ్లు పనిచేసి గుంటూరు జిల్లా ట్రెజరీలో గుమాస్తాగా పర్మనెంటు ఉద్యోగంలో చేరాడు. అక్కడ నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. 1963లో హైదరాబాదులోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్‌లో జూనియ అకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కడ సుమారు 30 సంవత్సరాలు పనిచేసి 1993లో సీనియర్ అకౌంట్స్ ఎక్జిక్యూటివ్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు[1]. ఇతడు బి.కాం. చదువుతుండగా ఇతనికి తన అక్క కూతురు మాధురి అన్నపుర్ణతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలిగారు.
రచనాప్రస్థానం
[మార్చు]ఇతని తొలిరచన 1957లో గుంటూరు పత్రికలో అచ్చయింది. ఇతడు తొలినాళ్ళలో మాధురి అనే కలంపేరుతోను, అనేక ఇతర కలం పేర్లతోను రచనలు చేసేవాడు. ఇతడిని ఇతని గురువు మన్నవ గిరిధరరావు చాలా ప్రోత్సహించాడు. ప్రముఖ రచయితలు తారక రామారావు, కాకాని చక్రపాణి, శ్రీ సుభా, కవిరాజు, పాలకోడేటి సత్యనారాయణరావు, దత్తప్రసాద్ పరమాత్ముని, డి. చంద్రశేఖరరెడ్డి, గోవిందరాజు చక్రధర్, మల్లాది వెంకటకృష్ణమూర్తి మొదలైనవారు ఇతని సమకాలికులు, సన్నిహితులు. ఇతని రచనలు స్వాతి, నవ్య, ఇండియాటుడే, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, జ్యోతి, అప్సర, యువ, రచన తదితర దిన, వార, పక్ష, మాసపత్రికలలో ప్రచురించబడ్డాయి.
కథలు
[మార్చు]ఇతడు 230కి పైగా కథలు వ్రాసి వివిధ పత్రికలలో ప్రకటించాడు. స్వప్నం దాల్చిన అమృతం అనే కథా సంపుటాన్ని వెలువరించాడు. కథానిలయంలో లభ్యమయ్యే ఇతని కథల జాబితా[2]:
- అంతరంగ తరంగాలు
- అంతరంగం
- అంతర్ముఖుడు
- అంతస్సు
- అందం
- అజ్ఞాత శత్రువు
- అతడి నిజాయితీ
- అత్త కోడలు
- అది మనస్సు అతడు మనిషి
- అదిపీటముడి
- అదుగో పులి
- అదుపు
- అద్దం
- అనుబంధం
- అనువంశికం
- అమృతతిలకం
- అర్ధవృత్తం
- అల్లుడూ! నీకో నమస్కారం
- అసలు సంగతి
- ఆంతరంగిక స్వప్నం
- ఆకుపచ్చని ఆశ
- ఆట
- ఆడ మనసు
- ఆత్మజ్ఞానం
- ఆద్యంతాల నడుమ
- ఆద్యంతాల నడుమ నేను
- ఆనందం
- ఆమె తీర్పు
- ఆరుణోదయం
- ఆరోజు రాత్రి
- ఆలోచన
- ఆలోచించండి
- ఆల్ ది బెస్ట్
- ఆశ్రయం
- ఆసరా
- ఇది మామూలు కథే
- ఇదీ దారి
- ఇన్నింగ్స్ డిఫీట్
- ఇరవై ఆరు గంటలు
- ఇల్లాలి ఖరీదు
- ఋణం
- ఎంతదూరమీ రాత్రి
- ఎగిరిపోయిన చిలక
- ఎదురు గాలి
- ఎనిమిది కాళ్ళ దోమ
- ఎన్నిక
- ఎరుపెక్కిన చీకటి
- ఎర్రంచు తెల్లచీర
- ఒక ఇంటి భాగోతం
- ఒకే రెమ్మ...
- ఒక్క మాట
- ఔటింగ్
- కదిలే నీడలు
- కనబడని నిప్పు
- కమ్మని నిశ్శబ్దం
- కలల్లో కమలం
- కసి
- కాలే వెన్నెల
- కాలేమంచు
- కొండంత దీపం
- కొత్తపులి
- కోరిక
- గాలికన్ను
- గుండె దిటవు
- గుడ్ గాళ్
- గొడగుచూపు
- గోల
- గౌరి
- చంచల
- చల్లని ఎండ
- చావు ఒక్కటేనా దారి?
- చిన్నకోరిక
- చిలిపి కిరణం
- చీకటి గాలి
- చీకటి నీడ
- చీకటి నీడలు
- చీకటి పువ్వు
- చీకటి రాల్చినచుక్క
- చీకటి...
- చీకట్లో వెన్నెల
- జాలి
- డిసిప్లిన్
- తనబ్బీ
- తప్పదు
- తప్పు మనస్సుది
- తప్పేవిటి
- తరహా
- తరాలు అంతరాలు
- తిరుచురాపల్లి-చింతకాయ పచ్చడి
- తీయని దెబ్బ
- తులాభారం
- తృప్తి
- తెరలు
- తేడా
- తోడు నీడ
- దారి విడువు, కృష్ణా!
- దీపం వెలిగించు
- దీపావళినాడు
- దేవుడూ! మన్నించు...
- దేవుడు...దీవించు
- దోమలు
- నడుస్తున్న సముద్రం
- నన్ను చెప్పనీయ్
- నమ్మకం
- నాకీ జీవితం చాలు
- నాకు ఏడుపు వచ్చింది
- నాకేమిటి లాభం
- నాన్యః పంథాః
- నిద్ర
- నిన్నటికి వీడ్కోలు
- నిర్ణయం
- నీడ
- నీడలు నిజాలు
- నుడికట్టు
- నువ్వూ... నేనూ...
- నేను పెద్దవాడినయ్యానా
- నేను మనిషిని!
- నేనెవర్ని
- నేనొప్పుకోను
- పంచదార పెరిమిట్టు
- పయనం
- పరిష్కారం
- పరీక్ష
- పరువు
- పవన ప్రవాహం
- పసిడి రెక్కల పావురం
- పాతపులి-కొత్తమనిషి
- పిడుగు
- పుట్టినరోజు
- పునీత
- పులులోస్తున్నాయి
- పూర్ణ బిందువు
- ప్రక్షాళణ
- ప్రణవనాదం
- ప్రశ్న-సమాధానం
- ప్రార్థన
- బరువు
- భవదీయుడు
- మంచి మనిషి
- మంచు
- మంచు కాలింది
- మంచుతెర
- మంచుదుప్పటి
- మందుచూపు
- మగవాడి నీతి
- మనస్సు
- మనిషికీ మనిషికీ నడుమ
- మనుషుల్ని తినేచేపలు
- మనోదృశ్యం
- మరోస్పర్శ
- మల్లెలు, మధురక్షణాలు
- మహారాజయోగం
- మాయ
- మాయ మనస్సు
- మీలాంటి ఒకరు
- ముగింపు
- ముళ్లగోరింట
- ముసురు
- యాదృచ్ఛికం
- రక్తపుమడుగులో కాగితపుపడవ
- రాగస్రవంతి
- రెక్కల గూడు
- రేపటి ఆలోచన
- రేపటి సూర్యోదయం
- రైలు వెళ్లిపోయింది
- వదిన
- వరద గుడి
- వాన
- వాళ్లు ఇద్దరు-రాధ ఒక్కతె
- విజ్ఞత
- విరగని వీనస్
- వివేకం
- వీక్ పాయింట్
- వీడని నీడ
- వెచ్చని నీడ
- వెధవ మనస్సు
- వెన్నెల ముక్క
- వెలుగు
- శాకుంతలం
- శిక్ష
- శెలవు
- ష్...మాట్లాడకు
- సంస్కారం
- సతీవుతుడు
- సరదా
- సాదామనిషి
- సారీ బ్రదర్
- సింహాద్రి-టెర్లిన్ షర్టు
- సూచన
- స్కౌండ్రల్
- స్నేహం
- స్వంత అద్దెకొంప
- స్వప్నం రాల్చిన అమృతం
- స్వర్ణ నిర్ణయము
- స్వేచ్ఛ
- హర్ట్ పేషెంట్
నవలలు
[మార్చు]ఇతని నవలలు ప్రజామత, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, స్వాతి, యువ, ఆంధ్రజ్యోతి, ప్రభవ, ఆంధ్రభూమి, వార్త మొదలైన పత్రికలలో ధారావాహికగా ప్రచురితమైనాయి.
ఇతని నవలల జాబితా:
- అగ్నితీర్థం
- ఆమె నా భార్య కాదు
- ఇరవై ఆరు గంటలు
- ఎంత దూరమీ రాత్రి?
- ఓ సూర్యుడు... ఒక వెన్నెల
- ఓ స్త్రీ ఆత్మకథ
- కీరవాణి
- కొత్తగాలి
- గాజుపల్లకి
- జలపాతం
- ఝంఝోటి
- తులాభారం
- ధీరసాగర మథనం
- ధేనుక
- నన్ను రక్షించండి ప్లీజ్!
- నాకు పది రోజులు చాలు
- నైనం ఛిన్దన్తి శస్త్రాణి
- పిడికెడు నిశ్శబ్దం
- ప్రణవనాదం
- ప్రేమంటే మజాకాదు
- భోగమందిరం
- మిథ్యాబింబాలు
- మేఘమాల
- మొదటి రాత్రి
- రాగమయి
- రేపటి మందారం
- హింసధ్వని
- హెచ్చరిక
పురస్కారాలు, బహుమతులు
[మార్చు]- ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 1962లో నిర్వహించిన దీపావళి కథల పోటీలో శిక్ష అనే కథకు ద్వితీయ బహుమతి.
- ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 1966లో నిర్వహించిన ఉగాది నవలల పోటీలో మిథ్యాబింబాలు అనే నవలకు ద్వితీయ బహుమతి.
- ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక 1976లో నిర్వహించిన నవలాప్రియదర్శిని నవలల పోటీలో కీరవాణి అనే నవలకు బహుమతి.
- స్వాతి మాసపత్రికలో 1985లో కొత్తపులి అనే కథకు ప్రోత్సాహక బహుమతి.
- ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 1987లో నిర్వహించిన నవలల పోటీలో భోగమందిరం అనే నవలకు ద్వితీయ బహుమతి.
- ఇండియా టుడే వారపత్రిక 1997లో ప్రచురితమైన అజ్ఞాత శత్రువు కథకు తెలుగు విశ్వవిద్యాలయం వారి తెలుగు కథ 1997కు ఎంపిక.
- స్వాతి సపరివారపత్రిక 1999లో నిర్వహించిన పదివారాల నవలల పోటీలో నాకు పదిరోజులు చాలు అనే నవలకు ప్రోత్సాహక బహుమతి.
- దేవరాజు వేంకటకృష్ణారావు 116వ జయంతి సందర్భంగా 2001లో ఆశ్రయం అనే కథకు స్వర్ణపతకం.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 దండు, మల్లేష్ (1 July 2013). పి.ఎస్.నారాయణ జీవితం, రచనలు ఒక పరిశీలన (PDF). pp. 2–4. Retrieved 31 January 2017.
- ↑ రచయిత: పి ఎస్ నారాయణ
- ↑ "44 మందికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలు". EENADU. 2022-09-03. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-07.
- ↑ "Telugu University: 44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". Sakshi Education. 2022-09-03. Archived from the original on 2022-09-07. Retrieved 2022-09-07.